5-మానవాత్మా భయపడకు –పద్మభూషణ్ ఖాజీ నజ్రుల్ ఇస్లాం కవిత
ఇవాల్టి అధికారం ముళ్ళు, దెయ్యాల చేస్టలకు ప్రతినిధి
అధికార దాహంతో అక్కడ రాక్షసులు ఆటాడుకొంటూ తీరిక కేకుండా ఉన్నారు
భయపడకు ఓ మానవాత్మా దుఖంతో పొంగిపొరలి కన్నీరు కార్చకు
పాతళలోకపు తాగుబోతు ఇక ఎంతో కాలం అక్కడ ఉండలేడు
అన్యాయం, చేసిన తప్పుల ముళ్ళతో అతని కిరీటం నల్లమచ్చలతో వెలవెల బోయింది
అణచబడిన వారి శాపాలతో అతడి ఖడ్గం త్రుప్పుపట్టింది
ముదురు పసుపురంగు పులుముకొని ఆకాశం
ఋతుపవన వర్షాల తుఫానుతో
వంచనాశిల్పమున్న దురాశాపరులపై
అత్యంత శక్తిమంతంగా విరుచుకు పడుతుంది
ఇది అందమైన సంధ్యాసమయం .
వారిలోని అగ్ని ప్రపంచామంతా వ్యాపిస్తుంది .
ఆ మహాగ్ని జ్వాలల్లో వారెక్కడున్నా మాడిమసి కావాల్సిందే .
ఓసత్యమార్గ గామీ !దిగులు, భయం వద్దు .
శాంతికాముకులకు ఓటమి ఉండనే ఉండదు ప్రియతమా .
ఒక్కోసారి శాంతిప్రేమికుల శత్రువులు ముసుగు లో ఉండి గెలవ్వచ్చు
చివరికి వారికి దక్కేది పరాభవం ,అవమానంతో మరణమే .
గాలి ఉధృతంగా వీస్తే రోడ్డు మీద దుమ్ము ఎగిరిపోతుంది
అది చూసి దాన్ని వారి ఉత్థాన౦ అనుకుంటే ,అది పొరబాటే .
నిజంగా ఉన్నతి సాధించేవారికి దారిలో ఈ చెత్త అడ్డు నిలుస్తుంది
రోడ్లను జారేట్లుగా చేస్తుంది కాని బురదది ఆనాటి విజయం మాత్రం కాదు .
విజయమైనా ,ఓటమి అయినా ప్రశాంత చిత్తులు ఒకటిగానే భావిస్తారు .
మనం గెలిస్తే దైవానికి,ఆయన ,కీర్తికీ ,పేరుకీ మనం గెలుపును అంకితమిస్తాం
ఓడిపోతే ఆయనే మనల్ని తర్వాత పరామర్శిస్తాడు
ఒకవేళ యుద్ధం లో గాయపడితే ,ఆయనకు శాశ్వతంగా అత్యంత ప్రేమాస్పదులమౌతాం
పక వేళ వాళ్ళు గెలిస్తే ,వెనకడుగు మాత్రం వేయద్దు .
మన ప్రభువు మనల్ని పరీక్షిస్తాడు దాన్ని ఆయన లీలగా గ్రహించాలి మనం
ఓడిన వారికి పోగొట్టుకున్న వారినిమళ్ళీ వెనక్కు తెస్తుందాఎక్కడైనా ద్వేషం ?
వారి మనసులు గెలవటానికి మొదట మన హృదయాలను కరగించుకోవాలి .
కావాలనే ఎవరైనా ఎదుటి వారిని అణగద్రొక్కి ,హక్కుల్ని లాగేస్తే
వారికి వ్యతిరేకంగా భగవాన్ ఖడ్గం ఎప్పుడూ నిటారుగా సిద్ధంగా ఉంటుంది .
అజ్ఞానులు దారితప్పితే కఠినంగా చూడకు
వారినిప్రేమించి, వారికోసం ప్రార్ధిస్తే వాళ్ళే సత్యం తెలిసి తిరిగొస్తారు
పరమాత్మ పేరుతో అన్ని దేశాలవారినీ ఆహ్వానించు
ప్రేమ, ఆదరణలతో వారిని ఆహ్వానించేప్పుడు నీ చేతిలో ఖడ్గం ఉండాలి
నీపై పరమాత్మ ఆశీస్సు వర్షిస్తే ,ప్రపంచమంతా నీకే అనుకూలమౌతుంది
సత్యానికి శత్రువులైనవారు మాడి మసి కాక తప్పదు.
మనమధ్య ఉన్న హృదయాలపై కూడా ప్రలోభ మరక పడుతుంది
భగవంతుని ఖండన శిక్ష ఎదుర్కొకముందే వారూ క్రమశిక్షణకు అర్హులే .
మొండి పట్టుదలున్న నూతన సైనికులారా పదండి ముందుకు
మనల్ని అడ్డగించి ,ఆపేశక్తి ఎవరికీ లేదు
విశ్వాస ,సహనాలు కడదాకా వీడని మీ ,నా నమ్మకమైన మిత్రులు
అలాంటి మన దారిలో చంద్రుడెప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు
దిగులు వద్దు భయం వద్దు –అసత్యం తప్పక అదృశ్యమౌతుంది
ఓనా సోదరా!సత్యమే జయిస్తుంది ఎప్పుడూ –సత్యమేవ జయతే
పిరికి వారిని ఎర్రకళ్ళతోచూస్తే ,వాళ్ళపని అయిపోయినట్లే
ఈ ప్రపంచం ప్రజలందరిదే కాని ‘’సింహాసనానిది కాదు’’ అని ధైర్యంగా ప్రకటించు
భగవత్ శక్తి నిండిన వారి ముందు , విశ్వ ప్రభువు అధికారం ముందు వారి తలలు తెగి పడాల్సిందే .
‘’నౌకాదిపతుల ‘’అధికారం అంతం కావస్తోంది –అది ఎంతోదూరం లేదు –
విశ్వ చక్రవర్తికే దేశాలన్నీ చెందుతాయ్ –
రక్తం మరిగిన రాబందులారా జాగ్రతో౦ జాగ్రత్త –
భగవదదికారం మరచి ఇతరులను వంచించి
మోసం చేయటానికి యెంత గుండె ధైర్యము౦ డాలి?
దేవుడికి ఒక్కడికే తప్ప మనం ఎవరికీ భయపడం
ప్రియాతి ప్రియమైన సర్వశక్తి వంతుడైన పరమాత్మ మాత్రమే మన మార్గ దర్శి.
ఆకాశం ,సూర్య, చంద్ర, ఖగోళ ,నక్షత్రాలన్నీ
సాక్షీభూతంగా చూస్తూ గమనిస్తూనే ఉంటాయ్
సత్యమార్గంలో నడిచే దెవరో, పెడమార్గం లో పోతున్న దెవరో .
భయం వద్దు దిగులు వద్దు సోదరా.అసత్యం తప్పక అంతమౌతుంది .
సత్యమే తప్పక గెలుస్తుంది సోదరా –సత్యమేవ జయతే .
ఆధారం –పద్మభూషణ్ నజ్రుల్ ఇస్లాం –ప్రియో జైజై బోలోనా ‘’బెంగాలీ కవిత కు-కాష్పియా భిల్లా ఆంగ్లానువాదం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -23-6-20-ఉయ్యూరు