ప్రపంచ దేశాల సారస్వతం
113-కామెరాన్ దేశ సాహిత్యం
.మధ్య ఆఫ్రికా లోని గల్ఫ్ ఆఫ్ గినియా లో కామెరాన్ దేశం ఉంది.రాజధాని –యవౌండే.కరెన్సీ –సెంట్రల్ ఆఫ్రికాన్ CFA ఫ్రాంక్ .జనాభా 2.52కోట్లు .అధికార భాషలు –ఫ్రెంచ్ ,ఇంగ్లీష్ .30శాతం ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువనే ఉన్నారు .ప్రకృతి వనరులు పుష్కలం .ఆయిల్ ,గాస్ నాణ్యమైన కలప ,ఖనిజాలు ఎక్కువ .వ్యావసాయిక దేశం కూడా .కాఫీ ,కాటన్ కోకా .మైజ్ కస్సావా పంటలు బాగా పండిస్తారు .’’ఎల్ హాది బాబా అహ్మద్ దాన్ పూలలో’’ దేశంలో 561మిలియన్ CFA ఫ్రాంక్ లున్న అత్యంత ధనవంతుడు .యాత్రిక భద్రత ఉంటుంది .క్రిస్టియానిటి ,ఇస్లాం ముఖ్యమతాలు .77శాతం ప్రజలు అక్షరాస్యులు .ఆరేళ్ళ ప్రాధమిక అయిదేళ్ళ మాధ్యమిక రెండేళ్ళసేకండరి విద్యావ్యవస్థ ఉన్నది .విద్యార్ధుల విద్యకు అన్నిరకాల ప్రోత్సాహం ప్రభుత్వం కల్పిస్తుంది .
కామెరాన్ సాహిత్యం –కాలనీ ప్రభుత్వ హయాములో లూయీ మేరీ పోల్కా ,సంకీ మైమో రచయితలను యూరోపియన్ మిషినరి సొసైటీలు చదివింఛి దేశాన్ని ఆధునిక ప్రపంచం లో ఉంచటానికి దోహదం చేశాయి .జీన్ లూయీ నిజేమ్బా మేడుసైన్స్ ఫిక్షన్ నవల ‘’నంగా కోన్ ‘’ను బులుభాషలో1932లో రాశాడు .ప్రపంచయుద్ధం తర్వాత మొంగో బెట్టి ,ఫెర్డినాండ్ఒయోనో ఆలనీ వ్యవస్థను విమర్శించి అందులో కలవటానికి నిరాకరించాడు .ముసలితరం రచయితలలో గుల్లియామే ఒయానో మిబియా ,మేబెల్లా సొన్నే డిపోక్కో,ఫ్రాన్సిస్ బేబియ,కేంజో జుమ్బాన్ ఉన్నారు .
గొప్పరచయితలుగా పేరు పొందినవారిలో ఇమ్బోలో ముబూ ,ఫ్రాన్సిస్ నిగనా౦గ్ ,లీనాస్ టిఅసొంగ్ ఉన్నారు .2014లో ఇమ్బోలోముబే తన మాన్యుస్క్రిప్ట్ కు ఒక మిలియన్ డాలర్ల డీల్ ను రాండం హౌస్ తో కుదుర్చుకొన్న గొప్ప రచయిత్రి .నవలపేరు ‘’బిహోల్డ్ ది డ్రీమర్స్ ‘’.ఈ దేశంలో గ్రాండ్ ప్రిక్స్ ఆఫ్ లిటరరీ అసోసియేషన్స్ 2013లో ఏర్పడి అర్హులకు ప్రైజులు ఇస్తున్నారు .బెల్లిస్ ఎండి రెండు సార్లు ఈ అవార్డ్ పొందటం ఆశ్చర్యం .చార్లెస్ సేల్.ఫిస్తం మోవాన్జా ముసులియ ,సాంకీ మైమో లు కూడా పొందారు .
అఫుంగ్ ఫెగే ఎవిటా,బో యి అమాంగ్ ,ఎస్ సి అబెగా ,పాల్ చార్లెస్ ఆటంగానా,మిమ్బు మిమ్బు టేన్ను,జాక్వెస్ బెంగోనా ,ఐజాక్ ముమే ఎలిటా ,షె డుకుటుమొదలైన వర్ధమాన రచయితలెందరో ఉన్నారు
కామెరాన్ దేశం పై రాయబడిన పుస్తకాలు –దిఓల్డ్ మాన్ అండ్ దిమెడల్ ,ప్రిజనర్ వితౌట్ ఎ క్రైం,ఫుట్‌ప్రింట్స్ ఆఫ్ డెస్టిని వగైరా .
114-కేప్ వెర్డే దేశ సాహిత్యం
రిపబ్లిక్ ఆఫ్ కాబో వెర్డే గా పిలువబడే కేప్ వేర్డే దేశం అట్లాంటిక్ సముద్రమధ్యంలో ఉన్న ఐలాండ్ .అగ్నిపర్వత ప్రాంతం .రాజధాని-ప్రై యా .కరెన్సీ –కేప్ వేర్దియన్ ఎస్కుడో .జనాభా -5న్నర లక్షలు .రోమన్ కేధలిక్కులు ఎక్కువ .పోర్చుగీస్ అధికారభాష .క్రియోల్ భాష ప్రజలభాష .అక్షరాస్యత 87శాతం .ఉచిత ప్రాధమిక మాధ్యమిక విద్య .ఆదాయవనరులు –ఫిషింగ్ ,వ్యవసాయం రవాణా ,పబ్లిక్ సర్వీసులు .పశ్చిమ ఆఫ్రికాలో రెండవ ధనిక దేశం .
కేప్ వేర్డేసాహిత్యం –ఎక్కువభాగం పోర్చుగీస్ భాషలోనే ఉంటుంది .కొందరు క్రియోల్ ఫ్రెంచ్ ఇంగ్లీష్ భాషల్లోనూ రాశారు .ఈదేశకవి ‘’యూజీనియో టావరెస్ రచనలు ప్రపంచ మంతా వ్యాపించాయి ,మాన్యూల్ లోప్స్ ,బల్ట సార్ లోప్స్ డ సిల్వా అనే ఒస్లాండో అల్కంటర,జార్జి బార్బోసా లుకూడా ప్రసిద్ధులు .16వ శతాబ్ది కవి ఆండ్రే అల్వారెస్ డి అల్మడ ఈ దేశం లో నదులగురించి రాశాడు .1890వరకు ఈ దేశ సాహిత్యం రికార్డ్ అవలేదు .అప్పుడే యుజినియో టావరెస్’’మొర్మా పోయెమ్స్ ‘’ బ్రావా క్రియోల్ భాషలో రాశాడు .క్రియోల్ భాషలో రెండవ పుస్తకం ‘’దిసారో ఆఫ్ లవ్’’ను జేవియర్ డాకున్హారాసి 1893లో ప్రచురించాడు .ఈఆర్చి పెలగలో రెండు లైబ్రరీలు కాలనీ ప్రభుత్వ కాలం లో 1890 లో ఏర్పడ్డాయి .అవే నేషనల్ లైబ్రరి ,మూజియం లు .
జాతీయ స్వాతంత్ర్య ఉద్యమాలు వచ్చాక 20వ శతాబ్దిలో ఈ దేశ సాహిత్యం విస్త్రుతమైనది .ఆంటోనియో పెడ్రో’’డయారియో ‘’రాసి 1929లో ప్రింట్ చేశాడు .రచయిత గాయకుడు బి లేజా 1933లో చాలారచనలు చేశాడు అందులో ‘’ఉమా పర్టిక్యుల డ లిరకాబో వెర్డియానో ‘’వంటివి ఉన్నాయి .ఈ దేశ సంగీత వివరాలున్న పుస్తకం ఇది .అగూ నాల్డో ఫోన్ సేక ఈ దేశ విస్మృత కవి .
1975జులై 5 న ఈదేశం స్వతంత్రం పొంది ‘’దిఐలాండ్ ఆఫ్ కన్టే౦డాప్రచురణ జరిగింది .హెన్రిక్ టేక్సీరియా డీ సౌసా ,గేబ్రియల్ మేరియానోలు రచనలు చేసి ముద్రించారు .జేర్మనో అల్మీడియా1982లో ‘’ఓ డియా డాస్ కల్కస్ రోలడాస్’’ ది లాస్ట్ విల్ అండ్ టెస్టమెంట్ఆఫ్ సేన్హార్ డాసిల్వా అరుజో 1989రాసి అచ్చువేశాడు .ఇందులో కఠినవాస్తవికతకు హాస్యం జోడించాడు .తర్వాత ఆ దేశ చరిత్ర ‘’కాబో వేర్డే’’2003లో రాశాడు .ఈ ఐలాండ్ ప్రపంచం లో అయిదవ అందమైన దేశంగా గుర్తింపు పో౦దినపుడు De Monte Cara vê-se o mundo iరాశాడు
మహిళా రచయితలు ఎలీన్ బార్బోసా ,యారా డోస్ సాన్టోస్,వేరా డువార్టే రచనలతో ముందున్నారు డువార్టేకు2001లోరాసిన ఆఫ్రికన్ పోయెట్రికి ‘’కామోస్ ప్రైజ్ వచ్చింది ఇది కేప్ వేర్డేలోరాయబడిన రాయబదినఎకైక కవితాసంపుటి .
ఆధునిక రచయితలలో మాన్యూల్ వీగా ,జేర్మనో అల్మేడియ,అర్మేనియో వియరియ మిల్టో ఎలియాస్ ఉన్నారు వియరియా రాసిన కవితా సంపుటికి 2009లో కామోస్ ప్రైజ్ వచ్చింది
రచయితలలో –జేర్మానో అల్మీదియా ,ఓర్లాండో అమరిల్లిస్ ,డేనియల్ ఫిల్పి సెర్జియో ఫ్రుసోని వగైరాలు ముఖ్యులు కవులలో –జార్జి బార్బోసా ,అజవేడోకాబ్రాల్ ,యోలాండా మొరాజో,ఒవిడోమార్టినస్ వగైరాముఖ్యులు .ఇక్కడి పుస్తకాలలో –ట్రాన్స్ నేషనల్ ఆర్చిపేలగో ,చిక్విన్హో ,చువా బ్రాబా దిఫార్చునేట్ ఐల్స్ వగైరా .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-7-20-ఉయ్యూరు