ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -3
మూడుశతాబ్దలకాలం కాకరపర్రు యజ్ఞవాటికగా వర్ధిల్లింది .ఇక్కడ జరిగిన ‘’వీరమహా యజ్ఞం ‘’ఫలితంగా కాటయ వేమారెడ్డి మరణించాడు .15వ శతాబ్ది మొదట్లోనే ఇక్కడి గ్రామస్తులు ప్రత్యర్ధులను తుదముట్టించటానికి యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తారనే అపవాదు వచ్చింది .ఈశ్వరా౦శ సంభూతుడు వల్లభాచార్యులు ఇక్కడే జన్మించాడనే వదంతి ఉంది .కానూరులో వల్లభస్వామి దేవాలయం ఉంది కానీ ధ్వజస్తంభం1976లో కూలిపోయింది .అపర శంకరుఅలని పించుకొన్న అప్పయ్య దీక్షితులూ ఇక్కడి వాడే అంటారు .భారత రత్న,మొదటి కేంద్ర హో౦ శాఖామంత్రి పండిట్ గోవింద వల్లభ పంత్ కూడా ఇక్కడి వాడే అంటారు వీటికి చారిత్రాకాధారాలు లేవు . అక్కన్నమాదన్నలు ఇక్కడికి వచ్చి అనిసింగ రామకృష్ణుడు ను దర్శించి ఆయన ఉపాసన మహిమవలన గోల్కొండ నవాబు తానీషామంత్రులయ్యారట
అణి వీళ్ళవెంకటసోమయాజులు-18శతాబ్దం –ఈ గ్రామంలో పుట్టి నూజి వీడు ప్రభువు మేకా వెంకట నరసింహ అప్పారాయ ల కోరికపై ‘’అప్పారాయ యశ శ్చంద్రోదయం ‘’అలంకార శాస్త్రం రాసి అంకితమిచ్చాడు .ఆయనకు వల్లూరుపల్లి అగ్రహారం ఈనాం గా ఇచ్చాడు . ‘’అణి విళ్ళ శ్రౌత వ్యాఖ్య ‘’రాశాడు .పుష్పగిరి పీఠానికివ్యాకరణ బోధకుడు .ఒకసారి ఆంద్ర ప్రదేశ తొలి ఆస్థానకవి శ్రీ పాద కృష్ణ శాస్త్రిగారు 10ఏట కాకరపర్రు మీదుగా ముక్కామల వెడుతుంటే అరుగు మీద కూర్చున్న పండితుడు ఏ వూరు వెడుతున్నావుఅని అడిగితె ముక్కామల అంటే ,ఏం చదివావు అంటే ‘’నాకు చదువు రాదు ‘’అనగా ,’’నీకు కాకరపర్రులో అడుగు పెట్టె అధికారం లేదు ‘’అన్నాడట ఈ విషయం శాస్త్రిగారే స్వీయ చరిత్రలో రాసుకొన్నారు .
శంకరాచార్యుల తర్వాత అంతటి వారు అనిపించుకొన్న శ్రీ విద్యారణ్యులు శ్రీ శృంగేరీ పీఠాన్ని అధిరోహింఛి అయిదేళ్ళ వ్యవధిలో 1336లో శ్రీ హంపీవిరూపాక్ష పీఠం నెలకొల్పి పీఠాధిపతుఅలయ్యారు .దీనినుంచి శ్రీ పుష్పగిరి ,శ్రీఅభినవ విరూపాక్ష జగద్గురు పీఠంఏర్పడ్డాయి .చాలాకాలం తర్వాత కాకరపర్రులోఉద్దండ భారతి జ్యేష్ట శిష్యుడిగా ఒకబాగం తెచ్చి 1765లో ఇక్కడ పేఠం ఏర్పరచి తామే తొలిపీఠాధిపతి అయ్యారు .ఇప్పుడు 2000సంవత్సరం నుంచి శ్రీ విద్యారణ్య భారతీస్వామి అధిపతిగా ఉన్నారు .
మాక్స్ ముల్లర్ ఈగ్రామ ప్రభావ విశేషాలు తెలుసుకొని ‘’There are a few Brahmins in the village Kakaraparru .They are loined clothes and they are capable of Governing the entire world in a better way ‘’అని రాశాడని 2008అక్టోబర్ ఇంటర్నెట్ పత్రిక ‘’సారస్వతం ‘’తెలిపింది .
సశేషం
శయన ఏకాదశి శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-7-20-ఉయ్యూరు