ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -4
అభినవ దండినరసింహ దేవర వేంకట శాస్త్రి-1828-1915- కాకరపర్రులో ‘’విచిత్ర రామాయణం ‘’కావ్యం రాసిన విద్వత్కవి .వెంకటేశ్వర శతకం ,విరాగ సుమతీ సంవాదం ర్రాశారు తలిదండ్రులు –సీతమాంబ ,ఉమామహేశ్వర సూరి.
పురాణపండ మల్లయ్య శాస్త్రి -1853-1925-సూత్ర భాష్యం తర్క వ్యాకరణ పండితులు .శుక్ర నీతి సారం ,ఆంధ్రీకృత బ్రహ్మసూత్ర భాష్య కర్త .ఉపనిషత్ కథలూ రాశారు .రామమ్మ ,భద్రయ్య శాస్త్రి జననీ జనకులు
అపర వ్యాసులు ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి -1860-1916-గారు రాజమండ్రి హైస్కూల్ ట్రెయినింగ్ కాలేజి లో ,ఆర్ట్స్ కాలేజి లో సంస్కృత ,ఆంధ్ర ఉపన్యాసకులు .తర్క వ్యాకరణ అలంకార ఉపనిషత్ వేదాంత శాస్త్రాలలో తిరుగు లేని వారు .ఎందరో కవిపండితులకు విద్యా గురువు .రాజా మంత్రిప్రగడ భుజంగరావు ఆస్థాన పండితులు .సూర్య శతకం, భామినీ విలాసం ,శుద్ధాంధ్ర ఋతు సంహారం ,అనర్ఘ రాఘవం ,ప్రబోధ చంద్రోదయం ,ఆంద్ర నైషధం ,విదుల ,భారత ఫక్కి ,శ్రీ మహా భారత నవనీతం-13పర్వాలు ,ఆధ్యాత్మ రామాయణం ,పరాశర స్మృతి,కృష్ణా పుష్కర మాహాత్మ్యం రాశారు .
ఆంధ్రా మిల్టన్,కళా ప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీ నరసింహం -1867-1945-తణుకు దగ్గర ఖండవల్లిలో పుట్టినా చివరి దశ ఇక్కడే గడిపారు .అభిషేక నాటకం ,స్వప్న వాసవ దత్త ,ప్రతిమ ,ప్రతిజ్ఞా యౌగంధరాయణం ,గయోపాఖ్యానం మొదలైన నాటకాలు ,కర్పూరమంజరి గణపతి సౌందర్య తిలక ,గయ్యాలిగంగమ్మ ,మొదలైనవి రాశారు ప్రహసనాలకు మంచి పేరు తెచ్చారు .1942లో రాజమండ్రినుంచి కాకరపర్రుకు మకాం మార్చి శేష జీవితం గడిపారు .’’కళ్ళు లేకపోయినా, తెలుగు భాషకు కళ్ళు ఇచ్చిన సాహిత్య మహా దాత’’ .రత్నమ్మ, వెంకయ్య తలిదండ్రులు .
ఆశు కవితా చక్రవర్తి కాకరపర్తి వెంకట శాస్త్రి -1874-1964-పుస్తక అధ్యయనం తోనే జీవితం గడిపారు .వీరింట లక్ష్మీ సరస్వతులు కొలువుండేవారని ప్రతీతి .ఒకసారి తిరుపతి కవులజంట దివాకర్ల తిరుపతి శాస్త్రి , చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారు ఇక్కడికి రాగా ఇద్దరిమధ్యా చర్చ జరిగి ,ఈ జంట కాకరపర్తి వారి పాండిత్యం ముందు ఓడిపోగా ‘’రెండుభాషల్లో తామే కవీశ్వరులం అని గొప్పగా మీసాలు పెంచి ,ఓడిస్తే మీసాలు తీసి పాద సమీపం లో పెడతాము ‘’అన్న చాలెంజి ‘’కాకరపర్తికి మినహాయింపు ‘’అని చెప్పి తప్పించుకొన్నారు .ఈ సంఘటన పై శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రిగారు గొప్ప పద్యాలు రాశారట .
పుంభావ సరస్వతి చర్ల భాష్యకార శాస్త్రి -1878-1949-కామమాంబ వెంకటశాస్త్రిగార్ల పుత్రులు .వీరి ఇల్లు సరస్వతీ నిలయం .తమ వంశస్తులకు నూజివీడు మేకా వంశరాజులు ఇచ్చిన జాగీరు ను కృతజ్ఞాతభావంతో గుర్తుంచుకొని ‘’మేకాదీశ ‘’అనే నాలుగు బీజాక్షరాల శ్లోకాలతో తర్క వ్యాకరణ ,గీత మొదలైన వాటిపై గ్రంథాలు రాశారు . ఎందరికో వేద విద్య నేర్పారు .పూర్వశృంగేరి పీఠాదిపతులు శ్రీ శ్రీ అభినవ విద్యా తీర్ధస్వామి వీరి వద్ద తర్కశాస్త్రం అధ్యయనం చేశారు .కంచి పరమ గురువులు శ్రీ చంద్ర శేఖర సరస్వతి ఈ గ్రామానికి వస్తే వారి పీఠానికి ఆతిధ్యమిచ్చారు .చాలగ్రంథాలు రాసినా, విజయ విలాస చరిత్ర ,మేకాధీశ శబ్ద శతకోటి ,మేకాధీశ శబ్దార్ధ కల్పతరువు అనే అలంకార శాస్త్రం ,భువనగుణ మహాదర్పణం వంటి అద్భుత రచనలు చేశారు .సంస్కృతంలో అనర్గళంగా భాషించటం వీరి నేర్పు .
అల్లంరాజు రామశాస్త్రి -19-20శతాబ్ది –హిందూమత ఔన్నత్యాన్ని లోకానికి చాటి చెప్పిన మనీషి .భారత రాష్ట్రపతి మహా తత్వవేత్త ఆచార్యులకే ఆచార్యుడు సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడే వీరివద్ద సంస్కృతం నేర్చుకొన్నారు .
శ్రీమతి డా.అల్లంరాజు గాయత్రీ దేవి –ఉషశ్రీ అంటే పురాణపండ సూర్య ప్రకాశ దీక్షితులు, ,వ్యాస వెంకట సత్యవతి దంపతుల కుమార్తె .ఆయుర్వేద ,యోగాలలో ఏం ఎస్.సి 1999నుంచి ‘’రుషి పీఠం’’ద్వారా వైద్య సేవ ,సలహాలు అందిస్తున్నారు తండ్రి ‘’అసంపూర్ణ రామాయణం లో హనుమంతుడు ‘’పూర్తి చేసి హాస్యాహాస్య కధలు,అనేక రేడియో రచనలు చేశారు. చాలా అవార్డ్ లు అందుకొన్న విదుషీమణి
వేదుల సూర్యనారాయణ శాస్త్రి -19-20శతాబ్ది –సమాజ ప్రగతిని కాంక్షిస్తూ రచనలు చేశారు,’’డబ్బి దాంశుకంమ’’,డిద్దడబిద్ధం ,దురభ్యాసములు ,శ్రీ పతి శతకం, ప్రతాప రుద్రీయం బంగారం రాశారు .చర్ల గణపతి శాస్త్రిగారికి పిల్లనిచ్చిన మామగారు , సుశీలగారి తండ్రిగారు.ఈ బంగారం కథ చదివే సుశీలగారు బంగారం పై వ్యామోహం పోగొట్టుకొన్నారు .
అపర రామ దాసు ఆకొండి వ్యాసమూర్తి సిద్ధాంతి –కాకరపర్రులో రాజరాజ నరేంద్రుడు నిర్మించిన రాజరాజేశ్వరాలయానికి తరతరాల ధర్మకర్త .ఏటా 8పుట్ల ధాన్యం పండే సుక్షేత్రామైన మాగాణి భూమిని ,నిల్వ ధనాన్ని స్వామికి సమర్పించిన వదాన్యులైన ధర్మకర్త .అందుకే వీరిని ‘’అపర రామదాసు ‘’,అపర గోపన్న ‘’అని గౌరవంగా సంబోధిస్తారు .
సశేషం
మీ-గబ్బిటదుర్గాప్రసాద్ –2-7-20-ఉయ్యూరు