బక దాల్భ్యుడు -17
పక్షిరాక్షసి
ఇప్పటి దాకా మనకు తెలిసిన అనేక వృత్తాంతాలప్రకారం బక పేరుతొ ఉన్న అనేక పాత్రలు కృతఘ్నత అపనమ్మకం ,కపటం ,మాయ లకు ఆనవాలు గా ఉన్నాయి .దీనితోపాటు దైవీభూతమైన కొన్నిపాత్రలు రాక్షస అసురులులాగా భయంకర బకాలుగా కూడా ఉన్నాయి .అందులో చివరిది రాక్షస తత్త్వం .కొంగముఖం లో ఉండే యముడి మంత్రి గురించి చిత్రరూప కొంగల గురించీ తెలుసుకొన్నాం .వీటన్నిటి వలన మనం నేర్వదగిన సత్యం నీతి ఒకటి ఉన్నది .ఇలాంటి మనస్తత్వమున్నవాళ్ళు పతనం చెందుతారు .వైష్ణవ ఉపనిషత్ లో బకాసురుడు పొగరు బోతు. గర్వానికిప్రతిఇది –కృష్ణ –ఉపనిషత్ 14-‘’గర్వోరాక్షసః గర్వో బకః’’.కొన్నిపురాణాలలో బక కు బహు వచనాలూ ఉన్నాయి .బ్రహ్మాండ పురాణం క్రూర భయంకర రాక్షససమూహాన్ని ‘’బకులు ‘’అన్నది.వీళ్ళు వృత్రాసురుని కొడుకులే కాని తర్వాత ఇంద్రుడికి సేవకులయ్యారు .బక,యక్షరాజు కుబేరుడికీ సంబంధమున్నది .వాయు పురాణం యక్ష మణివర కొడుకుల్లో బకపేరున్నవాడు న్నాడు -69.160.మణి వరుని కొడుకులను గుహ్యకులనీ వీరు కైలాసంలో రాజాస్థానంలో ముఖ్యులని కూడా చెప్పింది .బక రాక్షసుడిని భీమ, కృష్ణులు సంహరించారు .కనుక ‘’దావే’’పండితుడు ఇలాంటి దాన్ని ‘’పక్షిరాక్షసి ‘’అన్నాడు.
భారతం ఆదిపర్వంలో ‘’బకవధ ‘’ఉపాఖ్యానం-1.145-152. ద్రౌపది పాత్ర ప్రవేశానికి ముందు హిడింబాసుర వధ జరిగింది .పాండవులు తల్లి కుంతీ దేవితో సహా సంచారం చేస్తూ గంగానదీ తీర ఏక చక్రపురం లో బ్రాహ్మణ వేష ధారణతో గడిపారు . అది ద్రుపద రాజు పాలనలో ఉన్న ‘’వేత్రకీయాగ్రహారం ‘’.ఒకరోజు నలుగురు సోదరులు భిక్షకువెడితే ఇంట్లో కుంతీ ,భీముడు ఉన్నారు .తమకు స్థానం ఆతిధ్యం ఇస్తున్న బ్రాహ్మణ కుటుంబం లో రోదనలు వినిపించాయి .కారణం అడిగితే యజమాని వివరించాడు -1.148-152.’’పురుషాదక’ మనుషులను తినే బకాసురరాక్షస రాజు సంరక్షణలో లో తమప్రాంతం ఉందనీ వాడు గొప్పరాక్షస గణంతో దగ్గరున్న అరణ్యంలో ఉంటాడని ,రక్షణకోసం వాడికి రోజూ ఒక మనిషి, దున్నపోతులబ౦డీతో బండెడు అన్నం పంపాలనీ ఆరోజు తమ గృహం వంతు వచ్చిందని ,వాడికిఆహారం సమర్పించటం తమకు అసాధ్యమనీ చెప్పాడు .అప్పుడు కుంతి వారిని ఓదార్చి తనకొడుకు భీముడు అత్యంత బలసంపన్నుడు తెలివి తేటలున్నవాడు కనుక తాను అన్నం బండీతో అతడిని బకాసురుని దగ్గరకు పంపిస్తాననీ అభయమిచ్చి౦ది -149.14.’’వీర్యవాన్ మంత్రసిద్ధాస్ చ తేజస్వి ‘’.భీముడు మాంచి హుషారుగా వెళ్లి వాడిని పేరుపెట్టి బిగ్గరగా పిలిచాడు .అప్పటికే బండీలో ఉన్న అన్నమంతా భీముడు తినేశాడు .వాడు వచ్చి చూసి గర్జించి భీముడితో తలపడ్డాడు .వాడిని సునాయాసంగా రెండుగా చీల్చేశాడు భీమ .వాడు చావగానే వాడి అనుచరులంతా భీముడికి స్నేహితులయ్యారు .వాడి శరీరాన్నీ ఈడ్చుకు వచ్చి ఏక చక్రపురసి౦హద్వారం వద్ద పడేసి,ఇక వాడి వలన ప్రమాదం తప్పిందని చాటాడు .బకవధ వృత్తాంతం పై మేడలిన్ బియార్డో,వ్యాఖ్యాత్రి ఆల్ఫ్ హిల్టే బీ లిటిల్ ల రచనలను బట్టి భారతీయ కొంగల మైధాలజి అర్ధం చేసుకోవటం తేలికయినది .కాని రాక్షస బకులకు ,సాధారణ కొంగలకు మధ్యున్న లింక్ తెలియాలి .
హిటెల్ బీటెల్ అంచనాప్రకారం ‘’వేట్రకీయాగ్రహారం ‘’బ్రాహ్మణ సంస్కృతికి విరుద్ధ౦గా ఉండే చిత్తడి భూమి .బకరాక్షాస నివాసం ఇదే .బక అనే కొంగపచ్చి మాంసం ,చచ్చిన చేపలు తింటుంది .బకాసురుడు బ్రహ్మరాక్షసజాతి వాడు అంటే బ్రాహ్మణుడు శాపవశాన రాక్షసుడైన వాడు .బలహీన రాజు వలన వాడి ఆటలు సాగాయి .బకుడు సంక్షోభ కారకుడు .ఐతే బకుడు రాక్షసుడు అవటంలో ప్రతీక ఏమిటి ?కొంగలకు చేపలకు సంబంధమేమిటి?
బకుడి లాంటి వారి నైతికత వారి సామాజిక నేపధ్యంపై ఆధార పడి ఉంటుంది .బ్రాహ్మణుడుగా బకుడు ని౦ద్యుడే కాని క్షత్రియుడుగా వందనీయుడే .బ్రహ్మ రాక్షస గుణం అతడి లోనిక్షత్రియ బక సంజాతమే ,కాని బ్రాహ్మణులకు భీకరమైనది .అణచబడిన బ్రాహ్మణుల తీవ్రస్వభావానికి ప్రతీక .బక రాక్షసుడు భారతం లో బ్రహ్మరాక్షసుల ప్రతినిధి .రామాయణం లో రావణాసురుడు లాగా .పులస్య బ్రహ్మ సంజాతులు కనుక రాక్షసులంతా బ్రాహ్మణులే .ఇప్పుడు పులస్య రాక్షసుల మధ్యలింకేమితో తెలుసుకోవాలి .పద్మ పురాణం లో పులస్త్యుడు దాల్భ్యుడికి వైష్ణవం బోధించాడు .కనుక పులస్యుడికి బకుడికి ఈరక మైన గురు శిష్య సంబంధం అంటే పులస్త్య రాక్షసులకు కూడా ఉన్నట్లేకదా .కనుక పద్మపురాణ దాల్భ్యుడు అంటే బక దాల్భ్యుడే .అంతేకాక పులస్త్యుడు రాక్షస వంశ మూల పురుషుడు కూడా . కనుక అనుమానాస్పద వ్రాత్య లేక అసుర లక్షణం అంతర్గతంగా పితృపరంగా దాల్భ్యుడికి అనువంశికంగా చేరిందన్నమాట .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-6-20-ఉయ్యూరు