బక దాల్భ్యుడు -12
ధ్యాన కపటి –నిదానం ,తలవంచుకొని ఉండటం ,అకస్మాత్తుగా దాడి చేయటం కొంగ నైజాలు .ఇలాగే ఉండే వాడిని’’ బకవ్రతికుడు’’అంటారు ఇద్దరూ కపటులే.మౌని బకం అంటే ఆలోచనకోల్పోయి ధ్యానం చేసేవాడనీ అర్ధం .వంచన ,ధ్యానం కొంగ సహజాలు .ఆలోచనలో ఉన్నట్లు ధ్యానంలో ఉన్నట్లూ అనిపించినా అది తనను నమ్మిన చేపలను హాయిగా గుటకాయస్వాహా చేస్తుంది –‘ప్రకటిత ధ్యానోపి ‘’.మరో లక్షణం విచారం లో ఉన్నట్లు కనిపించటం ,,బ్రాహ్మణుడి లా నటించటం.జాతక కథలలో బక జాతకం ఒకటి ఉన్నది .బోధి సత్వుడు ఒకసారి చేప రూపం లో ఉంటూ బక నైజం తెలిసి దానికి ఆహారం కాకుండా ఉంటాడు .ఆ చేప రెం డు శ్లోకాలు చెప్పింది-
See that twice-bom bird, how white –
Like a water-lily seeming;
Wings outspread to left and right –
Oh, how piousl dreaming, dreaming!
What he is ye do not know,
Or you would not sing his Praises.
He is our most treacherous foe;
That is why no wing ¡e ¡6¡5″s
బుద్ధి మంతుడు బకంలాగా ఉంటూ ఇంద్రియ నిగ్రహం కలిగి ,సమయానికి తగినట్లు ప్రవర్తించాలి అని కూడా బకంమనకు పాఠం చెబుతుంది .బకం అంటే ధ్యాన సంపన్నమైనదిగా చెప్పబడింది –‘’బకో ధ్యానవాన్ ‘’.పక్షులకున్న సుందర మనోహర లక్షణాలు కొంగకు లేవు .కాని వాటికి లేని వ్రతం కొంగకున్నది .ఈ లక్షణమే పాడే, కూసే పక్షులకంటే, అంటే అతిగా మాట్లాడే, గోల చేసే వాటికంటే ఇది ప్రత్యేకంగా కనిపిస్తుంది-అంటే ముఖ దోషం వాటికుంటే దీనికి లేదు .విష్ణు ,గరుడ పురాణాలు మను ధర్మశాస్త్రం కొ౦గలను చంపటం నేరమని ఘోషించాయి .
.కార్తీకమాసంలో అయిదు రోజులు మాంసాహారం తినరాదు .అదే ‘’బకపంచాక’’ గా స్మృతులలో చెప్పబడింది .ఎందుకు ఈ పేరొచ్చింది ?కొంగలు కూడా ఆ అయిదు రోజులూ మాంసం తినవు –కాణేపండితుడు -1974-335.ఒక వేళ ఈ అయిదు రోజుల్లో ఎవరైనా మాంసం తింటే, కొంగ చేసిన పాపాపలన్నీ భరించాల్సి వస్తుంది .ఒక జాతక కథలో కొంగ ఉపవాసం గురించి ఉన్నది-జాతక 300. ఆ కథపేరు –వ(బ)కజాతక .గంగానది ప్రక్కనున్న రాతిపై ఉండే కొంగ వానాకాలం లో నీరు బండ చుట్టూ చేరితే ,ఒంటరిదై,ఆకలి తో అలమటిస్తూ ఉపవాసం ఉండాలను కొంటుంది –‘’ఉపోశథా కమ్మ ‘’.ఆసమయం లో బోధిసత్వుడు స్వర్గంలో ‘’సక్క’’ అనే రాజుగా ఉన్నాడు .ఈ బక ఉపవాస మర్మమేమిటో పరీక్షించాలనుకొని ,మేక రూపం దాల్చి ఆ కొంగ సమీపానికి వచ్చాడు .దాన్ని చూడంగానే నోరూరి తినాలనిపించి ఉపవాసం మర్నాటికి వాయిదా వేసుకున్నది .ఆ మేక అందినట్లే అంది దూరం పోతోంది అప్పుడు అది ‘’నా ఉపవాస వ్రతం ‘’చెడగొట్టుకో కూడదు అనుకొన్నది .ఈ బకకథ చూస్తె నీటితో సంబంధమున్న బకదాల్భ్య /మార్కండేయ కథ గుర్తుకొస్తుంది కదా .వీటికి గొప్ప లింకులున్నాయి .జాతక కధలలో రెండు వ్రాత ప్రతులలో తప్ప మిగిలిన వాటిలో ‘’వక ‘’అనే ఉన్నది .ఈరెండిటిలో’’ బక’’ ఉన్నది .పాళీ భాషలో ‘’వక’’ అంటే తోడేలు (వృకం )అని అర్ధం కూడా ఉన్నది .ఇక్కడి కథలో అది ఎగరలేదు కనుక ,అది తోడేలు అయి ఉంటుంది .ఇక్కడ మనకు కొంగ, తోడేలువిషయాలురెండూ కలిసిపోయాయి .
ముసలి పక్షి –బకదాల్భ్యుని విషయంలో ఆయన వయసు కూడా చర్చించాం .ఇంద్ర ద్యుమ్న రాజు కథలో ఒక కొంగ ‘’నాడీ జ౦ఘుడు’’అంటే పొడవైన కాళ్ళున్నవాడు గా పరిచయమయ్యాడు .ఇందులో మార్కండేయమహర్షి ది ముఖ్యపాత్ర .ఈకథ భారతం అరణ్యపర్వం 3.191లో ఉన్నది .ఇదే ఇంకా వివరంగా స్కందపురాణం ఉమామహేశ్వర ఖండం 2.7.13లో ఉన్నది .భారతం లో మార్కండేయులు పాండవులకు సంక్షిప్తంగా చెప్పాడు .స్వర్గం లో ఉన్న ఇంద్ర ద్యుమ్నుడు పుణ్యం ఖాతా కీర్తి అయిపోగానే భూమిపై పడతాడు .భూలోకపు కీర్తి స్వర్గంలో చాలాకాలం ఉన్నందున హరించి పోగా తన గతకాల విషయాలు చెప్పగలవారేవరైనా ఉన్నారేమో అని అడిగితె ఆయన ఎవరికీ గుర్తు లేడని అందరూ చెప్పారు.మార్కండేయుని కలిస్తే ఆయన’’ ప్రాకార కర్ణ’’ అనే తనకంటే పెద్దవాడైన గుడ్లగూబ ను అడగమంటే, అడిగితె ఇంద్రద్యుమ్నుడు గుర్తు లేడు అని ,ఇంద్రద్యుమ్న సరోవరం లో ఉన్న ‘’బక నాడీజన్ఘుడు’’ తనకంటే వయసులో పెద్ద అని చెప్పగా ,ఆఇద్దరితో కలిసి వెళ్లి చూస్తె, ముసలి దానిలాకనిపించలేదు .అందరూ కలిసి అదే సరస్సులో ఉన్న ‘’ఆకూపార ‘’అనే తాబేలు ను అడిగితె ,అది రాజును చూసి కన్నీరు కార్చింది .దీని వీపు మీదే పూర్వం ఇంద్రద్యుమ్నుడు అగ్నిహోత్రం చేశాడు .ఆయన యజ్ఞదక్షిణగా ఇచ్చిన పశువుల నడకవల్లనే ఇంద్రద్యుమ్న సరోవరం ఏర్పడింది .తాబేలు చెప్పిన ఈ విషయాలవలన రాజు నిర్వహించిన ధర్మం, పొందిన కీర్తిభూమిపై నిలిచాయి .చివరికి స్వర్గం నుంచి దివ్య రథం వచ్చి ఇంద్రద్యుమ్నుని మళ్ళీస్వర్గానికి దేవతలుతీసుకు వెడతారు .ఇక్కడ మనం తెలుసుకొన్న ముఖ్యవిషయం మార్కండేయ రుషి కంటే బకం ఎక్కువ కాలం జీవించింది .స్కంద పురాణంలో మరింత ఎక్కువగా ఆకర్షణీయంగా ఉన్నకథ తర్వాత తెలుసుకొందాం .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-6-20-ఉయ్యూరు