’ సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -61
సీతాన్వేషణ వృత్తాంతాన్ని సవిస్తరంగా హనుమ తెలియజేశాక,మళ్ళీ హనుమ ‘’శ్రీరామ కార్యం సఫలమైంది .సుగ్రీవుని ఉత్సాహం ఫలించింది .సీతాదేవి పాతివ్రత్యాన్ని చూసి నా మనసు పరవశించింది .రావణుడు మహాతపస్సంపంనుడు ,తపస్సుచేత పెరిగిన అతడి కోపానికి లోకాలే దహించుకు పోతాయి .అందుకే సీతా దేవిని తాకినా అతడి శరీరం దగ్ధం కాలేదు . సీతాదేవి కోపిస్తే ఎలా తగలబెట్టగలదో అగ్నికూడా అంతగా కాల్చలేడు.
‘’సఫలో రాఘవోద్యోగ స్సుగ్రీవస్య చ సంభ్రమః –శీల మాసాద్య సీతాయా మమ చ ప్రణవం ‘’మనః
‘’తపసా దారయే ల్లోకాన్ క్రుద్ధోవా నిర్ద హేదపి-సర్వధాతి ప్రవృద్ధో సౌ రావణోరాక్షసాధిపః
తస్య తాంస్పృశతో గాత్రం తపసా న వినాశితం ‘’
‘’న తగగ్ని శిఖా కుర్యాత్ స౦స్పృ ష్టాపాణినా సతీ –జనక స్యాత్మజా కుర్యాత్ యత్క్రోధ కలుషీ కృతా ‘’
‘’పెద్దలు జామ్బవంతాదుల అనుమతితో జరిగిన కార్యం అంతా నివేది౦చాను మ్చాను .భ్రుత్య విజయం స్వామి విజయమేకనుక ,ఇప్పుడు లంకకు వెళ్లి సీతాదేవిని తెచ్చి ,ఆమెతో కూడా రామ లక్ష్మణులను చూడటం యుక్తం గా ఉంటుంది అని పిస్తోంది .నేను ఒక్కడినే రావణుడితో సహా సకల రాక్షస సంహారం చేయగలను .మీరు కూడా కలిసి వస్తే జయించటం తేలికే .యుద్ధంలో రావణ ,పుత్ర అనుచర సోదర సైన్యాలను చంపుతాను .ఇంద్రజిత్ ప్రయోగించే బ్రహ్మ ,యింద్ర ,రౌద్ర ,వాయవ్య ,వారుణాది అస్త్రాలను నిష్ఫలం చేసి సర్వ రాక్షస సంహారం చేస్తాను .మీరు అనుమతిస్తే రావణుని బంధిస్తాను ‘’
‘’అహం తు రావణం యుద్ధే ససైన్యం న పురస్సరం –సహపుత్రం వదిష్యామి సహోదరయుతమ్ యుధి’’
‘’బ్రహ్మ మైన్ద్రం ,చ రౌద్రం చ వాయవ్యం వారుణం తథా –యది శక్ర జితో స్త్రాణి దుర్నిరీక్షాణి సంయుగే ‘’
‘’యుద్ధంలో నేను కురిపించే రాళ్ళవాన తో దేవతలే నశిస్తారు .ఇక రాక్షసులసంగతి చెప్పాలా ?సముద్రం చెలియలి కట్ట దాటవచ్చు. మంధర పర్వతం కదలచ్చు. కాని శత్రు సైన్యం జాంబవంతుని ఏమీ చేయలేదు ‘’-
‘’సాగరో ప్యతియా ద్వేలాం మందరః ప్రచలేదపి- న జామ్బవంతం సమరే కంపయే దరివహినీ’’-
‘’ మనమంతా ఎందుకు ?వాలిసుత అంగదుడు ఒక్కడు చాలు. సకల అగ్ర రాక్షస సంహారం చేయటానికి –
‘’సర్వ రాక్షస సంఘానాం రాక్షసా ఏ చ పూర్వతాః-అల మేకో వినాశాయ వీరో వాలిసుతః కపిః-‘’’’మహాత్ముడు పనసుడు ,నీలుడు ,తొడల వేగంతో మందర పర్వతాన్నే బ్రద్దలు చేయగలరు .రాక్షసులు ఒక లెక్కా ?
‘’పనస స్యోరు వేగేన నీలస్య చ మహాత్మనః –మందరో ప్యవ శీర్యత కిం పునర్యుధి రాక్షసాః’’
‘’మైంద ,ద్వివిదు లతో ఎదుర్కొనే సామర్ధ్యం దేవ ,అసుర ,యక్ష ,గ౦ధర్వ ,ఉరగులకుకూడా లేదు .వారిద్దరూ ఆశ్వినీదేవతలకుమారులు .బ్రహ్మవరం పొంది అమృతం త్రాగి అమరులై ,సకల వానరులలో శ్రేస్టులని పించుకొన్నారు .
‘’అశ్వి పుత్రౌ మహా భాగా వేతా ప్లవగ సత్తమౌ –ఏతయోఃప్రతి యోద్ధారం న పశ్యామి రణా జిరే ‘’అమృత ప్రాశినా వేతౌ ఏను లంకను సర్వ వానర సత్తమౌ ‘’
‘’నేను లంకనుపాడు చేశాను .అన్ని రాజమర్గాల్లో నా పేరు మారు మ్రోగేట్లు చాటాను .’రామసుగ్రీవులకు జయం అంటూ జరిగిన విషయాలన్నీ చెప్పాను . లంకలో శింశుపా వృక్షం కింద ,రాక్షస స్త్రీల మధ్య సీత దుఖంతో దీనంగా విలపిస్తోంది. నిరంతర రామ ధ్యానం తో గడుపు తోంది .రావణుడు తనకు వశం కమ్మని కోరుతూ బెదిరిస్తున్నాడు .ఆమె రాముడినే నమ్ముకొని వాడివైపు కన్నెత్తికూడా చూడటం లేదు .భర్తపై ఆమె అనురాగం అచంచలం .పాపి రావణుడిని ఐనా చంపకుండా వదిలింది అంటే వాడు మహానుభావుడే .వాడిని వాదించటం నిమిత్తమాత్రమే సీతాపహరణమే వాడి వినాశానికి మూలం –
‘’నియతస్సముదాచారో భక్తిర్భర్తరి చోత్తమా –యన్నహంతి దశగ్రీవం సమహాత్మా కృతాగసం’’
నిమిత్తమాత్రం రామస్తు వధే తస్య భవిష్యతి
‘’అనధ్యయనం నాడువిద్య ఎలా క్షీణిస్తుందో అలా సీతాదేవి క్షీణించి ఉన్నది .కనుక ఇప్పుడు మన తక్షణ కర్తవ్యమేమిటో దాన్ని ఆచరించండి ‘’అని హనుమ తనసహచర వానర వీరులతో చెప్పాడు .
‘’సా ప్రకృత్యైవ తన్వంగీ తన్వంగీ తద్వియోగాచ్చకర్శితా-ప్రతిపత్పాఠశీలస్య విద్యేవ తనుతాం గతా ‘’
‘’ఏవమాస్తే మహాభాగా సీతా శోక పరాయణా-యదత్ర ప్రతి కర్తవ్యమ్ తత్సర్య ముపపద్యతాం’’
ఇది 35శ్లోకాల 59వ సర్గ .
ఇందులో హనుమ ఒక్కో వానర వీరుని బలపరాక్రమాలను విశ్లేషించి చక్కగా చెప్పాడు.ఇవి అతిశయోక్తులు కావు యదార్ధాలే.ఇలా చెప్పటం లో ఉద్దేశ్యం ఏమిటి అంటే వాళ్ళల్లో ఒక సారి పౌరుషాగ్ని రగుల్కొల్పటమే. రాబోయే రామ రావణ సంగ్రామానికి వాళ్ళను సమాయత్తం చేయటమే .అనధ్యయనం నాడు విద్య క్షీణించినట్లే సీత క్షీణించింది అనటం గొప్పమాట .సీత ను ఎత్తుకురావటం తోనే సగం చచ్చాడు .ఇకరాముని పని నిమిత్తమాత్రమేఅనటమూ బాగుంది .తన బలపరాక్రమ శౌర్యాలనూ దీటుగానే చెప్పుకొన్నాడు హనుమ .సీత కోపాగ్ని ప్రభావంకూడా చాలా గొప్పగా చెప్పాడు .ఇదంతా యుద్ధ వ్యూహం లో భాగమే అనిపిస్తుంది .మైంద ద్వివిదులు అమృతం త్రాగినట్లు ఇప్పుడే మనకు హనుమద్వారా తెలిసింది .జాంబవంతుని పరాక్రమమూ శ్లాఘించి ఉత్సాహ పరచాడు .ఈసర్గలో హనుమ పలికిన ప్రతిమాటా తగిన ఆలోచనతో చెప్పిందే భవిష్యత్తును దృష్టి లో పెట్టుకొని చెప్పినదే .ఈ సర్గకూడా చాలా ఉపయోగ మైనదే ,ముఖ్యమైనదే .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-6-20-ఉయ్యూరు