ప్రపంచ దేశాల సారస్వతం
109-అల్జీరియా దేశ సాహిత్యం
ఉత్తర ఆఫ్రికాలో అల్జీరియా దేశం మధ్యధరా తీరరేఖ ,సహారఎడారి లోపల ఉన్నది .పురాతన రోమన్ సంస్కృతీ శిధిలాలు ,బైజా౦టిక్ సామ్రాజ్య శిధిలాలు ఉన్న దేశం .రాజధాని అల్జీర్స్ .కరెన్సీ అల్జీరియాన్ దీనార్ .జనాభా 4.25కోట్లు .అరబ్బీ భాష .సున్నీ ఇస్లాం మత౦ .పర్యాటకులకు సురక్షిత దేశం .క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవటంతో ఆర్ధికంగా కుంగి బీద దేశమైంది .దర్శించతగిన 15ముఖ్యవిషయాలున్నాయి .నిర్బంధ విద్య అమలులో ఉన్నందున అక్షరాస్యత పెరిగింది .
అల్జీరియన్ సాహిత్యం –పై ఆరబ్ ,ఫ్రెంచ్ ప్రభావం ఎక్కువ .స్వతంత్రం కోసం చేసిన యుద్ధం తర్వాత అసలైన సాహిత్యం ప్రారంభమైంది .బెర్బెర్ భాష మాట్లాడే వారుకూడా ఫ్రెంచ్ లోనే రాసేవారు .చాలామంది సాంఘిక రాజకీయ సమస్యలపై స్పందించి రాశారు .ఫ్రెంచ్ అల్జీరియాకు చెందిన ఆల్బర్ట్ కామూ-దిస్ట్రేంజర్,దిప్లేగ్ అద్భుత నవలలు రాసి ఎందరినో ప్రభావితం చేసి నోబెల్ ప్రైజ్ పొందాడు .ఇసబెల్లా ఎబెర్ హార్ట్ దేశమంతా పర్యటించి నవలలో చిత్రించింది .మహమ్మద్ డిబ్ నవలలు కవిత్వం రాశాడు .కబిలియాకు చెందినా మోలోడ్ ఫెరోన్1950తన అర్ధజీవిత చరిత్రగా ‘’సన్ఆఫ్ దిపూర్ ‘’నవలరాశాడు ఇస్లామిజం పెరిగాక రిచార్డ్ మిమౌంటి దానిపై అసహాయత వ్యక్త౦ చేసి 1980-90కాలం లో రాసిన నవల ‘’ది కర్స్’’లో అల్జీరియాను అస్తిరైన తలక్రి౦దు గా ఉన్న హాస్పిటల్ ,అనీ మతవాదులు పాలనలోకి వస్తే పరిస్థితి మరింత క్షీణిస్తుందని అన్నాడు .రచయిత తహార్దిజౌట్ ను ఇస్లాం తీవ్రవాదులు 1993లోహత్య చేశారు.అతని నవల ‘’ది బోన్ కలెక్టర్స్ ‘’లో యుద్ధం తర్వాత నిత్యజీవిత విధానం గురించి రాశాడు .
ఉత్తమరచనలు –దిప్లేగ్ –ఆల్బర్ట్ కామూ ,నేద్జిమ-కటేబ్ యాసిన్ ,ల గ్రాండి మాసన్-మొహమ్మద్ డిబ్ ,లే ఫైల్స్ డుపావ్రే –మోలౌడ్ ఫెరోన్,ది రెచ్డ్ఆఫ్ ది ఎర్త్ –ఫ్రాన్త్జ్ ఫానన్ ,లా అమోర్ లా ఫాన్తాసియ –అసియా జేబార్ ,అల్ లాజ్ –తాహిర్ వాట్టర్,ఇన్ ది నేఁ ఆఫ్ గాడ్ –యాస్మినా ఖాద్రా –
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-6-20-ఉయ్యూరు