బక దాల్భ్యుడు -16
రాజరిక బకానికి బ్రాహ్మణ బకానికిలాగా ఋణాత్మక లక్షణాలు లేవు .రాజతరంగిణి-1.325-335 లో కాశ్మీరరాజులలో’’బక’’ పేరున్న రాజున్నాడు .క్రూరుడైన తండ్రి మిహిర కులుడుగా కాక సౌమ్యంగా ఉండేవాడు -1.289-325.ఒకసారి యితడు తాంత్రిక కార్యం లో ఉన్నాడు -1.331-35.అప్పుడు భట్ట యోగీశ్వరి మంత్రం ప్రభావం వలన స్పృహ తప్పాడు .ఆమె అందమైన స్త్రీగా మారి మోహ పరవశత్వంతో రాజును ఒక పెద్ద యాగం పాల్గొనటానికి –యాగోత్సవ మహాత్మ్యం ప్రలోభపెట్టింది.దేవి చక్రమాతృ చక్రం లో కూర్చోపెట్టింది .దీనితో భట్టా కు అద్భుత శక్తులేర్పడి ,ఒక్కసారి ఆకాశానికి ఎగిరింది .
ఈ బకరాజు ‘’బకేశ్వర దేవాలయం ‘’,బకావతి కాలువ నిర్మించాడు .ఈ రెండు బకశ్వభ్ర లో ఉన్నాయి -1.329.కథా సరిత్సాగరం -6.76,6.166లో నర్మదానదీ తీరంలో ‘’బక కచ్ఛ ప తీర్ధం’’ ఉన్నట్లు చెప్పబడింది .స్కందపురాణ౦ అవంత్యఖండం -3.230.103 లోనూ బకేశ్వర తీర్ధం ఉన్నది .నారద పంచరాత్రం 2.2.82లో బకద్వీప వర్ణన ఉన్నది ఏడు ద్వీపాలలో ఇది అయిదవది .క్రౌంచద్వీపం పేరు మహాభారతం ,అనేకపురాణాలలో 6.12.3,6.13.7,17.20ఉంది.అక్కడ ప్రసిద్ధ క్రౌంచ పర్వతం ఉంటుంది .
కొందరిపేర్లలో బక శబ్దం ఉన్నది –విశ్వామిత్రకొడుకు బకనాఖుడు –భారతం -13.40.57.సిద్ధాంత కౌముది 11.46.ఇలారాజుల స్థలాల పేర్లలోనే కాకుండా కొన్ని జాతులపేర్లలోనూ వస్తుంది .మార్కండేయం-55.42లో’’క్రౌంచ కురు బకాస్ చైవ ‘’అని ఉంది .కనుక బకాలకు క్రౌన్చాలకు ఏదో విడదీయరాని సంభంధం ఉన్నది .భీష్మ పర్వం లో ‘’బక కొకరాకాః అని ఉంది .కొన్ని ఎడిషన్స్ లో ‘’వ్యూకాస్ కోక బకాస్ ‘’అనీ ,త్రయన్గాః కోక రాకాః’’అనీ ఉన్నది.పక్షిరాక్షసి గా కూడాఉంది ఆ వివరాలు తర్వాత .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-6-20-ఉయ్యూరు