ప్రపంచ దేశాల సారస్వతం
108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -8
మాధ్యూ ఆర్నాల్డ్ తనకాల సమకాలికుల మానసిక వ్యధలను ‘’ది స్కాలర్ జిప్సీ ‘’’’థిర్సిస్’’,’’రగ్బీ చాపెల్ ‘’కావ్యాలలో గొప్పగాచిత్రించాడు .ఆయనరాసిన ‘’సోహ్రాబ్ అండ్ రుస్తుం ‘’’’మేరపి ‘’ట్రాజేడీలు చిరస్మరణీయాలు .సాహిత్య విమర్శకాగ్రేసరుడు ఆర్నాల్డ్ .కవిత్వ ప్రయోజనం ,సాహిత్య విమర్శఅవసరాలగురించి ప్రయోజనాత్మక విలువైన వ్యాసాలూ రాశాడు .వర్డ్స్ వర్త్ మొదలైన కవుల కవితా శిల్పాన్ని ప్రామాణికంగా విశ్లేషించి రాశాడు .ఈకవికి అత్యంత ఆప్తుడైన ఆర్ధర్ యూక్లిఫ్ఫ్ రచనలలో అప్పటి విద్యావంతుల మనస్తత్వం ప్రతి ఫలిస్తుంది .
అప్పుడే ఎడ్వర్డ్ ఫిట్స్ ఫిట్జెరాల్డ్ పార్శీభాషలోని ఉమర్ ఖయ్యాం రుబాయిత్ లను చేసిన స్వేచ్చానువాదం బహుళ జనాదరణ పొందింది .మతవిశ్వాసం తగ్గి ,భౌతిక వాదం పెరిగి తే వచ్చే అనర్ధాన్ని జేమ్స్ టాంసన్ కవి ‘’డూమ్ ఆఫ్ ఎ సిటి ‘’,’’ది సిటిఆఫ్ డ్రెడ్ఫుల్ నైట్ ‘’కావ్యాలలో చిత్రించాడు .నాటి వచనరచనా భీష్ములు కార్లైల్ ,రస్కిన్ ,న్యూమన్ ,మెకాలే .సమాజలోపాలను ఎత్తి చూపి ప్రజా దృష్టికి తెచ్చారు .ఆదర్శ సమాజ నిర్మాణానికి కార్లైల్ ,రస్కిన్ లు రచనలు చేశారు .కార్లైల్ రాసిన ‘’సార్టర్ రి పార్టర్’’,ఫ్రెంచ్ రివల్యూషన్ ,హీరోస్ అండ్ హీరో వర్షిప్ గ్రంథాలు విలువైనవి. రస్కిన్ రాసిన ‘’సేసెం అండ్ లిలీస్ ‘’అన్ టు ది లాస్ట్ ‘’క్రౌన్ ఆఫ్ వైల్డ్ ఆలివ్ ‘’గ్రంథాలు ప్రసిద్ధమైనవి .ఆదర్శ విశ్వ విద్యాలయ లక్షణాలను కార్డినల్ న్యూమాన్ ‘’ది ఐడియా ఆఫ్ ఎ యూని వర్సిటి ‘’లో అత్య౦త సమర్ధవంతంగా రాశాడు ..తేజోమయ కా౦తిమార్గంలోకిదారి చూపమని ఆయనరాసిన ‘’లీడ్ కై౦డ్లి లైట్ ‘’అనే ప్రార్ధన విశ్వ విఖ్యాత గీతమైంది .జాన్ స్టువార్ట్ మిల్ తన స్వీయ చరిత్ర ,స్వాతంత్ర్యం గూర్చి రాసిన వ్యాసాలు ,మెకాలే రాసిన ‘’ఇగ్లీష్ దేశ చరిత్ర ‘’గొప్ప కరదీపికలు .చారిత్రకాలే అయినా శైలీ రమ్యతవలన సాహిత్య గౌరవం పొందాయి .
ఆనాటి వచన రచనలో సామాజిక నవలారచయిటలలో శిఖరాయమానుడు చార్లెస్ డికెన్స్ .జీవళ తోరాణించే పాత్రలను ఆయన సృష్టించాడు .కరుణ హాస్యాలతో ,కథన శిల్పంతో వర్ణన నైపుణ్యంతో అనితర సాధ్య ప్రతిభ ప్రదర్శించి ‘’ఎ టెల్ ఆఫ్ టు సిటీస్ ‘’ఆలివర్ ట్విస్ట్ ,డేవిడ్ కాపర్ ఫీల్డ్, గ్రేట్ ఎక్స్ పెక్టేషన్స్ ,,పిక్విక్ పేపర్స్ ,నికలస్ నికల్ బి ‘’,మార్టిన్ చూజిల్ విట్ వంటి అత్యుత్తమ శ్రేణి నవలలు రాసి ప్రపంచ ప్రసిద్ధుడయ్యాడు .ఆనాటి అథోజగత్ సహోదరుల దీనహీన దయనీయ జీవితాలను కళ్ళకు కట్టినట్లు చిత్రింఛి పరిష్కారమార్గాలను సూచింఛి మార్గదర్శి అయ్యాడు .ఆంగ్ల నవలాకర్తలలో డికెన్స్ కు మించిన వారులేరు లేరు లేరు అని ఎలుగెత్తి చాటారు ఆనాటి ప్రముఖ సాహితీ విమర్శక విశ్లేషక నవలా రచయితలైన స్టీఫెన్ లీ కాక్,సోమర్సెట్ మాం లు .
డికెన్స్ సామాన్య అతి సామాన్యుల గురించి రాస్తే ,అప్పటి ఉన్నత వర్గీయుల చిద్విలాస భోగాలను రచనలలో పొందు పరఛి అన్యాపదేశంగా వారిపోకడలను విమర్శించాడు థాకరే.ఈయన నవలలో ‘’వానిటి ఫెయిర్ ‘’హెన్రి ఎస్మండ్ ,పెంఢెనిస్ ముఖ్యమైనవి .మేరీ ఇయాన్ ‘’జార్జ్ ఇలియట్ ‘’మారుపేరుతో ‘’యాడం బీడ్’’,ది మిల్ ఆన్ దిప్లాన్ ,సైలాస్ మార్నర్ ,మిడిల్ మార్చ్ నవాలలతో నైతిక సంఘర్ష ,విషాద భావోద్వేగం ,చిత్రించింది .జార్జ్ మెరెడిత్ సుకుమార హాస్య వ్య్నగ్యాలను పండిస్తూ ది ఆర్డియల్ ఆఫ్ రిచర్డ్ ఫెవేరెల్ ‘’దిఈగోయిస్ట్ ‘’నవలలు రాశాడు .ఆకాలం లో అందరూ నవలా రచయితలే అనిపించి వేలాది నవలలు రాసి వదిలారు .విలియం విల్కీ కాలిన్స్ ,’’ది వుమన్ ఇన్ వైట్’’,రాస్తే ,షార్లెట్ బ్రాంటీ’’జేన్ ఐర్’’,ఎమిలీ బ్రా౦టీ’’విదరింగ్ హైట్స్ ‘,చార్లెస్ కిన్గ్స్లీ ‘’హె హెవర్డ్ దివేక్’’,యాంటోని ట్రల్లోప్’’బార్చెస్టర్ టవర్స్’’,చార్లెస్ రీడ్ ‘’ది క్లాయిస్టర్ అండ్ ది హార్త్ ,టామస్ హ్యూస్’’టాం బ్రౌన్స్ స్కూల్ డేస్’’’,బ్లాక్ మూర్ ‘’లార్నాడూన్’’,మిసెస్ గాస్కెల్’’క్రాన్ ఫర్డ్’’ముఖ్యమైనవి .వీరికి భిన్నంగా రాబర్ట్ లూయీ స్టీ వెన్సన్ వాస్తవ చిత్రణకాకుండా కల్పనా కథలతో ‘’ట్రెజర్ ఐలాండ్ ‘’డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్ వంటి స్ప్లిట్ పర్సనాలిటి గలపాత్రతో వినోద నవలలు రాశాడు .ప్రసన్న మాదుర్యం భావ గాంభీర్యంతో ఎన్నో వ్యాసాలుకూడా రాశాడు స్టీవెన్సన్ .
కళలకు ఇయ్యాల్సిన ప్రాముఖ్యాన్ని గురించిరస్కిన్ చేసిన పరిశోధన ఫలితంగా ‘’ప్రీ రాఫెలైట్’’ సాహిత్యోద్యమం వచ్చి హోల్మన్ హంట్ ,మిల్లియాట్ ,డిజి రోసెట్టీ అనే యువ చిత్రకారులు సారధ్యం వహించి నవజీవనానికి సౌందర్యమే సాధనం అనీ ,సౌందర్యం ఉన్న కళలేసమాజ వికాసానికి తోడ్పడుతాయని ప్రచారం చేశారు .వీరిలో రాసేట్టీ ,విలియం మారిస్ ,స్విన్ బర్న్ కవులు ముఖ్యులు .రహస్యవాదం పై మోజు సింబాలిజం ,రస స్పోరక శబ్ద చిత్రాలు -ఇమేజరీ కల్పనా వీరికావ్యాలలో పుష్కలం .రోసేట్టే రాసిన ‘’ది బ్లెస్సెడ్ డా మొజల్ ,ఖండకావ్యం ,మారిస్ రాసిన ‘’ది ఎర్ది పారడైజ్’’,కాల్పనిక కథాకావ్యం ,స్విన్ బర్న్స్ ‘’అటలాంటా ఇన్ కాలిడన్’’,రూపకం రసవంతమైనవి .రోసేట్టీ సోదరి క్రిస్టినా రోసేట్టీ ‘’మై హార్ట్ ఈజ్ లైక్ ఎ సింగింగ్ బర్డ్ ‘’వంటి భావగీతాలు రాసింది .కోవెంట్రి పాట్మోర్ ‘’దిఏంజెల్ ఇన్ ది హౌస్ ‘’అనే రమణీయ కావ్యం రాశాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-6-20-ఉయ్యూరు