బక దాల్భ్యుడు -10
ద్వైతవన౦ లో బకదాల్భ్యుడు స్వచ్చమైన వేదమంత్రవేత్తగానే కాక అతడు బ్రాహ్మణుల ప్రాముఖ్యం పై ఒక ఉపన్యాసం కూడా చేశాడు .ఇలా బ్రాహ్మణ విధానంగా ఉండే బకుని వామన పురాణం లో ధృత రాష్ట్ర విషయం లో బ్రాహ్మణ నీతులు కూడా చెప్పినవాడిగా చూపబడింది .జైమినేయ అశ్వమేధ౦ లో అతడు ఉత్తర సముద్ర మధ్య లోని దీవిలో, వేదకాలానంతరం సరస్వతీ నదీతీరం లోనూ ,అరణ్యమధ్య౦ లో ఉన్న ద్వైతవనం లోనూ కనిపించాడు ,.భారతం అరణ్య పర్వం 193అధ్యాయం లో మార్కండేయ మహర్షిని బకరుషి దీర్ఘ కాల వయసు గురించి ప్రశ్నించినట్లుంది .అంటే దీర్ఘకాలం ఆయన జీవించాడని అర్ధం .భారతం 9.40లో ‘’బక వృద్ధో ‘’అని ఉంది .జైమినేయాశ్వమేధం లో బకదాల్భ్యుడు మార్కండేయునితో తాను చూసిన 20మంది ప్రముఖ బ్రాహ్మణులలో ఒకడుగా వారంతా చనిపోయినట్లుగా చెప్పాడు .
మార్కండేయ సమావేశం లో ధర్మరాజు ఆయన్ను బక విషయం పై చాలాసార్లు అడిగాడు . అధ్యాయం 4వ శ్లోకం లో ఋషిని తాను ‘’బక,దాల్భ్యులు మహా విద్యావేత్తలని,చాలాకాలం జీవించారని విన్నాను’’అని చెప్పాడు –బకదాల్భ్యా మహాత్మానౌ శ్రుయేతే చిరజీవనౌ దేవరాజస్యాతావ్ రుషి లోక సమ్మతౌ’’.ఇక్కడ ఇద్దరూ వేరు వేరు గా చెప్పబడ్డారు కాని ఇది పొరబాటు ఒక్కరే బకదాల్భ్యుడు.
ఒకసారి ఇంద్రుడు అసురులతో యుద్ధం చేసి అలసి కిందకు చూస్తె అద్భుతమైన జల వనరులున్న రుషికుటీరం కనిపిస్తే కిందికి దిగి అది బకదాల్భ్యుని ఆశ్రమ౦ గా తెలుసుకొన్నాడు .అది తూర్పు సముద్ర తీరాన ఉన్నది –‘’పూర్వస్యాం దిశి రమ్యాయాం సముద్రా భ్యషతో’’ –భారతం -3193.13.ఇంద్రునిరాకకు సంతోషించి ఎంతోకాలానికి ‘’కృష్ణ’’ సందర్శనం కలిగిందని సంతోషించాడు జైమినేయ అశ్వమేధం -60.12-13.ఆర్ఘ్యపాద్యాలిచ్చి పూజించాడు .అనంతరం ఇంద్రుడు ఆయనను దీర్హకాలం జీవించటం లో ఉన్న కస్ట సుఖాలేమిటి అని అడిగాడు 3.193.15,17-27.బకుడు దీనికి సమాధానం దాటేసి ఆధ్యాత్మిక నీతి విషయాలు చెప్పాడు .స్వతంత్ర జీవనంలో సౌఖ్యం చెప్పి బ్రాహ్మణ అతిధులకు అన్నం పెట్టటం లో ఆనందం ఉందన్నాడు .ఇక్కడ మళ్ళీ మనకు ధర్మశాస్త్ర విలువలకు కట్టుబడే బ్రాహ్మణాభిమాని బకుడుకనిపిస్తాడు . ఇవన్నీ చూస్తే,బకుడు మార్కండేయునికి ప్రత్యర్ధి అనిపిస్తాడు .చాలాకాలం జీవించి మార్కండేయ చిరంజీవి స్థానాన్ని బకదాల్భ్యుడు కైవశం చేసుకొన్నాడు .మరో విషయం పరిమిత జ్ఞానం ఉన్న బక దాల్భ్యుడు లాంటి వారికి మార్కండేయుడు’’ మోడల్ ఫిగర్’’ .
జైమినేశ అశ్వమేధం లో బకదాల్భ్యుడు వటపత్ర శాయి ని కూడా చూసినట్లు ఉన్నది .బకుడు నదీ తీరం లోకాక సముద్ర మధ్యమం లో తపస్సు చేశాడు .ఒక ఉభయ చరం సహాయం తో అక్కడ తలపైఒక ఆకు పెట్టుకొన్న ఒక ఋషిని చూశాడు ఇది మార్కండేయం తో సరిపోతోంది .మార్కండేయం లో ఆదిమ సముద్రం లో వటపత్రంపై శయనించిన ఒక బాలునిఅంటే విష్ణుమూర్తి ని ఒక రుషి చూశాడు అని ఉన్నది .ఇలాంటివి చాలాపురాణాలలో ఉన్నాయి .
పద్మ పురాణ౦ ఉత్తర ఖండం ధృత రాష్ట్ర ఉదంతంలో 44అధ్యాయం లో ‘’విజయ ఏకాదశి వ్రతం ‘’లో త్రేతాయుగ కథ చెబుతూ రాముడు సముద్రాన్ని దాటటానికి అనేక ప్రయత్నాలు చేసి లక్ష్మణుడిని సలహా అడిగితె దగ్గరలోనేలంకకు భూమికి మధ్య బకదాల్భ్యముని ఉన్నాడు ,ఆయన కారణ జన్ముడు ,అనేకమంది మహర్షులతో అక్కడ ఉంటున్నాడు ఆయన్ను దర్శిస్తే ఉపాయంచెబుతాడు అని చెప్పాడు –మహాముని కేనాపి కారణేనైవ ప్రవిస్టో మానుషిం తనూం’’. రాముడు ఆయన్ను సందర్శించాగానే ఆయన ‘’ఆదిదేవ పురాణ పురుషోత్తమ ‘’దర్శనం లభించినందుకు ఆనందించి’’ ఫాల్గుణ బహుళ ఏకాదశినాడు ‘’విజయ ఏకాదశి వ్రతం ‘’చేయమని చెప్పాడు .ఆ వ్రత విధానం వివరించాడు 21-35.కాయగూరలను నైవేద్యం ,ఆవునేయి దీపారాధనలు ,బంగారు నారాయణవిగ్రహం,బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు వగైరా లన్నీ ఉన్నాయి .సూక్ష్మంలో మోక్షం లాగా బకుడు చెప్పిన ఈ వ్రత ఫలం ‘’వాజపేయయాగం ‘’చేసినంత ఫలం .ప.పు -ఉ. ఖ.-44.39.దీన్ని బట్టి మనకు బకదాల్భ్యుడు వేదకాలంలో వేదవిహిత యజ్ఞ యాగాలు చేయటమేకాక వేదానంతర కాలం లోనూ బ్రాహ్మణులతో మహర్షులతో కలసి సంచరిస్తూ కర్మకాండలు చేస్తూ స్థిరమైన ఆశ్రమ౦ స్థాపించుకొని జీవించాడు .అయినా ఆయనను నైమిశేయునిగ భారతం చెప్పింది .బకుడు కనిపించిన ప్రతిచోటులోనూ నీరు ఉండటం మరో విశేషం .ఇంకో విశేషం చిరంజీవి మార్కండేయ మహర్షికంటే వృద్ధుడు .బకదాల్భ్యుడు శ్రీరామ ,శ్రీ కృష్ణులను చూశాడు .ఈకలయికలలో అనేక ఆధ్యాత్మక విషయాలతో పాటు బ్రాహ్మణులఎడ చూపవలసిన గౌరవమర్యాదల చర్చకూడా అర్ధవంతంగా జరిగింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-6-20-ఉయ్యూరు