ఇవాళ ఉదయమ శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారి భార్య శ్రీమతి శ్రీదేవి గారు ఫోన్ చేసి ఊసుల్లో ఉయ్యూరు చాలా ప్రేరణగా ఉందనీ ,నే ను రమణగారిపై ఎప్పుడో రాసిన ”రమారమణుడు”వ్యాసం చాలాబాగా నచ్చి రాజమండ్రిలో ఉన్న ఒకాయన అక్కడ పత్రిక నడిపే శ్రీవారనాసి సుబ్రహ్మణ్యం గారికి పంపితే ఆయన వెంటనే ముద్రించారనీ రమణగారిని ఇంతగొప్పగా ఆవిష్కరించిన వ్యాసం నాదేనని అన్నారని తీపి వార్త చెప్పారు
ఈ రోజు రాత్రి సౌదీ అరేబియానుంచి కామేశ్వరరావు అనే ఆయన ఫోన్ చేసి ,తాను పదేళ్లకు పైగా అక్కడ ఉంటున్నానీ ,రెగ్యులర్ గా సరసభారతి బ్లాగ్ చదువుతానని,ఎన్నెన్నో విషయాలు రోజూ తెలుసుకోగలుగుతున్నానని ఆనందంగా సంతృప్తి గా చెప్పారు .ఇంతకంటే సంతృప్తి ఇంకా ఏమి ఉందనిపించింది .
మూడో సంతోషవార్త -సరసభారతి శ్రీ సువర్చలాన్జనేయ బ్లాగ్ ల వీక్షకుల సంఖ్య 9లక్షలు దాటారని తెలియజేయటానికి మరింత సంతోషంగా ఉంది. ఈవిజయానికి కారకులైన సాహితీ బంధువులు, సాహిత్యాభిమానులకు ధన్యవాదాలు –దుర్గాప్రసాద్