ప్రియమైన శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారికి,
ఎంతో ఆప్యాయతతో, ప్రతి పుస్తకంపైనా, నాపేరు వ్రాసి, మీ సంతకంతో పంపినందుకు,
నేను తీర్చుకోలేని అభిమానభారాన్ని నాపై ప్రేమతో మోపారు.
మీ పాండిత్యం, పట్టుదల, పదిమందికీ ఉపయోగపడాలనే కృషి, ఉయ్యురు చేసుకున్న పుణ్యఫలం.
మీ అపారమైన పూర్వజన్మ సుకృతం.
మీ పరిచయం నా భాగ్యంగా భావిస్తున్నాను.
మీరు, నాకన్నా, ఒక 7 నెలలు పెద్ద.
ఎన్నింటిలోనో, చాలా, చాలా శిఖరాయమానమైన కృషి
అభినందనీయమైన కృషి సాధించి చూపించారు.
పదికాలాలపాటు, ఎందరికో ఉపయోగపడే పుస్తకాలు రచించారు.
సాహితీ చైతన్యాన్ని కాపాడుతున్నారు.
ఆ పరమేశ్వరానుగ్రహం సంతతధారగా మీపై కురుస్తూ ఉండాలని, మనసారా ప్రార్థిస్తాను.