సాహితీ బంధువులకు శుభ కామనలు -శ్రీ శార్వరి ఉగాది వేడుకలలో సరసభారతి మార్చి 22వ తేదీ 3పుస్తకాలు ఆవిష్కరించి ,ప్రముఖులకు పురస్కారాలు అందించి ,కవిసమ్మేళనం ఘనంగా నిర్వహించాలనుకొన్న ప్రయత్నం కరోనా వ్యాప్తి ,లాక్ డౌన్ వలన సాధ్యం కాక మాశ్రీ సువర్చలాన్జనేయ స్వామి పాదాల వద్ద ఆ మూడు పుస్తకాలు ఉంచి ,ఆవిష్కరించి నట్లు గా భావించాం . అప్పటికే ఉయ్యూరుకు వచ్చిన అతిధులకు మా ఇంట్లోనే సన్మానించి పురస్కారాలు,పుస్తకాలూ అందజేశాము అనే ఇదివరకే మీకు తెలియ జేశాము .
ఎప్పటికప్పుడు లాక్ డౌన్ పొడిగింపు వలన మిగిలినవారిని పిలవటం కుదరక వదిలేసాం ”
ఐతే దేవాలయం లో జరిగిన శ్రీ హనుమజ్జయంతి ,కళ్యాణం సందర్భంగా వచ్చిన భక్తులు సుమారు 90మందికి మూఢుపుస్తకాల 30సెట్లు అందజేశాము
బస్సులు రైళ్లు కదలిక ప్రారంభమయ్యాక ఆహ్వానింపబడిన అతిధులకు కవి మిత్రులకు ,బుక్ పోస్ట్ లో మూఢుపుస్తకాల సెట్ లు జూన్ 3నుంచి ఈ రోజు16 వ తేదీవరకు 14రోజులలో బంధుమిత్రులు అభిమానులు స్పాన్సర్లు లకు ,శ్రేయోభిలాషులకు 110 సెట్లు అంటే 330 పుస్తకాలు ,కొరియర్ ద్వారా 33మందికి అంటే 99పుస్తకాలు ,అమెరికాలో మా అమ్మాయికి 20పుస్తకాలు( ,ఊసుల్లో )ఒంటిమిట్ట డాక్టర్ శివ గారిద్వారా అక్కడ మిత్రులకు 30పుస్తకాలు_(సోమనాధ్ -కాశీ ) ,మా ఇంట్లో సన్మానించినవారికి ఇంటికి వచ్చినవారికి 15సెట్లు అంటే 45పుస్తకాలు అందజేశాము .అంటే మొత్తం-188 సెట్లు ,అనగా 564పుస్తకాలు విడిపుస్తకాలు 20+30= 50 మొత్తం 614పుస్తకాలు మహదానందంగా ఉచితంగా ,పవిత్ర కర్తవ్యంగా అందజేశాము . ఎప్పుడు ఆహ్వానించినా వెంటనే స్పందించి వచ్చి జయప్రద0చేసే కవిమిత్రులు రాలేక పోయారు కనుక వారి ఇళ్లకు పుస్తకాలు పంపి వారిని సంతృప్తి పరచాలన్నది నా ధ్యేయం . ఈ 14రోజులూ పుస్తకాలలో వారి పేర్లు రాయటం సెట్ లను ,కవర్ లలో పెట్టటం అడ్రస్ లు రాయటం , తగినన్ని స్టా0పులు అంటించి,ట్వైన్ దారంతో గట్టిగాకట్టటం అంతా ఒంటిచేత్తో చేశాను .వీటిని పోస్టాఫీస్‌కు తీసుకువెళ్లి పోస్ట్ బాక్స్ వేసే పని మా మనవడు చరణ్ ,మనవరాలు రమ్య సమర్ధంగా చేశారు ,ఒక్కోరోజు 15నుంచి 20పాకెట్స్ పంపాము . స్థానిక పొస్తల్ డిపార్ట్మెంట్ వారి సౌజన్యం ముఖ్యంగా మా పోస్ట్ మాన్ కమ్ సార్దర్ శ్రమ మరువ లేనిది .అలాగే వివిధ పోస్టాఫీసులలో ఉన్న పోస్టల్ సిబ్బంది ,డెలివరీ చేసిన పోస్ట్ మెన్ సేవలు శ్లాఘనీయం . పుస్తకాల సెట్ అందినవారంతా మెయిల్ లేక ఫోన్ ద్వారా తెలియజేయటమూ అభినందనీయం .ఇలా సాహితీ సేవలో అందరం భాగస్వామ్యులయ్యామని సంతోషంగా ఉంది మరొక్కమారు అందరికి సరసభారతి తరఫున ,నా తరఫున ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను -దుర్గాప్రసాద్-16-6-20