ప్రపంచ దేశాలసారస్వతం1 07-చైనీస్ సాహిత్యం -4(చివరిభాగం )
ఆధునికులైన అయిదుగురు చైనీస్ రచయితలూ వారి రచనలగురించి తెలుసుకొందాం.
1-చిక్సిన్ లియు -2015లో హ్యూగోఅవార్డ్అనే ప్రతిష్టాత్మక అవార్డ్ ను ‘’త్రీ బాడీ ప్రాబ్లెం ‘’ నవలకు పొందాడు ఇతనిప్రభావం చాలా మంది యువ రచయితలపై ఉంది .ఇందులో ఎర్త్స్ పాస్ట్ ట్రయాలజి ,దిడార్క్ ఫారెస్ట్ ,డెత్స్ ఎండ్ ఉన్నాయి .
2-సా షాన్ –‘’దిగర్ల్ హుప్లేయ్డ్ గో ‘’నవల జపాన్ మంచూరియాను ఆక్రమించే విషయం .ఈమె రెండవనవల ‘’ఎమ్ప్రేస్’’ రాణి ఉ జేటియాన్ చరిత్ర
3-హాన్ హాన్-;;ఐ వాంట్ టుటాక్ విత్ ది వరల్డ్ ‘’నవలో తనజనరేషన్ గొంతు వినిపించాడు .ఆన్ ది రోడ్ అనే మరోనవల రాతలాకాక టైపింగ్ లా ఉందన్నారు క్రిటిక్స్ .
4-హంగింగ్ యాంగ్ –బాలసాహిత్యం రాసి ‘’డైరి ఆఫ్ ది స్మైలింగ్ కాట్ ‘’మావోస్ మిస్చీఫ్ సిరీస్ తో మోస్ట్ పాప్యులర్ రైటర్ అయింది .ఆమెరచనలు 50మిలియన్ల కాపీలు అమ్ముడయాయి .
5-మో యాన్ –చైనీస్ సాహిత్య మొదటి నోబెల్ ప్రైజ్ పొందాడు .చైనా సాహితీ వేత్తలలో అగ్రగా ణ్యు డుగా గుర్తింపు పొందాడు .ఇతడి ‘’రెడ్ సోర్ఘుం ‘’,లైఫ్ అండ్ డెత్ ఆర్ వేరింగ్ మీ అవుట్ ‘’అతని ప్రతిభకు గీటు రాళ్ళు .మొదటిదానిలో ఒకే కుటుంబంలో మూడుతరాల జీవితం ,వారు చైనా జపాన్ యుద్ధాన్ని ఆపేప్రయత్నాలు అద్భుత శైలీ ఉన్నాయి .రెండవదానిలో ఒక చైనీస్ లాండ్ ఓనర్ అనేక సార్లు చావటం అనేక జంతురూపాలుపొందటం ఉంటుంది
చైనీస్ గొప్ప రచనలలో –దిబాడీ ప్రాబ్లెం –చిక్సిన్ లియు ,దివాగ్రంట్స్ – యియున్ లీ ,ఫ్రాంటియర్-కాన్ క్సుయి,రెడ్ సోర్ఘం –మో యోన్,వైటింగ్ –హ జిన్ ,దిడార్క్ రోడ్-మా జియాన్ ,దిసెవెంత్ డే-యు హువా ,లవ్ ఇన్ ఎఫాలెన్ సిటి –ఐలీన్ చాంగ్ ,దిలాస్ట్ డాటర్ ఆఫ్ హాపినెస్-గీలింగ్ యాన్
సమకాలీన రచయితలు –యు హువా –రాసిన క్రానికల్ ఆఫ్ బ్లడ్ మర్చంట్ అత్యదికులను ప్రభావితం చేసి౦ది .కల్చరల్ రివల్యూషన్ గురించి రాశాడు .చాలాప్రైజులు పొందాడు .
మై జియా-ధ్రిల్లర్ రైటర్.పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో ఇంటలిజెన్స్ విభాగం లో పని చేసి తన అనుభవాలకు అక్షరరూపమిచ్చి గొప్పరచనలు చేశాడు .అతనినవల ‘’దిడార్క్ ‘’ఆంగ్లానువాదం పొంది మావో డున్ ప్రైజ్ పొందింది .
చెన్ రాన్-అనేక విషయాలపై విశ్రు౦ఖలమ్ గా రాసింది .తల్లీ కూతురు అనుబంధం ,ఉద్యోగికలలు ఆశలు విజన్స్ మొదలైనవ ఈమె కథా వస్తువులు .ఈమెరాసిన ‘’ప్రైవేట్ ‘’నవల సాంస్కృతిక విప్లవం తర్వాత ఒక యువతి ఎమోషనల్, సెక్సువల్ జాగృతి గురించి .మరోనాలుగు వ్యాస సంపుటులు రాసింది .
జు జేచేన్ –చైనాలోనిపెద్దపెద్ద నగరాలలో సమకాలీన జీవితం పై రాశాడు .’’మిడ్ నైట్స్ డోర్.హెవెన్ ఆన్ ఎర్త్ ,రన్నింగ్ థ్రు బీజింగ్ ,జెరూసలెం విశేష కీర్తిపొందాయి
షెంగ్ కెయి-ఈమె నవల ‘’డెత్ ఫూగ్’’ పొలిటికల్ ఎలిగరి .ఆల్డస్ హక్స్లీ రాసిన ‘’బ్రేవ్ న్యు వరల్డ్ ‘’ను తలపిపజేస్తుంది .నార్దర్న్ గర్ల్స్ నవలలో వలసకార్మికుల దుస్థితి ఉంటుంది .మాన్ ఏషియా లిటరరీ ప్రైజ్ పొందింది
లియు ఝేనియుం –కథ,నవలారచయిత.ఇతని ‘’చికెన్ ఫెదర్స్ ఎవిరి వేర్ ‘’వర్కింగ్ యూనిట్ ‘’బాగా పాప్యులర్ అయి టివిలకు ఎంపికయ్యాయి .’’సెల్ ఫోన్’’ నవల బ్లాక్ బస్టర్ అయింది మావు డున్ ప్రైజ్ ఇతని నవల ‘’వన్ సెంటెన్స్ ఈజ్ టెన్ ధౌసండ్ సేన్టేన్సేస్’’కు లభించి ఒకటిన్నర మిలియన్ కాపీలు అమ్ముడయాయి
చైనీయ నాటక రచనలు – a number of Chinese playwrights have created works that realistically reflect the changes in the lives of Chinese before and after the founding of New China. The most memorable include ” Teahouse, ” “The Peking Man, ” ” The Thunderstorm, ” ” The Family,” “The Prairie” and “The Death of a Famous Opera Performer.” Younger playwrights have tried to develop a more modern style, exploring the inner psyche of personalities with more modernist works and incorporating more modern theatrical techniques.
· Sunrise
· Family · Teahouse · Qu Yuan |