నేను వెళ్తాను అనొద్దు –ఖాజీ నజ్రుల్ ఇస్లాం కవిత
ఓనా ప్రియాతి ప్రియా !నేను
వెళ్లాల్సి ఉంటుందని అనొద్దు.
నాతో ఆటలాడ వద్దు వద్దు వద్దు వద్దు .
ఇవాళ తోటలో పూలు చెప్పని
భావాలతో శ్రుతికలుపుతున్నాయ్
వాటిని నేను సిగ్గుతో ,బాదితభావాల
వలన చెప్పలేకపోతున్నాను.
ఈ సిగ్గు ఎక్కడి నుంచి వచ్చి
నన్ను చుట్టేసిందో ఎవరికి తెల్సు ?
కన్య మొదటి ప్రేమచూపులా
నీ కళ్ళల్లోకి చూడలేను
ఎంత లోతుగా నేను భావిస్తే
అంత సిగ్గు నన్ను ముంచేస్తోంది
అంత సిగ్గరినౌతున్నాను నేను
నా ఆశలను నీపాదాల
క్రింద వేసి నలిపేయొద్దు.
ఆధారం –ఖాజీ నజ్రుల్ ఇస్లాం ‘’ప్రియో జైజై బోలానా ‘’బెంగాలీ కవితకు –కాష్ఫియా భిల్లా ఆంగ్లానువాదం కు నా తెలుగు స్వేచ్ఛానువాదం .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-6-20-ఉయ్యూరు