బక దాల్భ్యుడు -11
శ్రీ కృష్ణుని భార్యల దుర దృష్టాలకు దాల్భ్యుడు ముఖ్యకారణం చెప్పాడు .వారు అసలు అప్సరసలు .అగ్నిహోత్రుని కుమార్తెలు .వారంతా ఒకసారినారదమహర్షి ని తామంతా నారాయణుడిని భర్తగా పొందాలంటే ఏమి చేయాలని అడిగారు .అంటే వీరికి మొదట్లో కృష్ణునిపై ప్రేమ ఉన్నది .తర్వాత వాళ్ళు నారద శాపానికి గురయ్యారు .దీనికికారణం వాళ్ళు ఆయన్ను ప్రశ్నించే ముందు నమస్కారం చేయటం మర్చిపోవటమే .మత్చ్యపురాణం 70.25,పద్మపురాణం శ్రీ కృష్ణఖండం -23.100.- ‘’నారద శాపేన కేశవాయచ ‘’.దాల్భ్యుడు దీనికి పరిష్కారంగా వేశ్యలు ముక్తిపొందటానికి ‘’అనంగ దానవ్రతం ‘’చేయమని సలహా ఇచ్చాడు .ఈవ్రతంలో విష్ణుమూర్తిని’’ కామ దేవుని’’గా ఆరాధించటం ఉంటుంది ..ఈ సందర్భంలో దాల్భ్యుడు వ్రతాలు చేయించటం లో దిట్టగా పరిచయం చేయబడ్డాడు .కేశవుని చేత ముందే దాల్భ్యుడు ఆదేశి౦చ బడ్డాడు అని వారికి తెలుసు .మత్చ్య -70.18,పద్మ -23.92—ఆదిస్టోసి పురాబ్రాహ్మణ కేశవేనచ ధీమతా’’.దీన్నిబట్టి దాల్భ్యుడు మహిమగలమహర్షి ,సమాజానికి అతీతుడు,కృష్ణ భక్తులకు మార్గ నిర్దేశనం చేయగల సమర్ధుడు .దాల్భ్యుడుఅప్సరసలతో మాట్లాడటం, తర్వాత భవిష్యత్తులో యాదవ వంశం అంతా క్షయమయ్యాక గోపికలతో సంభాషించటం చూస్తె ఆయన కాలాతీతుడు అని తెలుస్తోంది .గోపికలుకూడా దాసులుగా చాలా జన్మలు పొందారు .అన్ని జన్మలలో అంటే అప్సరస జన్మలనుంచీ గోపికా జన్మలదాకా-దాస దాస్యులు గా దాల్భ్య లేక చైకితాన దాల్భ్యను వారు కలుసుకొన్నారు .
పతనం చెందిన అప్సరసలు అనే గోపికలపేర్లు వేదం ఆర్యుల శత్రువుల పేర్లుగా’దస్యులుగా రెండు సార్లు వచ్చాయి .పుట్టుకే లేని వీరిని దాసులు అన్నారు .పద్మపురాణం లో దాస బదులు దాసాలేక జాలరి లేక నావికుడు అన్నారు .వీరినే సరదాకి దొంగలు అన్నారు .బ్రహ్మకు శివుడు గోపికల భవిష్యత్తు చెబుతూ దాల్భ్య ప్రసక్తి తెచ్చాడు.వారి దాస్య విముక్తి సముద్రంనుంచి పుట్టిన రుషివల్లనే సాధ్యం అన్నాడు .ఆ రుషి బకలేక చైకితాన దాల్భ్యుడు .
పద్మపురాణం దాల్భ్యుని’’ విముక్తిదాత ‘’ఉద్ధర్త్రు దాసానాం ఆశ్రిత ఉత్తర ‘’అని చెప్పింది .ఇక్కడ దాల్భ్యునికి ఉత్తర దాసులతో పరిచయం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది .దేవ వేశ్యల కు విముక్తి ఎందుకు కలిగించాడో తెలియటం లేదు .దాసులు సముద్ర తీరాలలో ఉంటారుఅని .తెలుస్తోంది .మత్చ్యపురాణం ప్రకారం దాసులు-యాదవుల అపజయం తర్వాత కృష్ణుని భార్యలను అపహరించి సముద్ర తీరంలో ఉంచారు –‘’హ్రతాసు కృష్ణ పత్నీషు దాస భోగ్యాసు చామ్బుధౌ ‘’
బకదాల్భ్యుడు –కొంగ
అతడికి కొంగ అంటే బక పేరు ఎందుకొచ్చింది ?పాశ్చాత్య పరిశీలకుడు పాల్ ధీం సంస్కృతంలో ఉన్న పక్షుల నామాలపై రిసెర్చ్ చేసి అనేకరకాల కొంగల గురించి సుభాషితరత్నావలి లో ఉన్న విషయాలూ సేకరించాడు .వీటన్నిటి బట్టి బకఅంటే బూడిదరంగు బాతు- గ్రే హెరాన్—ఆర్డియా సినేరియా -అని నిర్ణయించాడు .కనుక మనం సాధారణంగా చెప్పే క్రేన్ అంటే కొంగ కు బక హస్తి మశకాంతర భేదం ఉన్నదన్నమాట. బక ను మామూలు కొంగ అనటం తప్పు .ఇండో –యూరోపియన్ ఎటిమాలజి ప్రకారం బక అంటే బ్+ఆక అంటే నీటికి కావలి ఉండేది –వాటర్ వాచర్ .ఇంత గొడవ ఉంది బక నామం లో .
నమ్మరాని కొంగ –హిందూ ధర్మ శాస్త్రాలలో ,కథా సాహిత్యంలో కొంగ ను నమ్మరానిదిగా చిత్రి౦చారు .నమ్మకద్రోహి గా పైకి మంచిగా ఉంటూ కుత్సితం చేసేదిగా అనేకకథలు ఉన్నాయి.మానవ ధర్మశాస్త్రం 4.196ప్రకారం One who hangs his head,
who is bent upon injuring others and upon his own gain,
dishonest, and falsely modest,
such a twice-bom is said to act like
ఈ బుద్ధిని బకత్వం అని బకవ్రతం కొంగజపం అనీ అంటారు .పంచతంత్ర ,హితోపదేశాలలో ‘’మోసపూరిత బక మహాత్మ్య ‘’కథలెన్నో ఉన్నాయి .అన్నీ మనకు తెలుసుకూడా .కొంగల ఆహారం చేపలు .ముసలితనం లో వంచన చేసి వాటిని భక్షించటం దాని నైజం .రాజుఅర్ధ సంపాదనలో ‘’బక నైజం’’కలిగిఉండాలనే హితోపదేశం కూడా ఉంది – ‘’బకవత్ చింత ఏత్ అర్ధాన్’’.అంటే మౌని బకం అంటే కొంగ జపం చేస్తూ అకస్మాత్తుగా రంగ౦లోకి జాలి,దయా లేకుండా దూకాలని భావం .
బ్రాహ్మణుడికి బకనైజంపనికి రాదు .గరుడ పురాణం లాంటి వాటిలో హేయంగా చెప్పారు అలాంటివారికి గౌరవమర్యాదలు చూపవద్దని విష్ణుపురాణం చెప్పింది అలా౦టిబ్రాహ్మడికి మంచి నీరుకూడా ఇవ్వద్దన్నది మను ధర్మశాస్త్రం .వీరిని’’ బైడాలవ్రతులు ‘’అంటే పిల్లులు లాంటి వాళ్ళు అన్నది .దీనికీ దానికీ తేడా ఏమిటి అంటే కొంగ తలవంచి ఉంటుంది ధ్యానం చేస్తున్నట్లు .పిల్లి దొంగ చూపులు చూస్తుంది మనిషి చాటు కావటానికి ,బకవ్రతులు మార్జాల లింగినులు ‘’అంధ తమిశ్రం ‘’లో పడతారునరకం లో అంటే పూర్తి చీకటికోట్లో.. తర్వాత జన్మలన్నీ నికృష్ట జన్మలే పొందుతారు .అగ్నిని దొంగిలించినా ,పాలు దొంగిలించినా వచ్చేది కొంగజన్మే అని మను, గరుడ ,మహాభారతాలు చెప్పాయి.నరకం లో మిగతా జంతువులతో కొంగ జీవులను చీలుస్తుంది ,యముడి మంత్రులలో ఒకడు కొంగ మొహంతో ఉంటాడు అనివిష్ణు పురాణం ఉవాచ-43.37.కనుక బకనైజం ఉన్న వారితో జాగ్రతోం జాగ్రతగా మనం మసలాలి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-6-20-ఉయ్యూరు