ప్రపంచ దేశాల సారస్వతం
112- బురుండీ దేశ సాహిత్యం
పంటపొలాల బురుండీ దేశం ఆఫ్రికాలో గ్రేట్ రిఫ్ట్ వాలీ లో ఉన్నది .అక్కడే ఆఫ్రికన్ గ్రేట్ లేక్స్ స్థావరం .రాజధాని –గిటేగా.కరెన్సీ –బురూ౦డియన్ ఫ్రాంక్ .జనాభా 1.12కోట్లు .మెజార్టీ రోమన్ కేధలిక్ మతస్తులు .ఫ్రెంచ్ తో పాటు కిరుండి కూడా అధికార భాష.చాలాభాషల జాతుల వారున్నారు .అన్నిటికీ వ్యవసాయమే ఆధారమైన బీద దేశం ప్రత్తిపంట విస్తారం .ఆరేళ్ళ కంపల్సరి విద్య అమలులో ఉంది .65శాతం అక్షరాస్యులు .కనువిందు చేసే 15 యాత్రాస్థలాలున్నాయి .
బురుండీ సాహిత్యం –అంతా ఆ దేశప్రజలు ఫ్రెంచ్ భాషలో రాసిందే ఎక్కువ .మొదట్లో మౌఖికంగానే సాహిత్య వ్యాప్తి పాటలు గీతాలు కధలు ద్వారా వ్యాప్తి చెందింది.
ఆధునిక స్త్రీ రచయితలూ –ప్రిన్సెస్ ఈస్తర్ కమటారి-రాజ కుటుంబానికి చెందినది .1962దేశం స్వాతంత్రం పొందాక ,రాజును మిలిటరిజుంటాతొలగించి రాజరికపాలన రద్దు చేసింది .1972లో రాజును హత్యచేశారు .తర్వాత మెజార్టీ హుటు,మైనారిటి టుట్సిజాతులమధ్య పోరాటాలు జరిగి ,సివిల్ వార్ వచ్చి ,వేలాది బాలయుద్ధ నేరస్తులు ఈస్తర్ నాయకత్వాన్ని బలపరచి ఫ్రాన్స్ లో అసోసియేషన్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ బురుండి ఏర్పడి ఆమె ప్రాజాస్వామ్యపద్ధతులకు మద్దతుఇవ్వగా తర్వాత ‘అబాహుజా ‘’అంటే ప్రజల ఐక్యత పార్టీ పేరుతొ ఎన్నికలలో నిలబడి ఈస్తర్ కమటారి పాలన చేసింది పుస్తకాలు రాసి౦ది
కెట్టి నివ్యా బంది-కవయిత్రి .స్త్రీ హక్కుల ఉద్యమకారిణి .నోబెల్ వుమెన్ ఇనీషిఏటివ్ఏర్పరచింది
పెర్పెత్యునిసిమ్హరిమాన –యుఎన్ వో లో శాశ్వత సభ్యురాలు .లిట్టేర్ ఏ ఇస్డోరే అనే స్వీయ చరిత్ర రాసింది
మేరి లూసీ సిబజూరి –స్త్రీలహక్కు ఉద్యమకారిణి .అనేక రేడియో సీరియల్స్ రాసింది .షొప్ ఒపేరా నిర్వహించింది .లెస్ సీన్స్ నాస్ అనే మొదటినవల 2013లో రాసింది బెల్జియం లో కొన్నేళ్ళు ఉండి వచ్చి నాటకరంగం లో కృషి చేసింది .బురున్డియన్ జానపద కథలను2019లో ప్రచురించింది .
అగస్టిన్ సంజె –చరిత్ర ,రాజకీయ నిధి. డిప్లోమాట్ .ఇంతకంటే విషయాలు లభించలేదు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-6-20-ఉయ్యూరు