ప్రపంచ దేశాల సారస్వతం
115- సెంట్రల్ ఆఫ్రికా దేశ సాహిత్యం
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశం మధ్య ఆఫ్రికాలో సూడాన్ కు ఆగ్నేయంగా ఉంది.దీనిలో భాగం గా కామెరూన్ ,చాడ్ ,కాంగో ,బ్రజవిల్లీ , డెమోక్రాటిక్,ఈక్విటోరియల్ గినియా,గబాన్ సావో టోమ్అండ్ ప్రిన్సిపి దేశాలున్నాయి . రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు బంగూయి రాజధాని .కరెన్సీ –సేన్త్రలాఫ్రికన్ CFA ఫ్రాంక్ –జనాభా -47లక్షలు .అధికార భాషలు-సాంగో ,ఫ్రెంచ్ .స్థానిక భాషలు 72ఉన్నాయి .విపరీతనేరాలు సాయుధ దోపిడీ కి కేంద్రం చాలాభాగం సైన్యం పర్యవేక్షణలో ఉంటుంది .ఖనిజాలు ,క్రూడాయిల్ ,గోల్డ్ ,డైమ౦డ్ ,యురేనియం, కోబాల్ట్ నిలయం. ప్రపంచ పదిపేద దేశాలలో ఒకటి .అత్యల్ప జిడిపి ఉన్న దేశం.క్రిస్టియన్లు ముస్లిం లు ఉన్న దేశం .ఉచిత నిర్బంధ విద్య ఆలులో ఉన్నది .37శాత౦మాత్రమె అక్షరాస్యులు.వ్యవసాయం అడవులు ఆర్దికవనరులు .
సెంట్రల్ ఆఫ్రికన్ సాహిత్యం –మహిళా రచయితలు –ఆండ్రీ బోవిన్ –మానవహక్కుల ఉద్యమకారిణి .మై కంట్రీ అనే ఆటో బయాగ్రఫి రాసింది .జార్జేట్ ఫ్లారెన్స్ కోట్ డిబల్లీ –ఇంగ్లిష్ ప్రొఫెసర్ .కవితా సంపుటి’’ క్లేస్ట్ లా వీ ‘’207లో రాసి ప్రచురించింది .’’నాగో ఓయు కామెంట్ సెన్ సోటిర్ 2008లో రాసింది .ఎడ్రిన్ ఎబౌజా –బాలసాహిత్యం తోపాటు చాలానవలలు రాసింది .అందులో బెంగూ అల్లోయ్ ,లీ బియు డు బియాన్ బియాన్ వంటివి ఉన్నాయి .
పురుషులలో –ర్రఫెల్ నజబొమడ యకోమా చారిత్రిక రచనలు చేశాడు .ఎలిజబెత్ లాన్కిఒలొఫియొ జర్నలిస్ట్ .ఎబ్రెల్ గౌమ్బా ,ఎటేన్నీగోయమిడే,మార్టిన్ జిగు ,జీన్ పాల్ నగాపుండేలు కూరా ప్రసిద్ధరచయితలే .
116-చాద్ దేశ సాహిత్యం
చాద్ దేశం మధ్యఉత్తర ఆఫ్రికాలో ఉంది.సరిహద్దు లిబియా .రాజధాని –నడజమేనా .కరెన్సీ సెంట్రల్ ఆఫ్రికన్ CFA ఫ్రాంక్ .జనాభా –ఒకటిన్నర కోట్లు .చాద్ అంటే సరస్సు .ఇది లక్షా ముప్పై వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం లో ఉన్న 7000నాటి పురాతన సరస్సు .గొప్పయాత్రా కేంద్రం .87శాతం ప్రజలు పేదలు .టెర్రరిజం కిడ్నాపింగ్ ,నేరాలు ఘోరాలకు నిలయం .సగం జనాభా ముస్లిం లు మిగతావారు క్రైస్తవులు ఫ్రెంచ్ ,చాద్ భాషలేకాక 120తెగల భాషలున్నాయి .23శాతంమాత్రమే అక్షరాస్యత .ఆయిల్ కాటన్ కాటిల్ పశుసంపద ఆదాయవనరులు .
చాదియన్ సాహిత్యం –నిత్యం అస్థిర కల్లోల రాకీయంతో సాహిత్యంరూపు దిద్దుకోలేదు తరతరాల మౌఖిక జానపదగీతాలు గాధలే ఉన్నాయి .చాద్ భాషలో కంటే ఫ్రెంచ్ లోనేరచనలు చేస్తారు .ఆహ్మాట్ తబోయే అనే ఆదేశ ఏకైక సాహిత్య విమర్శకుడు Anthologie de la littérature tchadienne 2003లో రాశాడు .జోసెఫ్ బ్రహిం సీయాద్ ,బాబా ముస్తఫా ,ఆంటోని బంగూయి ,కౌల్సి లాంకో వంటి కొద్దిమంది రచయితలూ మాత్రమె ఉన్నారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-7-20-ఉయ్యూరు