ఇవాళ నా పుట్టిన రోజు e
ఇవాళ జూన్ 27వ తేదీ శనివారం నా పుట్టిన రోజు 80నిండి 81వయసులోకి ప్రవేశిస్తున్న సందర్భంగా సాహితీ బంధువులకు ,సాహిత్యాభిమానులకు ,బంధు మిత్రులకు ,కుటుంబ సభ్యులకు శుభ కామనలు -మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -27-6-2020-ఉయ్యూరు
–
ఇవాళ నా పుట్టిన రోజు e
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Sir
మీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు
Ramalakshmana Charyulu
4:24 PM (2 hours ago)
to sahitibandhu
బ్రహ్మశ్రీ.గబ్బిట దుర్గాప్రసాద్ గారికి
ఆశీతి వత్సర జన్మదిన శుభవేళ……..
సహస్ర చంద్ర దర్శన శుభవేళ
తుమ్మోజురామలక్ష్మణాచార్యుని అభివందనాభినందశలు.
కం.నిరతంబేదేనొక యని
తరవేద్యంబగు రచనను తరచియు చూచున్
సరళపుభాషను దానిని
పరమంబగు కృతిని జేసి ప్రచురణజేయున్
కం.ముదిమనగూడని వేగము
మది తలచదలపునెపుడును మరిమరి వేడ్కన్
సదమల మతితో నిరతము
నెదయెద పులకింప సభల నిండుగ జరపున్ .
తే.గీ.సరసభారతి సాహిత్య సభలు జరిపె
తూర్పు పడమర సీమల నోర్పుతోడ
ధన్యజీవులు గబ్బిట దంపతులును
పడయు గావుతనేవేళ పరమశ్రీలు
తే.గీ. గబ్బిటప్రసాద వర్యుని కలమునుండి
గ్రంథసంచయమేతెంచు రక్తి గొలుప
వలయు శక్తియు నాయువు వాయు సుతుడు
ఇచ్చి బ్రోవగ కరుణతో నినుమడింప
తే.గీ.రామ లక్ష్మణు నాకాంక్ష రహినిమీర
వరసువర్చలా సుందర వాయుసుతుల
ఆయురారోగ్య సంపత్తి నాయుశతము
అక్షతాశీస్సులై మీకు అమరుగాక.
………భవదీయుడు….
తుమ్మోజురామలక్ష్మణాచార్యులు
27.6.20…4.20pm
డా శ్రీమతి పుట్టపర్తి నాగపద్మిని గారి అమృతవాక్కులు
శ్రీమాన్ గబ్బిట దుర్గాప్రసాద్ గారూ, మీకు జన్మదిన హృదయపూర్వక శుభాకాంక్షలు సర్. మీ సాహితీ యాత్ర ఇలగే మూడు పువ్వులూ ఆరు కాయలు వలె, నిత్య శోభలతో కొనసాగాలని కోరుకుంటున్నాను. మీరు పంపిన గ్రంధాలలో ఇప్పటికీ అదే యువ స్ఫూర్తి కనిపిస్తున్నది. ఆ ఉత్సాహం మాకూ ఎంతో స్ఫూర్తి ఇస్తుండాలి ఇలాగే!! మాకందరికీ, మీ ఆశీస్సులిలాగే అందజేస్తూ ఉండలి మీరు – సతీసమేతంగా!! పుట్టపర్తి నాగపద్మిని