దధి,క్షీర సముద్రాలు సృష్టింప జేసిన ఉపమన్య మహర్షి
ఉపమన్యుని బాల్యం లో తల్లితో కలిసి అరణ్యం లో ఉండేవాడు .ఒకరోజు పాలకోసంఏడిస్తే తల్లి పిండిపాలు ఇచ్హింది ,తాగి అవి అసలైన పాలుకావని గ్రహించి మళ్ళీ ఏడ్చాడు.ఆ అడవిలో పాలు ఎక్కడి నుంచి వస్తాయని తల్లి అంటే ,తానే సంపాదిస్తానని శివుడిని ప్రార్ధించాడు .కొంతకాలం ఎడమకాలి బొటన వేలుపై నిలిచితపస్సు చేశాడు ,వందేళ్ళు పళ్ళు మాత్రమె తిని మరొక వందేళ్ళు ఆకులు ,ఇంకో నూరేళ్ళు గాలిమాత్రమే పీల్చి మొత్తం మీద వెయ్యేళ్ళు తపస్సు చేశాడు బాల ఉపమన్యువు .
శివుడు పరీక్షించటానికి ఇంద్రుని రూపం లో వచ్చి ఏం కావాలని అడిగాడు .నిన్నేమీ కోరను నాతపస్సు శివుడి కోసం అన్నాడు .భోగ భాగ్యాలిస్తాను .శివుడు ఏమిస్తాడు బూడిద తప్ప అన్నాడు .నువ్వు పసివాడివి అంతటి తపస్సు చేయలేవు నీకు కావాల్సింది నేనే ఇస్తాను అన్నాడు .శివ నింద భరించలేక ,చెవులు మూసుకొని తక్షణం అక్కడినుంచి వెళ్లి పొమ్మన్నాడు .శివుడిని తప్ప ఎవరినీ ఏమీ కోరను అని తెగేసి చెప్పాడు.ఇంకా తాత్సారం చేస్తున్న ఇంద్ర రూప శివునిపై ,తల్లి తనకు తపస్సులో రక్షగా ఉంటుందని ఇచ్చిన విభూతిని పిడికిలిలో పట్టుకొని ‘’అఘోరాస్త్ర మంత్రం ‘’జపించి చల్లే లోపు, శివుడు ప్రత్యక్షమయ్యాడు ,అతడు కోరినప్పుడల్లా లభించటానికి’’ దధి ,క్షీర సముద్రాలు’’ సృష్టించాడు .తర్వాత అతడు చాలాకాలం శివభక్తితో జీవించి కైలాసం చేరాడు .
ద్వాపర యుగం లో శ్రీ కృష్ణుని అష్టభార్యలలో జాంబవతి పుత్రసంతానం కోసం భర్తను ప్రార్ధించింది. ఆయన ఉపమన్యు మహర్షిని సందర్శించి భార్య కోరిక చెప్పగా ,కృష్ణుడిని 12ఏళ్ళు శివుని కోసం తపస్సు చేయమని శివానుగ్రహంతో జాంబవతి కి పుత్రులు కలుగుతారని చెబితే అలాగే చేసి పది మంది కుమారులను జాంబవతి వలన పొందాడు .పెద్దవాడు సాంబుడు .మిగిలినవారు సుమిత్ర ,పురుజిత ,సత్యజిత, సహస్రజిత ,విజయ ,చిత్రకేతు,వసుమంత ,ద్రవిడ,క్రుతు లు.
సంస్కృత భారతం ఆనుశాసనిక పర్వంలో వ్యాఘ్రపాద మహర్షి కుమారులు ఉపమన్యువు ధౌమ్యుడు అని ఉన్నది .తిక్కనగారు ఈ విషయం రాయలేదు .
తొలి ఏకాదశి శుభాకాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-7-20-ఉయ్యూరు