బక దాల్భ్యుడు -6
కేశి అంటే పొడవైన జుట్టు ఉన్నవాడు అనీ , ఆశ్వబలం ఉన్నవాడనిఅర్ధాలున్నాయి .దీర్ఘ కేశాలు పట్టరాని శక్తికి,బ్రహ్మచారికి సంకేతం .యాగ బృందాలలో వీరికి గౌరవం ఎక్కువ .దాల్భ్య లేక దార్భ్య అంటే దాల్బునికుమారుడు లేక పవిత్ర దర్భకు చిహ్నం .దర్భశతాకిని యాగం చేయలేదు .జైమినేయ బ్రాహ్మణం లో కేశి కి మరోపేరుగా ‘’శీర్ష్యాన్యః ‘’అని ఉన్నది అంటే తలపైన ఉండేవి .కనుక తలకాయకు కేశికి అవినాభావసంబంధం ఉందనితెలుస్తోంది .శతపధ బ్రాహ్మణం లో కేశి శబ్దం కేశి దాల్భ్య వంశీకులుగా చెప్పింది .కాని కథక సంహిత మాత్రం ఒక్కడే కేశిగా పేర్కొని సోమయాగం లో శత్రువులను ‘’ఆషాఢ కైశి ‘’సాయంతో ఓడించినట్లు ఉంది .ఇందులో కేశి బృందం అంటే పాంచాల కేశి బృందం ఓడిపోయింది .వీరు నైరుతిభాగపు కౌంతేయులవలనఓడారు .అప్పుడు యాగం చేసినవాడు’’ శ్యాపర్ణ సాయకాయనుడు’’ తతః కౌన్తేయః పంచాలన్ అభిత్య జిన౦తి’’.కనుక ఎక్కడైనా కేశిదాల్భ్యుడనే పా౦చాలీయుడే ప్రముఖంగా కనిపిస్తాడు .
ఋగ్వేదం 10.136 మంత్రం దీర్ఘ కేశి ఐన కేశికి అంకితం .భగవత్ ప్రేరణపొందిన మునీశ్వరులు గాలిలో ఎగురుతున్నట్లు చెప్పబడింది 10.136-2-‘’మునయోహ్వాతరాశానాః వాత శ్యాను ద్రాజీం యంతి’’.ఋగ్వేదం 10.136-6లో కేశి ప్రజల మానసిక విషయాలు తెలుసుకోవటానికి అప్సరస, గ౦ధర్వ మార్గం లో సంచరి౦చాడని,ఉన్నది –‘’అప్సరసాం గంధర్వానాం మార్గానం చారణేచరన్ –కేశి కేతస్య విద్వాన్ ‘’.ఋగ్వేదం లో కూడా కేశి కి ఆకాశ చారణం ఉన్నట్లు చెప్పబడింది .మానవ జ్ఞానం కంటే విశేష విజ్ఞానం ఉన్నవాడు .అప్సరస గంధర్వుల యాగ రహస్యాలు గ్రహించి తనకు తెలిసినవి వారికి చెప్పాడు .వీరితోనేకాక వన్య మృగాలతో నూ దోస్తీ ఉండేది .మరికొన్ని ఋగ్వేద విషయాలు మళ్ళీ తెలుసుకొందాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-6-20-ఉయ్యూరు