ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -8
మహా మహోపాధ్యాయ -పురాణ పండ రామమూర్తి 1910–
ఉషశ్రీ కి తండ్రిగారు , పద్యాలు నేర్పిన తోలిగురువుకూడా .వేద శాస్త్ర పురాణాలను ఔపోసనపట్టిన మనీషి .ఈయన సంస్కృతం లో, భార్య సంస్కృతి పరిరక్షణ లో ప్రథములు .పోరోహిత్య జ్యోతిశ , ,ఆయుర్వేదాలతో కాలక్షేపం.ఆలమూరు వెళ్ళాక రామాయణ భారతుపన్యాసకులుగా మారారు 1950-70కాలలో రాజమండ్రి భీమవరం కాకినాడ లలో వందలాది రోజులు వాటిపైనా, ఆధ్యాత్మిక విషయాలపైనా ఉపన్యాసాలిచ్ఛి అనంత జన సందోహాన్ని ఉర్రూత లూగించే వారు .ఆత్మగౌరవ ఆభిజాత్యాలెక్కువ .ఒకసారిఉమ్మడిమద్రాస్ రాష్ట్ర గవర్నరునుకూడా తనకోసం కూర్చోబెట్టిన ఘనులు .చినజీయర్ ఆశ్రమ స్వీకారం చేసిన మొదట్లో వీరివద్దనే పురాణపఠనం నేర్చారు .పండితాగ్రణి జమ్మలమదకమాధవరామ శర్మగారువీరి ఉపన్యాసం విని అబ్బురపడ్డారు. మహామహోపాధ్యాయ ,ఉపన్యాస కేసరి బిరుదాంకితులు
సరస్వతీ కంఠాభరణ వేదుల సూర్యనారాయణ శర్మ -1911-1999-సూర్యనారాయణ ,గౌరమా౦బల పుత్రులు .కాకరపర్రులో ఆకొండి వ్యాసశర్మ ,వ్యాసలింగ శాస్త్రుల వద్ద సంస్కృత,సాహిత్యాలంకారాలు, వేదుల రామమూర్తిగారి వద్ద సంస్కృత వ్యాకరణం నేర్చారు .తణుకు ఉన్నత పాఠ శాలలో తెలుగు పండితులు .వ్యక్తిత్వ వికాసం పెంచేట్లు చదువు నేర్పేవారు .విద్యార్ధులతో పద్యాలు కథలు చెప్పించి వాటిని ‘’ స్టోరీపొఎమ్స్ ‘’గా ముద్రించి ప్రోత్సహించేవారు .కుర్తాళ పీఠాధిపతి బంధకవి సీతా రామాంజనేయులుగారు వీరిశిష్యులు .ప్రవచనం ద్వారాకాక, ప్రవర్తన ద్వారా విద్యార్ధుల ఆదరాభిమానాలు పొందారని ఆచార్య ఎస్వీ జోగారావు అన్నారు .నిత్య విద్యార్ధి ఐన శర్మగారు ఇంగ్లీష్ పాళీ భాషల్లోనూ ప్రావీణ్యం సాధించారు .
శర్మగారు 1940-60లమధ్య ఎన్నోరచనలు చేశారు –లక్ష్మీ సహస్ర కావ్యం ,శృంగార నలీయం శ్రీ శంకర భగవద్గీత , సౌందర్య లహరి తెలుగు వెలుగు భగవద్గీత ,నరేంద్రుడు ,బ్రహ్మ గీతాసారం ,శ్రీ దక్షిణా మూర్తి స్తోత్రం ,ఆర్య చాణక్యుడు ,కాకతి ప్రోలరాజు ,కాకతీయ చరితం ,బౌద్ధ దమ్మపదానికి అనువాదంగా –బుద్ధ గీత ,రక్షక భట తత్వ శాస్త్రం ,వేద తత్వ దర్శనం ,అంతరార్ధ రామాయణ, భాగవత ,భారతాలు ,అంతరార్ధ విష్ణు పురాణంగా దేవీ భాగవతం ,మొదలైనవి. కొన్ని ముళ్ళపూడి తిమ్మరాజు గారికి అంకితమిచ్చారు .ఆర్య చాణక్యుడు లో చాక్యుడు ఆంధ్రుడే అని ,మాతామహ గోత్రం శ్రీవత్స కావచ్చు ననీ అన్నారు .
ఆపన్నులపాలిటి అన్నపూర్ణ ,సేవా తత్పర చారుశీల- చర్ల సుశీల -1911-1976.తండ్రి వేదుల సూర్యనారాయణ శాస్త్రిగారు చిన్నప్పుడే ఈతకొట్టటం సైకిల్ తొక్కిన సాహసి ఉత్సాహి . బాల్యం నుండి మానవ సేవపై ఆసక్తి .భర్త చర్లగణపతి శాస్త్రిగారు .ఇల్లు అతిధి అభ్యాగతుల్తో కళకళ లాడేది .పేద అనాధ సేవ చేసేవారు .అందరిబాదా తనబాదగా భావించటం దాతృత్వం సహజ లక్షణాలు .భర్తగారి భగవద్గీత శ్లోకాలు ప్రార్ధనా గీతాలు బ్రహ్మసమాజ పాటలు శ్రావ్యంగా పాడేవారు. ఉదయం సత్సంగం లో పాల్గొనే వారు .నిత్యమూ కుటుంబ సభ్యులతోకలిసి యోగాసనాలుసూర్య నమస్కారాలు చేసి కాలువలో అందరూ స్నానం చేసేవారు .రాట్నం పై నూలు తీయటం నిత్యకృత్యం గాంధేయ వాదాన్నే అనుసరించి కస్తూరిబాయిలా ఖద్దరు చీరలేకట్టేవారు .విదేశీవస్త్ర బహిష్కరణ, దహనంచేసిన దేశభాక్తురలు .మహా వక్తగా గంభీర ఉపన్యాసాలిచ్చి ప్రేరణకల్గించేవారు .దుర్గాబాయ్ దేశముఖ్ వీరి ఉపన్యాసాలకు ఆకర్షితురాలైంది .
1950లో గణపతి శాస్రి సుశీల దంపతులు నిడదవోలులో ‘’కస్తూరిబాయి మహిళా సమాజం’’స్థాపించగా దాని అధ్యక్షురాలుగా ప్రశస్తమైన సేవలు అందించారు సుశీలగారు .బాలరామాయణం మాతృశ్రీ స్తోత్ర రత్నాలు రాశారు .ఒక సారిపుట్ట పర్తి వెళ్లి సత్య సాయిబాబాపై –
‘’నిరుపేదలు ఆకలికిఅల్లాడు చుండ –బుట్టతలఏల పట్టుబట్ట లేల “-నిరుపేదలు వాసములేక అల్లాడు చుండ –భవనములేల బంగారు స్లాబులేల?’’అని పద్యం రాసి,ధైర్యంగా చదివారు.ఆయన ఏమీ మాట్లాడలేదు ‘’
మర్నాడు బాబా ఒక కవరులో 300రూపాయలు పెట్టి ‘’సుశీలమ్మ ‘’అని రాసి పంపించారు
1976 డిసెంబర్ లో తనకుమారుడు బుద్ధ నారాయణ శాస్త్రి హఠాత్తుగా విపరీతమమైన గుండెపోటు వచ్చివిశాఖలోమరణించాడు భర్త హైదరాబాద్ లో, ఈమె నిడదవోలులో ఉన్నారు .వెంటనే విశాఖకు రైలులో బయల్దేరి దారిపొడుగునా దేవుడిని ప్రార్ధిస్తూ ఆగిన స్టేషన్లలో బీదలకు పండ్లు పంచిపెడుతూ విశాఖ చేరారు , కొడుకు మృత దేహం చూసి చలించిపోయి , ని శ్చేస్టు రాలై అతడి గుండెదగ్గర తల ఆన్చి, రెండు నిమిషాలు ఆగి ‘’వాడిని పడుకో నివ్వండి నేను’’కూడా’’ వెడుతున్నాను ‘’అంటూ భర్తతో ‘’కోడలు చిన్నపిల్ల .ఆమెను జాగ్రత్తగా చూడండి ‘’అని చెప్పి చెప్పి ,దేవుడి గదిలోకి వెళ్లి రెండు నిమిషాలు నిలబడి అక్కడేకిందికి ఒరిగి ప్రాణం విడిచారు .అందర్నీ కన్న తల్లిలా ఆదరించిన ఆమెకు పుట్టెడు పుత్రశోకం కలిగించాడు భగవంతుడు .ప్రేమ వాత్సల్య పూరిత మైన దయార్ద్ర హృదయంకల కరుణామయి చర్ల సుశీలగారి జీవితం అందరికీ ఆదర్శ ప్రాయం ,మార్గదర్శకం ,ప్రేరణ.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-7-20-ఉయ్యూరు