సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -70(చివరిభాగం )
హనుమ కొనసాగిస్తూ’’నర శ్రేష్ట రామా !నీపైఅనురాగం తో నీ హితం కోరే నాపై విశ్వాసంతో ఇక్కడికి రావాలని తొందరపడుతున్న నన్ను
పై విశ్వాసంతో ఇక్కడికి రావాలని తొందరపడుతున్న నన్ను ఆదరంగా మళ్ళీ పిలిచి ‘’రాముడు యుద్ధం లో రావణ సంహారం చేసి వెంటనే నన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళే ట్లు పలువిధాలుగా చెప్పు .శత్రుసంహారహనుమా !నువ్వు ఇక్కడ ఉండాలనుకొంటే రహస్య ప్రదేశం లో ఒక రోజు విశ్రమించి వెళ్ళు .నువ్వు ఇంకొక్క రోజు ఇక్కడ ఉంటె మండభాగ్యురలనైన నా దుఖం కొంతతీరి ఉపశాంతి లభిస్తుంది .నువ్వు తిరుగు ప్రయాణమై వెడితే నాప్రానాలు నిలుస్తాయో లేదో అని సందేహిస్తున్నాను –
‘’ఏవం బహువిధం వాచ్యో రామో దాశరధి స్త్వయా –యథా మా మాప్నుయా చ్ఛీఘ్రం హత్వా రావణ మాహవే ‘’
‘’మమచాప్యల్ప భాగ్యాయాః సాన్నిధ్యా తత్వ వీర్యవన్ – అస్య శోక విపాకస్య ముహూర్తం సాద్విమోక్షణం ‘’’’గతే హిత్వయి విక్రాంతే పునరాగమనాయ వై –ప్రాణానామపి సందేహో మమ స్యా న్నాత్ర సంశయః ‘’
‘’హనుమా ! నా భర్తను ఎడబాసి దుఖాలపాలై దుర్గతి పొందుతున్న నాకు ,నువ్వు కనపడకుండా వెళ్ళటం మరింత శొకకారణ మౌతుంది .నీ సహాయులైన ఋక్ష,వానరుల పై నాకు సందేహం ఉంది .వారూ రామలక్ష్మణులు దాటరాని సముద్రాన్ని ఎలా దాటుతారు ?ఈసముద్ర లంఘనం గరుత్మనుడికి నీకు వాయు దేవుడికి ముగ్గురికి మాత్రమె సాధ్యం .మిగిలినవారికి అలాంటి శక్తి కలిలిగి ఉండకపోవచ్చు .ఇలాంటి దుష్కరమైన కార్యానికి ఏ ఉపాయం ఆలోచించావు నువ్వు ?నువ్వు ఒక్కడివే రావణ ,సకలరాక్షాస సంహారం చేసి నన్ను రామునిసంనిదికి తీసుకు పోగలిగిన సమర్దుడివే దీనివలన కీర్తి నీకు దక్కుతున్దికాని రాముడికి కాదు కదా .కాని రాముడే ఇక్కడి ససైన్యంగా వచ్చి రావణునిపై విజయం సాధించి నన్ను తీసుకుపోవటం ఆయనకు యశస్కరం –
‘’త్వా దర్శన జ శ్శోకో భూయో మాం పరితాపయేత్-దుఃఖా ద్దుఖ పరాభూతా౦ దుర్గతాం దుఃఖ భాగినీం’’
‘’కథం ను ఖలు దుష్పారం తరిష్యంతి మహోదధిం-తాని హర్యక్ష సైన్యాని తౌవా నరవరాత్మజౌ ‘త్రయాణా మేవ భూతానాం సాగారస్యాస్య లంఘనే –శక్తిః స్యా ద్వైతేయస్య తవ వా మారుతస్య వా ‘’
‘’కామమస్య త్వమే వైకః కార్యస్య పరిసాధనే -, పర్యాప్తః పరవీరఘ్న యశస్య స్తే బలోదయః ‘’
‘’బలై స్సమగ్రైర్యది మాం-హత్వా రావణ మాహవే –విజయీ స్వాం పురీం రామో –నయే త్తత్స్యా ద్యశస్కరం’’
‘’హనుమా !పూర్వం రావణుడు నన్ను రాముడు నా దగ్గర లేనప్పుడు మాయోపాయం తో తీసుకు వెళ్ళాడు .కాని రాముడు అలాకపతమార్గం లో నన్ను ఇక్కడి నుంచి తీసుకు వెళ్ళటం ఉచితం కాదు .రాముడు తనసైన్యంతో లంకను నింపి ,అప్పుడు అందరి సమక్షం లో నన్ను తీసుకు వెళ్ళటం తగిన పని .యుద్ధ పరాక్రమ శాలిరాముడు ఎలా సముచితంగా చేయటం తగునో, అలా నువ్వు చెయ్యి ‘’-
‘’యథాహం తస్య వీరస్య వనా దుపధినా హృతా-రక్షసా తద్భయా’’ దేవ తథా నార్హతి ‘’రాఘవః ‘’బలైస్తు సంకులాం కృత్వాలంకాంపర బలార్దనః –మాం నయేద్యదికాకుత్ స్థ స్తత్తస్య సదృశం భవేత్’’
‘’’’తధ్యథా తస్య విక్రాన్త మనురూపం మహాత్మనా –భవ త్యాహవ శూరస్య తథా త్వ ముపపాదయ-‘’
హుమా రామునితో చెబుతూ ‘’రామా !యుక్తియుక్తాలు అర్ధవంతాలు ఐన ఆమె మాటలు విని నేను ఇలా చెప్పాను –‘’అమ్మా సీతా దేవీ!ఋక్ష,కపి సైన్యనాయకుడు రాజు సుగ్రీవుడు రాముడికి తోడుగా ఇక్కడికి వచ్చి నిన్ను తీసుకు వెళ్ళటానికి కృత నిశ్చయుడై ఉన్నాడు .బుద్ధి పరాక్రమంశక్తి మనో వేగం ఉన్న వానరులెన్దరొఆయన సైన్యం లో ఉన్నారు వాళ్ళంతా భూమి ఆకాశం పాతాళాలలో అడ్డు లేని సంచారం చేయగలవారు అమిత తెజస్శాలురు మహాకార్య దురంధరులు .వాళ్ళు ఆకాశమార్గం లో భూమిని చాలాసార్లు చుట్టి వచ్చారు .మా సైన్యం లో నాతో సమానులు నాకంటేశ్రేస్తులుచాలా మన్దిఉన్నారు నాకంటే తక్కువ వారేవ్వరూసుగ్రీవ సైన్యం లో లేనేలేరు .నా వంటి సామాన్యుడే సముద్రాన్ని అవలీలగా దాటి వస్తే ఆమహా బలశాలుర విషయం చెప్పాలా ?నేను వచ్చింది దూతకార్యం కనుక సామాన్యుడైనవాదినే దూతగా పంపాలికనుక నన్ను పంపారు శ్రేస్తులను దూత క్రుత్యానికి పంపరు’’
‘’సుగ్రీవ స్సత్వ సంపన్నస్తవార్థే కృత నిశ్చయః ‘’
‘’తస్య విక్రమ సంపన్నా స్సత్వ వంతోమహా బలాః-మనస్స౦కల్పసంపాతానిదేశే హరయః స్థితాః’’
‘’ప్రదక్షిణీకృతా భూమి ర్వాయుమార్గాను సారిభిః’’-మద్విశిష్టాశ్చ,తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః ‘’-మత్తః ప్రత్యవరః కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ’’
‘’అహం తావ దిహ ప్రాప్తః కిం పునస్తే-మహాబలాః-‘’న హిప్రకృస్టాఃప్రేష్యంతే హీతరే జనాః’’
‘’అమ్మా సీతా దేవీ !ఇంకా చింత మాను .శోకం వదిలేయి ఆవానరులు ఒకే ఒక గంతులో లంక చేరుతారు .నా బుజాలపై రామ లలక్ష్మణులు కూర్చుని సూర్య చంద్రులులాగా నీ దగ్గరకు వస్తారు .సింహ సదృశ అరి వీరభీకరరాముడు ,ధనుర్ధారి లక్ష్మణుడు త్వరలో లంకాద్వారానికి చేరటం నువ్వు చూస్తావు .గోళ్ళు ,పండ్లు ఆయుధాలుగా ఉన్న వీరులు సిమ్హాలుపులులవంటి పరాక్రా శాలురు ,ఎనుగుల్లాగా మహా శ్రేస్తులైన వారు అయిన వానరులు త్వరలో లంకలో ప్రవేశి౦చతమ్ చూస్తావు .కొండల్లాగా,మేఘాల్లాగా ఉన్నతులై లంకలోని మాలయ పర్వత ప్రాంతం లో సింహ నాదం చేసే కపిశ్రేస్టుల మహాధ్వని త్వరలోనే వింటావు .’’అని సీతాదేవి దుఖాన్ని మాన్చాతానికి సకల ప్రయత్నాలు చేసి విశ్వాసం కలిగించాను రామా ‘’అని హనుమ అన్నాడు –
మామ పృష్ఠ గతౌ తౌ చ చంద్ర సూర్యా వివోదితౌ-‘’త్వత్సకాశం మహాభాగే నృసింహా వాగమిష్యతః-‘’
‘’ అరిగ్హ్నం సింహ సంకాశం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం –లక్ష్మణం చ ధనుష్పాణిం లంకాద్వార ముపస్థితం’’
‘’నఖ దంష్ట్రాయుధాన్వీరాన్ సింహ శార్దూల విక్రమాన్ –వానరా న్వార ణే౦ద్రాభాన్ క్షిప్రం ద్రక్షసి సంగతాన్ ‘’
‘’శైలా౦బుద నికాశానాం లంకా మలయా సానుషు-నర్దతాంకపి ముఖ్యా నామచిరా చ్చ్రోష్యసి స్వనం’’
రామా !నేను అమ్మా !శత్రుదమనుడు రాముడు వనవాస దీక్ష పూర్తీ చేసి ,నీతోకలిసి అయోధ్యకు చేరి పట్టాభి షిక్తుడు అవటం త్వరలోచూస్తావు ‘’అని,నువ్వు ఆమె కోసం పరితపిస్తున్నావని నేను చెప్పిన వెంటనే శోకం తో తట్టకోలేక పోయిన సీతాదేవితో ఆమె దుఖం,శోకం తొలగే ఉచితమైన ఇష్టమైన మాటలు చెప్పగా ఆమె దుఃఖ శోకాలు వీడి ప్రసన్ను రాలై,శాంతి పొందింది ‘’అని దూత హనుమ శ్రీరాముడికి సీతా వృత్తాంతమంతా సవిస్తరంగా తెలియ జేశాడు –
‘’నివృత్త వనవాసం చ త్వయా సార్థమరిందమం –అభిషిక్త మయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం ‘’
‘’తతో మయా వాగ్భిరదీన భాషణా-శివాభి రిష్టాభిరభిప్రసాదితా –జగామ శాంతం మామ మైథిలాత్మజా –తవాపి శోకేన తదాభి పీడితా ‘’
అనే అనుష్టుప్ శ్లోకం తో మహా కవి వాల్మీకి సుందర కాండ ముగించాడు .
ఇదిసుందర కాండలో 29శ్లోకాల చివరి 68 వ సర్గ .
ఇందులో సీతకాని రాముడుకాని హనుమంతుడుకాని ప్రయోగించిన శబ్దాలు అర్ధవంతాలు అవతలి శక్తిసామర్ధ్యాలను పూర్తిగా తెలియే జేసేవి .చివరగా చెప్పిన పట్టాభి షేక శుభవార్త రామాయణానికి ఫలశ్రుతి .దానికోసమే ఇన్ని కస్టాలు బాధలు .సుందరకాండ చివరలో ఆశుభవార్త చెప్పటం సుందర కాండను మరింత సుందరంతరం చేసినట్లైంది
సీతాదేవిని హనుమ యెంత కస్టపడి ఊరడించాడోఈ సర్గలో కళ్ళకు కట్టినట్లు రాముడికి తెలియ జేస్తూ మనకు ఎరిగించాడు .తనకంటే తక్కువబలవంతులు సుగ్రీవ సైన్యం లో లేరు అని భరోసా ఇచ్చాడు సీతకు .తానూ సామాన్యుడు కనుక తనను దూతగా పంపారు అనటం అతని సంస్కారం, వినయం, విధేయత ,రామదూతగా హనుమ గొప్ప విజయం సాధించాడు సీతా శోక నివారణ ,ఉపశమనం రామ వియోగ దుఃఖ నివారణ ఆమె కుశలమనే వార్తతో ఆయనకోఉపశమనమ౦ కలిగించాడు.తనను దూతగా పంపిన సుగ్రీవునికీ స్వామి కార్యం నెరవేర్చిన విధేయుడిగా నిలిచాడు దానితో వారరాజుకూ ఆనందం ,ఉపశమనం .
సుందరకాండ తర్వాత రామరావణ యుద్ధం ,అగస్త్యమహర్షి రామునికి ఆదిత్యహృదయం వివరించి బలోపేతుడినినచేయటం ,రావణ సంహారం ,దేవతలు రాముని ప్రస్తుతి౦చటం ,సీతతో సహారామ లక్ష్మణ సుగ్రీవ విభీషనాదులు అందరూ పుష్పకం పై అయోధ్యకురావటం భరతుడి దీక్ష విరమి౦ప జేయటం శ్రీ రామ పట్టాభిషేకం ,రామరాజ్య విషయాలతో రామాయణం పూర్తి-స్వస్తి.
మనవి -14-4-20మంగళవారం ‘’సుందర కాండలో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం ‘’ధారావాహిక ప్రారంభించి ఇవాళ 7-7-20 మంగళవారం సుమారు రెండున్నర నెలలకాలం లో మిగతావి కూడా రాస్తూ68సర్గలను 70ఎపిసోడ్ లలో రాసి , ఈ 70 వ ఎపిసోడ్ తో పూర్తి చేయగలిగాను .మొదటి ఎపిసోడ్ లో చెప్పినట్లు ఎలాంటి ప్రణాళిక లేకుండా మొదలు పెట్టి ,పూర్తి చేశాను .ప్రతిరోజూ ఆ రోజు రాసే సర్గను చదువుతూ ,రాస్తూ ,నాకు అనిపించిన విశేషాలు రాశాను .ఇది ఆదికావ్యం కనుక కావ్య గుణాలను సాధ్యమైనంతవరకు చెప్పే ప్రయత్నమూ చేశాను .ఎక్కడ వీలయితే అక్కడ హనుమ వ్యక్తిత్వాన్ని వివరించాను .ఇవాల్టి వరకు అంతే చేశాను .ఎలా మొదలుపెట్టానో ఎలా పూర్తి చేశానో నాకే ఆశ్చర్యంగా ఉంది .మా స్వామి రాయించుకొని ఉంటాడు .అంతకంటే నేను చెప్పేది లేదు .హనుమ అనుగ్రహం ,సరస్వతీమాత కటాక్షం ,మా తలిదండ్రుల ఆశీస్సులు లేకపోతే ఇలా రాయగలిగే వాడిని కాను అని సవినయంగా మనవి చేస్తున్నాను .నాతోపాటు సుందరకాండలో విహరింఛి, ఆ సౌందర్యాన్ని ఆస్వాదించిన సాహితీ బంధువులకు ధన్యవాదాలు.
సుందర కాండ పారాయణ పద్ధతులు –మనసులోని కోరిక తీరటానికి సుందర కాండ పారాయణ చేస్తారు .పారాయణ చేయాలనుకోనేవారు ఉదయం పూజాదికాలు పూర్తి చేసి శుచి అయిన ప్రదేశం లో కూర్చుని ప్రతిరోజూ స్మార్తులైతే శ్రీమహాగణపతిధ్యానం మిగిలినవారు వారివారి విధానాలలో ధ్యానం ,వాల్మీకి నమస్క్రియ,ఆంజనేయ నమస్క్రియ ,రామాయణ ప్రార్ధనా ,శ్రీరామ ధ్యానం శ్లోకాలు చదవాలి .పారాయణ పూర్తి అయ్యాక నైవేద్యం పెట్టి హారతిచ్చి ‘’స్వస్తిప్రజాభ్యః –నుంచి యద్యత్కర్మ కరోమి తట్టదఖిలం రామాస్తుతేపూజనం ‘’దాకాఉన్న శ్లోకాలు చదివి ముగించాలి .
పారాయణ మొదటి రోజున సంక్షిప్త రామాయణసర్గ ,శ్రీరామావతార సర్గ ,శ్రీసీతారామ కళ్యాణ సర్గ ,సీతారామ సుఖజీవన సర్గ చదివిన తర్వాతే సుందరకాండ మొదటి సర్గతో ప్రారంభించాలి
చివరి రోజు పారాయణ నాడు అంటే సుందరకాండ 68వ సర్గ పూర్తి చేసిన రోజున నాగపాశ విమోచన సర్గ ,ఆదిత్య హృదయ సర్గ ,రావణ వధ సర్గ ,శ్రీరామ స్తుతి సర్గ ,శ్రీరామ పట్టాభి షేక సర్గ చదవాలి
1-ఒక్క రోజులో పారాయణ పూర్తి చేయాలనుకొంటే పైన చెప్పినవన్నీ అదే వరుసలో చేయాలి
2-2రోజుల్లో –మొదటి రోజు సుందరకాండ 1నుంచి 36వ సర్గవరకు ,రెండవ రోజు37నుంచి 68వరకు పారాయణ చేయాలి
3-3రోజుల్లో –మొదటిరోజు 27వ సర్గ వరకు ,రెండవరోజు 28నుంచి 41వరకు మూడోరోజు 42నుంచి 68సర్గవరకు
4-5రోజులపారాయణ –మొదటి రోజు 15వ సర్గవరకు రెండో రోజు 27వరకు మూడోరోజు 38వరకు నాల్గవ నాడు54 వరకు ఐదవరోజు 55నుంచి 68వరకు
5-8రోజుల్లో –రోజుకు 9సర్గల వంతున ,7రోజులు మిగిలినవి 8వ రోజు పారాయణ చేయాలి
6-9రోజుల పారాయణ –మొదటి రోజు 1-5,రెండు -6-15,మూడు-16-20,నాలుగు -21-26,ఐదవరోజు -27-33,ఆరవరోజు -34-40,ఏడవరోజు -41-52,ఎనిమిదవ రోజు – 53-60,తొమ్మిదవ రోజు -61-68 సర్గలు పారాయణ చేయాలి
ఎన్ని రోజులు చేసినా చిత్తశుద్ధి ముఖ్యం .పారాయణ రోజుల్లో అంటూ మైలలకు దూరంగా ఉండాలి .దాన్నిబట్టి ప్లాన్ చేసుకోవాలి ఇదంతా ఒక దీక్షగా భావి౦చిచేయాలి .అప్పుడే ఫలితం .శ్రీ సుందరకాండ పరాయణ ఫలప్రాప్తి రస్తు
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-7-20-ఉయ్యూరు .