ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -6
పితాపురాస్థాన కవులు –ఓలేటి వెంకట రామశాస్త్రి -1883-1938,వేదుల రామ కృష్ణ శాస్త్రి -1889-1918
వెంకట రామకృష్ణ ,కవులుగా ప్రసిద్ధులైన ఈ జంటకవులు తూగోజి కాకినాడ తాలూకా పల్లెపాలెం నారాయణ శాస్త్రి కామేశ్వరమ్మలకు ,కాకరపర్రులో రామచంద్ర శాస్త్రి ,సూరమ్మలకు జన్మించారు .ఓలేతటి వేదుల మేనత్తకొడుకు .అంటే బావా బామ్మర్దులు .ఉభయభాషా ప్రవీణులు .వేదుల ఆంగ్లాన్ని తర్వాత నేర్చారు .కాకరపర్రు లో ఓలేటి కవిత్వాన్ని మెచ్చిన వారని చూసి ,వేదుల తానూ రాయటం మొదలుపెట్టారు కాళిదాస త్రయం సిద్ధాంత కౌముది పూర్తి చేసి కవిత్వ రచన ఉత్సాహంగా మొదలుపెట్టి రామాయణ సంగ్రహం ,విఘ్నేశ్వర చరిత్ర ,నరకాసుర వ్యాయోగం 13ఏట ,దమయంతీ కల్యాణం శుద్ధాంధ్ర ప్రబంధాన్ని 14వ ఏట రాసి కుకవినింద ,ప్రాకృతం లో ,కర్ణ విజయ ‘’ వ్యయోగం సంస్కృతం లో రాశారు .ఓలేటి వేదులను ‘’సరస్వతీ అవతారంగా భావించేవారు .వేదుల 20ఏళ్ళకే పుంభావ సరస్వతి అనిపించుకొన్నారు .
అప్పటికే ఓలేటి వ్యాసాభ్యుదయ ప్రబంధం రాసి ,కాకరపర్రు సీతారామస్వామికి అంకితమిచ్చారు .ఇద్దరూకలిసి వేంకటాధ్వరి ,విశ్వ గుణాదర్శం ,భవభూతి ఉత్తరరామ చరిత భల్లాల కవి భోజ చరిత్ర లను ఆంధ్రీకరించారు. క్షేమేంద్రుని ‘’ఔచిత్య విచార చర్చ , సువృత్తితిలకం ,కవి కంఠా భరణాలనే లక్షణ గ్రంథాలను అనువదించారు.మదాలస అనే 5అంకాల స్వతంత్ర నాటకం ,ఇందిరాదేవి ,సుభద్ర దమయంతి నవలలు రాశారు .వీరి కొండవీటి రథయాత్రకు మద్రాస్ విద్వ త్సమాజం స్వర్ణపతకమిచ్చింది .
ఇద్దరూకలిసి పిఠాపురం రాజా వారిని పద్యాలతో మెప్పించి 1919లో దేవులపల్లి సోదరుల స్థానం లో ఆస్థానకవు లయ్యారు .అప్పటికీ ఓలేటికి 22,వేదులకు 16 వయసు . ఈ జంట శతావధానం గుర్రపుస్వారీగా బహువేగంగా ఉంటూ 8మంది లేఖకులకుకూడా రాయటం కష్టంగా గంటకు నూరు పద్యాలు చెప్పేవారు .సూర్యరాయ ప్రభు ఆస్థానం లో శతావధాన ,శతవిదాన ,శతప్రసాది అవధానాలు చేసినట్లు చెప్పుకొంటారు .ఈ విద్వత్కవులు ‘’సిరి మనరావు సూర్య నృపశేఖరు నింటవసించు గాత’’అని మొదలుపెట్టి భారత కథ వచ్చేలా వంద పాదాలు గబగబా గుక్క తిప్పుకోకుండా చెప్పారట .
ఓలేటి రాసిన 30 లో ‘’కథాసరిత్సాగరం ‘’అనే అనువాద కృతి గొప్పది .యువ రాజాగంగాధర రామారావుకు ,విశ్వ గుణాదర్శం సూర్యారాయ ప్రభువుకు అంకితం .ఆంధ్రకవుల అపరాధములు ఖండకావ్యం ,కొత్తకవిత్వంతో ‘’నూట పదియార్లు ‘’సీస శతకం విలక్షణం .మూడు ఛందో విన్యాసాలతో సువృత్తి తిలకం రాశారు .అరుదైన ఛందస్సులకు లక్షణాలు రాసి కవిత్రయం నుంచి సాక్ష్యాలు చూపారు .ఇది సాహితీ జిజ్ఞాసులకు అమూల్యకానుక ,కరదీపిక .తిరుపతి వేంకటకవుల ‘’పాశుపతం ‘’కు ఈ జంట ‘’పరాస్తు పాశుపతం ‘’సమాధానంగా రాశారు .తర్వాత ‘’అట్టహాసం ‘’రాశారు .ఇలా మహా కవుల వివాదాలు సాహిత్య పుష్టికి ,భాషాభి వృద్ధికీ సాహిత్య ప్రయోజనానికి తోడ్పడ్డాయి ,వీరిద్దరిపై డా. పాలంకి లక్ష్మీదేవి పరిశోధన చేసి ‘’సారస్వత వరివస్య ‘’రాసింది .
సంస్కృతాంధ్ర సాహిత్య సామ్రాట్ –వేదుల వెంకట సత్యనారాయణ శాస్త్రి -188-1969-40ఎకరాల ఆసామి .ఉభయభాషా ప్రవీణ. వెంకయ్య మహాలక్ష్మి దంపతులకుమారుడు .అన్నదాన ,విద్యాదానాలలో మేరువు. ఉచిత విద్యాబోధన ,అమోఘ ధారణా శక్తి .వర్ణమాలలోని అ నుంచి క్ష వరకుప్రారంభంగా ఉన్న వేల శ్లోకాలు ,పద్యాలు అలవోకగా చెప్పేనేర్పు .దర్జా వస్త్ర ధారణా చేతులకు సింహ తలాటాలు , బరం పుర౦ అత్తరు సాయిబు గారి సెంటు పూసుకొని సాహిత్యంపరిమళం తోపాటు ఈపరిమళమూ వెదజల్లెవారు .విలాస జీవితం .ఇంటికి వచ్చిన పండితులకు సత్కారం చేయకుండా పంపటం లేనేలేదు . బ్రహ్మసూత్ర భాష్య ప్రవచన దిట్ట .శిష్యులు తణుకులో 26-7-1962న ఘనసత్కారం చేసి ‘’సంస్కృతాంధ్ర సాహిత్య సామ్రాట్ ‘’బిరుద ప్రదానం చేశారు.
సాహిత్య రారాజు –పెన్మత్స సత్యనారాయణ రాజు -1899-1980-ఉభయభాషా ప్రవీణ ప్రభుత్వ శాఖలో అనువాదకుడు ,అసిస్టెంట్ పబ్లిసిటి ఆఫీసర్ .గుడివాడ ఆంద్ర నలందకాలేజీలో ఆంద్ర శాఖాధ్యక్షులు ,నార్ల, సూరి భవంతం ,మొదలైనవారు శిష్యులు .బహు గ్రంథకర్త .జయపురం విక్రమదేవ రాజుకు సన్నిహితులు .ఆస్థాన గౌరవ ఆస్థానకవి .ఆయనగ్ర౦ థాలు ‘’తెలుగు రాజు కృతులు ‘’గా ప్రచురితాలు.చంపక మాలినీ పరిణయం ,అచ్చతెనుగు కావ్యం ,పతిభక్తి ,దాక్షారామ భీమేశ్వరశతకం ,రసాతలం ,జ్ఞానాంజలి – (న్యూక్లియర్ సైంటిస్ట్ స్వామి జ్ఞానానందపై)
రాజానంద అలంకార శాస్త్రం ,తపోభూమి ,ఉత్తరరామాయణం మొగల్తుర్రు సంస్థాన నేపధ్యంలో ‘’మొగలిరేకు ,తూర్పు చాళుక్యులపై గోరువంక ,హరిజన దేవాలయ ప్రవేశం పై ఆరాధన ,ఉయ్యూరు కెసీపి వ్యవస్థాపకులు వెలగపూడి రామకృష్ణపై ‘’రామ కృష్ణ చరిత్రం ‘’ఆత్మకథగా ‘’తెలుగు రాజు’’ ,పరిశోధనాత్మక గ్రంథం-ఆచ్ఛిక పద కోశం ,మన్మథ హేల ,రసమంజరి .వేడంగిలో, పుట్టి తణుకు స్థిరపడినా ,చర్ల నారాయణ శాస్త్రిగారి శిష్యుడై కాకరపర్రు పై అభిమానం పెంచుకొన్నారు .కవిరాజు, కవితా విశారద,కళాప్రపూర్ణ బిరుదాంకితులు .కాకరపర్రులో ఈ సాహిత్య రాజుగారి శిలా విగ్రహం ఏర్పాటు చేశారు .ఆంద్ర సోషలిస్ట్ పార్టీ ప్రముఖులలో రాజుగారొకరు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-7-20-ఉయ్యూరు