బక దాల్భ్యుడు -18
భారత అరణ్య పర్వంలో యక్ష ప్రశ్న ఉదంతం 3.295-298లో ఒకమడుగులోని నీరు తాగి పాండవ సోదరులలో నలుగురుఒకరితరువాత ఒకరు అదృశ్యమవగా చివరకు ధర్మరాజు వచ్చి,ఆకాశం నుంచి వినిపించే యక్షుని మాట లెక్క చేయ కుండా ఉంటె యక్షుడు తానె ఆయన సోదరులను దాచానని తనపేరు బకుడు అనీ తాను జలం లో ఉండే చేపలు,మొక్కలు తింటానని చెప్పాడు -3.297-11-‘’అహం బకాః శైవల మత్స్య భక్షషో’’..చివరికి యక్షుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ సంతృప్తిగా సమాధానాలు చెప్పగా ఆయన సోదరులను అప్పగించాడు .యక్షలో య బదులు ర పెడితే రాక్షసుడు అవుతాడు .ఒకరితరువాత మరొకరిని తినటం బకలక్షణం అని మనం మర్చిపోరాదు .
బాలకృష్ణుడు బకాసుర వధ చేశాడు .భాగవతం 10.11.46-53లో నంద గోపుడు బృందావనానికి తన పరివారం తో మారాడు .గోపాలురతో కృష్ణ బలరాములు గోవులను కాస్తూ ఒక సరస్సు దగ్గరకు వచ్చారు .అక్కడ అకస్మాత్తుగా బకాసురుడు భీకర శరీరం కొంగరూపం లో కనిపించాడు -10.11.48’’బకో నామ మహాన్ అసురో బకరూపా ధృక్’’.ఆ బకం ఒక్కసారిగా బాలకృష్ణుని మింగేసి ,గొంతులో విపరీతమైన అగ్ని మంట ఉన్నట్లు బాధపడి వెంటనే కక్కేసింది .కృష్ణుడు బయట పడగానే తనపెద్ద ముక్కుతో దాడి చేసింది .దాని ముక్కు పట్టుకొని రెండుగా చీల్చి చంపేశాడు –‘’లీలయా ‘’.
పద్మ పురాణ ఉత్తర ఖండం -245.95-100లో కృష్ణుడు బకాసురుడిని దాని రెక్కలపై మట్టి ముద్దలు వేసి చంపాడని ఉన్నది –‘’లోస్టం ఉద్యమ్నలీలయా తదాయామాస పక్షంతే’’.దీన్ని బట్టి తేలింది బృందావన అరణ్యం అసుర నిలయం .యక్ష ప్రశ్నలలో పాండవ సోదరులను మింగిన బకం భీముడు తన వంశంవాడైన బకాసురుడిని చీల్చి చంపటానికి తీర్చుకొన ప్రతీకారం అనిపిస్తుంది .రాక్షస అసుర యక్షులు లకు భీకర బకాలతో సంబంధం ఉన్నవాళ్ళు .ఒక బకుడి పేరు దైత్య అనీ పురాణకథనం .కృష్ణుడు బకాసుర ఇతర రాక్షసుల వధ చేశాక దేవతలను అసురులను జయించిన దైత్యులను తొలగించేశాడు భాగవతం 10.46.26-దైత్యాః సురాసుర జితో హతా యేన’’.స్కాందపురాణ ప్రభాస ఖండ 4.20లో అనేకమంది దైత్యులు కృష్ణ బలరాములచేత వారి చక్రహలాయుదాలతో చంపబడినారని ఉంది-4.20.50-‘’సంకర్షణో జనార్దనౌచక్రా లా౦గల ఘటేన జఘ్నతుర్ దానవోత్తమాన్ ‘’.అందులో బకుడు కూడా ఒకడు 25-‘’బకాస్ చదైత్యో బహుసైన్య సమన్వితః ‘’బకుడిని చక్రాయుధంతో కృష్ణుడు సంహరించాడు -51-‘’చక్రేణచ శిరః కయాచ్చిచ్ఛేదాసు బకస్య వై ‘’ .
భాగవతం లో బకాసురుని సోదరిపేరు బకి .ఈపేరు పూతనను కు వర్తిస్తుంది .3.2.23లో పూతనను బకి అని చెప్పింది.అంటే చనిపోయిన కొంగ లాంటిది కామరూపం లో ఆకాశ సంచారం చేసింది .ఇదిపూతన లక్షణం .హరివంశం -50.20లో పూతన పక్షి గా చెప్పబడింది కూడా .ఈ ఆడ రాక్షసి మాయోపాయంగా అటూ ఇటూ ఎగురుతూ ఒక్కసారి అకస్మాత్తుగా దాడి చేస్తుంది .ఇది అగ్నిశిఖా అనే రాక్షసి లక్షణం .ఇది కొంగ రూపి.దీన్ని వేదంలో చెప్పబడిన కేశి దాల్భ్యుడు అనిపిస్తుంది .పురాణ ఇతిహాసాలలో అసుర రాక్షసులకు కుటు౦బాలున్నట్లు,వీరికి అన్నిరూపాలు దాల్చే శక్తి ఉన్నట్లు ,జంతు పక్షి రూపాలూ పొందినట్లు ఉన్నది .ముఖ్యంగా బక రూపం అందులో ఒకటి .రామాయణం లో రావణుడు చనిపోయాక సహస్ర స్కంద రావణుడు ,మహిరావణుడు గురించి వస్తుంది .వీళ్ళు రావణుని బంధువులే .బకాసురుడు బ్రహ్మ రాక్షసుడు కనుక తన శత్రువులను చంపటానికి బహువేషాలు ధరించాడు .బకుని అన్నలు కిమ్మీరుడు, అల౦బ ఆలాయుదులు .హిడి౦బుడిని బకుని దగ్గర బంధువుగా చెప్పలేదు .కాని బకుని జంటగా చాలాసార్లు వస్తాడు .బకుని ముఖ్యానుయాయి ‘’ఆది’’.
కిమ్మీరలేక కిర్మీర అంటే రంగులు మార్చేవాడు .భారత అరణ్య పర్వ12వ అధ్యాయం ‘’కిమ్మీర వధ ‘’3.12.6-9లో పెద్ద కోరలు భయంకర శబ్దం చేస్తూ నిలబడ్డ జుట్టుతో –‘’ఊర్ధ్వ శిరోరుహా ‘’మహారాక్షసుడురుతుపవనంలాగా ఉన్నాడనిచేప్పింది –సబాలకం ఇవ అంబుదం’’అంటే బకుని సోదరుడు .కిర్మీరుడు తన శక్తులతో పాండవులను ఎర వేద్దామని ప్రయత్నిస్తే ధౌమ్యుడు శక్తిగల రాక్షస సంహార మంత్రాలను ఉచ్చరించిమాయలు పారకుండా చేశాడు . –‘’రక్షోఘ్నైర్ వివిధైర్ మంత్రైర్’’.తన తమ్ముడు బకాసురుడిని,-‘’అహం బకాస్య వై భ్రాతా ‘’స్నేహితుడు హిడి౦బా సురుడిని-32 భీముడు చంపినపగ తీర్చుకోవటానికి కిర్మీరుడు భీముడితో మల్లయుద్ధం చేశాడు-32.చివరికి భీముడు బలి పశువు ను సంహరించినట్లు కిర్మీరుడిని హతం చేశాడు-63 -‘’పశుమార౦ అమారయన్ ‘’ .
మిగిలిన సోదరులైన అలంబుస అలాయుధ కౌరవ సైన్యంలో చేరిన రాక్షససోదరులు .ఇద్దరూ అనేక మాయలతో భీముడితో యుద్ధం చేస్తే, భీముడికొడుకు ఘటోత్కచుడు కూడా రాక్షసాంశ ఉన్నవాడుకనుక అవే కిటుకులు ప్రయోగించి వారిద్దర్నీ చంపాడు .అల౦బుసుడి మొదటి శత్రువు ఆర్ష్య శృంగి-7.83.,13.84 ,40.అల౦బు పక్షిరూపం పొందలేదుకాని పన్నగ రూపం పొందాడు-‘’పన్నగా ‘’ .అర్జునునికొడుకుసగం నాగు పాము రూపంలో ఉన్న ఐరావణు డితోఆలంబ పోరాడుతూ ,తాను గరుత్మంతుడు రూపం పొందినట్లు భ్రమకల్పింఛి చంపాడు -6.86.68-69.
అలాయుధుడు భారతం-7 .151-153ప్రకారం బక భ్రాత్రుడే-బక భ్రాత్రుర్’’బకజ్ఞాతి -153.33.భీముడితో యుద్ధానికి దిగి ,చివరకి ఘటోత్కచునితో మాయయుద్ధం చేసినపుడు వాలిసుగ్రీవుల్లా ఉన్నారని పోల్చారు -7.153.37.అలమ్బుస అలాయుదులు కూడా బహు రూపదారులైన , మాయావులైన రాక్షస సోదరులు అని తెలుస్తోంది .మరోకేరక్టర్ ఆది గురించి తరువాత తెలుసుకొందాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-6-20-ఉయ్యూరు