బక దాల్భ్యుడు -21(చివరిభాగం )
కర్మ జ్ఞానాలమధ్య సందిగ్ధత జైమినేయ ఆశ్వమేదంలో బకదాల్భ్యడు యాగకర్మి గా,మధ్యవర్తి గా కనిపిస్తాడు .ఇక్కడ ఈ విషయంకాక మూడోమార్గం భక్తిని ప్రవచించాడు .వటపత్రశాయి ఉదంతంలో అసలైన సత్యాన్ని బకుడికి బోధించాడు .కేశిధ్వజుడు రెండుమార్గాలనూ అనుసరిస్తే ,ఖాన్డికుడు కర్మనే ఎంచుకొన్నాడు .అంతిమ సత్యానికి రెండూ వేరు దార్లు అయినా రెండిటినీ కలిపితేనే సాధ్యం అని మనకు తెలుస్తోంది .
ముగింపు
వేదసాహిత్యం ,వేదానంతర సాహిత్యాలలో సామాన్య వ్యక్తులకు కూడా లబ్ధ ప్రతిష్టులైనవారితో సమాన ప్రాతినిధ్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది .బకదాల్భ్యుడు వేదాకాలనికిముండదు వేదకాలం లోనూ వేదాన౦తర కాలంలోనూ సనాతనభావాలను అనుసరిస్తూనే ఉన్నాడు .ఋగ్వేదంలోని ఆకాశ గమన కేశిగా ,సత్రయాగిగా ,వ్రాత్యకర్మయోగిగా ,పవిత్ర సన్యాసిగా ,పేరుపొందిన పక్షిగా ,తీవ్రస్వభావి అయిన దైవాంశ సంభూతుడుగా ,భయంకర పక్షి రాక్షసుడుగా ,పురాణకాలం లో తీర్దాలు సందర్శించి వాటి ప్రభావాలు వివరించే వాడుగా ,బ్రాహణులలో బ్రాహ్మీమూర్తిగా సర్వం తెలిసినవాడుగా ,సంప్రదాయ బోధకుడుగా బహురూపాలలో కనిపిస్తున్నాడు .
వేదకర్మకాండ గ్రంథాలలో పితృ వంశ నామధేయుడిగా దాల్భ్యుడు కనిపిస్తాడు .అయినా వేదదాల్భ్యుడు (బక,కేశి ,చైకితాన్య )మిడిమిడి జ్ఞానంతో ,కర్మకాండ తెలిసిన వాడుగా ప్రత్యర్ధితో వైరంతో శాపాలిచ్చేవాడుగా ,అందులో కురు పాంచాలుర మధ్య పోటీదారుగా కనిపిస్తాడు.బకాదాల్భ్యలేక గ్లవ మైత్రేయ ,చైకితానేయ లేక చైకితాన్య దాల్భ్యుడు సామవేద ఉద్గాతలలో కనిపిస్తాడు .కానీ కేశి దాల్భ్యుడు యాగలేక యజ్ఞ యజమాని ఐన క్షత్రియుడుగా కనిపిస్తాడు అనేక దాల్భ్య వృత్తాంతాలలో తరచుగా కర్మిస్టి గా సత్రయాగ లేక వ్రాత్య బృందాలలో కనిపిస్తాడు .వేదసాహిత్యంలో కేశి దాల్భ్యుడికి ప్రత్యేక పాత్ర ఉన్నది.వేదానంతర సాహిత్యంలో ఇలాంటి ప్రాముఖ్యత ఆయనకు ఎక్కడా లేదు .అయినా ఆయనకు బకాదాల్భ్య వంటి విడదీయరాని సంక్లిష్ట నేపధ్యం ఉన్నట్లు కనిపిస్తుంది .అసురకేశి చావు రెండుగా చీల్చబడటం తో జరుగుతుంది .ఏ దోషం లేని కేశిదాల్భ్యుడు అనేక పురాణాలలో కనిపిస్తాడు .
ఋగ్వేదంలోని ఎగిరే కేశి ,దాల్భ్యుడు ,వ్రాత్యకర్మలతో లింకున్న వేదానంతర పాత్ర.జైమినేయ అశ్వమేధం లోని బకదాల్భ్యుడు ,ఋగ్వేద కేశిమూలాలున్నవాడు అనిపిస్తాడు .ఆకాశగమన దాల్భ్యుడు ఋగ్వేదంలోని కర్మకాండ రహస్యాలు తెలిసిన గ౦ధర్వ ,అప్సరసలతో సంబంధమున్నవాడు .జాతక కథలలో రోషావేశమున్న దైవాంశ కల బకుడుగా అనేక పక్షిజాతుల నాయకుడుగా జైమినేయ అశ్వమేధ౦లొని బకదాల్భ్యుడుగా కన్పిస్తాడు.దాల్భ్యుడి అతీత శక్తులకు నేపధ్యం బక,కేశి లు రాక్షసగణాలుగా, అసురులుగా మారటమే .ఈపతనం అంతా భయంకరాకారం కల బెగ్గురు పక్షుల అంటే బకలేక కారిక ద్వారా వచ్చిందే .ఇక్కడే బకుడికీ, యమ అవతారానికి సంబంధం కలిగింది .కేశి పదం లో అంతరార్ధం దీర్ఘ కేశాలున్నవాడే అనికాకుండా ,కర్మిస్టి భూత పిశాచ భేతాళ రూపలున్నవాడు అనికూడా .ఇతిహాస ,పురాణాలలో రాక్షస బకునికి సోదరులు ,బంధుగణం ఉన్నట్లు చెప్పబడింది .బక గణం అనేది ప్రపంచం చుట్టూ తిరిగే దుస్టాత్మలకు,సమూహంగా జీవించే సామాన్య పక్షిజాలానికి మధ్య సమీకరణం వంటిది .బాగా సమీక్షిస్తే బకం అనే భావన , వేదం కాలానంతర బకదాల్భ్యుడు- వేద బకదాల్భ్యుని చక్రభ్రమణమే(రీ సైక్లింగ్) .వేదానంతర బక దాల్భ్యుడు అనేక కొంగ లక్షణాలకలగా పులగమైన (కాన్ గ్లొమేరేషన్)ఉన్న ఎగిరే శక్తికల పితృవంశ పేరున్న దాల్భ్యుడే ఇదికాక కొంగకున్న అవలక్షణాలైన విశ్వాస ఘాతుకం కపటం ,దొంగజపం ముసలి తనం ఉన్నవాడే .ఒక్కోసారి పక్షిరూపం లో రూక్ష దైవీ భూత శక్తితో సర్వజ్ఞుడైన పక్షిరాజుగా ,ఎగిరే శక్తిఉన్న శివుని అవతార అంశగాకనిపిస్తాడు .కర్మిస్టులైన వ్రాత్యులయెడ, వేద బ్రాహ్మణుల వైఖరికి ధ్యానబకం ప్రతీక .బక అంటే బ్రాహ్మణుల వ్యంగ్య చిత్రం (కారి కేచర్ ).బకం అంటే అణచబడిన బ్రాహ్మణుల భయం ,కోపం ,దూకుడు శత్రుత్వాల ప్రతిబింబమే సామూహికంగా ,వ్యక్తిగతంగా .
ఈ 21 ఎపిసోడ్ ల ధారావాహికం ‘’బకాదాల్భ్యుడు ‘’కు ఆధారం – SOCIATES ORIENTALIS FENNICA –HELSINKI-1999లో ప్రచురించిన ’STUDIA ORENTALIA’’-85 VOLUME .లో ‘’ BAKA DÄLBHYA: A COMPLEX CHARACTER
IN VEDIC RITUAL TEXTS, EPICS AND PURÄlyAs
రచయిత -Petteri Koskikallio
ఈ రచయితకు ప్రేరణ – సంజసేన్ నాస్టాల్జియా కవిత –
[Or I wish I we¡e a minor character
in an age-old myth
flitting about the background,
unexplained, once or twicel
అందుకే ఇంతకష్టపడి ఇష్టపడి ఇంతపరిశోధన ,పరిశీలన ,తులనాత్మక అధ్యయనం చేసి వెన్నముద్ద తీసి చేతిలో పెట్టినట్లు పెట్టాడు బకాదాల్భ్యుని గురించి అతని ఓపిక శ్రమ అన్వేషణ ,తపన కు జేజేలు .ఇతని ఇతర పుస్తకాలు –వేదిక్ ఇన్వెస్టి గేషన్స్,లాజిక్ ఇన్ ఎర్లియర్ క్లాసికల్ ఇండియా,ఆరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ దిపురానిక్ టెక్స్ట్ కార్పస్ ,స్క్రిప్ట్ అండ్ ఇమేజ్ ,జైనా స్టడీస్ .-మొదలైనవి .
మహాభక్తుల పైశ్లోకం జ్ఞాపకం వచ్చి అందులో దాల్భ్య పేరు చూసి ఆయనెవరో తెలుసుకోవాలని అన్వేషించిన నాకు కొంత సమాచారం దొరికి ‘’ఎవరీ దాల్భ్యుడు ?’’వ్యాసం రాశాను .మా అబ్బాయి శర్మ నా తపన గ్రహించి పై పుస్తకాన్ని లింక్ ద్వారా పంపాడు .మొదలు పెట్టి చదువుతుంటే ఎన్నో ఆసక్తికర విశేషాలు గోచరించి వెంటనే ‘’బక దాల్భ్యుడు’శీర్షికతో 27-5-20న ప్రార౦భించి ఇవాళ 19-6-20న చివరి ఎపిసోడ్ 21తో ముగిస్తున్నాను .ఏ దేశం కన్న బిడ్డో ఆ రచయిత మన వేద ఉపనిషత్ ఇతిహాస పురానణాలపై సాదికారాధ్యయనం చేసి అమూల్య విషయాలు అందించాడు .అతడు ఏ దేశంవాడో నెట్ లో వెతికితే నాకు దొరకలా .దొరికాక అతిని గురించి రాసి ఋణం తీర్చుకొంటాను .ఇంతదాకా నాతో మీరూ బకంగా ఎగురుతూ ఆస్వాది౦చి నందుకు ధన్యవాదాలు .
సమాప్తి
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-6-20-ఉయ్యూరు
” బకదాల్భ్యుడు ‘’ అనే పెరుగూడా వినలేదు .. మీ ఆసక్తితో మా అందరినీ అనురక్తులను చేసారు. ఈ లాటి పురాణ చరిత్రలు ఒకసారి హడివితె సరిపోదు .. ఇక బిగిన రెండవసారి చదవాలి.
మాకీ అవకాశం కలిగించినందుకు మీకు ధన్యవాదములు 💐 ఈశ్వర్