ప్రపంచ దేశాల సారస్వతం
119-డిజి బౌటి దేశ సాహిత్యం
తూర్పు ఆఫ్రికాలో వల్కనోలు బీచెస్ ,ప్రపంచంలోనే అత్యంతఉప్పుశాతం ఉన్న సముద్రం ,పొదలు డనాకిల్ ఎడారి ఉన్నసిటీ దేశం డిజిబౌటి .లేక్అబ్బే వద్ద నోమాడిక్ అఫార్ తెగల ప్రజలు అతిప్రాచీనకాలం లో ఆవాసాలు ఏర్పరచుకొన్నారు .చిమ్నీ లాంటి మినరల్ ఫార్మేషన్స్ వి౦తగా ఉంటాయి .కరెన్సీ- డిజబౌటి ఫ్రాంక్ .జనాభా -9.5లక్షలు .ఫ్రెంచ్ అరబిక్ అధికార భాషలు.ప్రజలభాష డిజిబౌటి.సున్ని ముస్లిం ఇస్లాం దేశం . 30శాతం మగ ,15శాత౦ ఆడ మాత్రమె అక్షరాస్యులు .ఇప్పుడిప్పుడే నిర్బంధ విద్య అమలులోకి వచ్చింది .చర్మాలు కాఫీ రద్దు ఇనుము ఆదాయవనరులు .లాక్ అస్సల్ ,మౌచా ఐలాండ్ ,డే ఫారెస్ట్ నేషనల్ పార్క్ దర్శనీయ ప్రదేశాలు .సురక్షిత దేశం .దేశాన్ని నెక్స్ట్ టు దుబాయ్ అంటారు
డిజిబౌటి సాహిత్యం –అనాదిగా కవిత్వ౦ ఉన్నది .అభి వృద్ధి చెందిన సొమాలి రకమైన ,గాబే ,జిఫ్ఫో ,గీరార్ ,విగ్లో ,బురాన్ బుర్,బీర్ కేడ్ మొదలైన గీతాలు ప్రచారం లో ఉన్నాయి .సాహిత్యమంతా ఇస్లాం కు సంబంధించిందే ఎక్కువ .ఎలిజి , స్తుతి శృంగారం ,దూషణ ,ఆనందం ,మార్గదర్శకత్వం పై కవిత్వం ఉంటుంది .బరురోడిక్ అనేది ఒక ప్రసిద్ధుని పై స్మ్రుతి .యుద్ధవీరుడు ,దైవీ భూతుడు కవి లపై రాసినవి అఫార్ లు .ఇవన్నీ జానపదాలే తరతరాలుగా మౌఖికంగా నిలచినవే . యుద్ధ గీతాలు బాగా ప్రచారమయ్యాయి. శిహాబ్ ఆల్ దిన్-రాసిన ‘’ఫుటా అల్ అబాష్ ‘’అనే మధ్యయుగ చరిత్ర ముఖ్యమైనది .అబిసీనియ ను ఆడాల్ సుల్తాన్ సైన్యం యుద్ధం లోఓడించినప్పటి 16శతాబ్ది చారిత్రిక కధనం అది .ఇటీవల చాలామంది కవులు రచయితలూ తమజ్ఞాపకాలను రచనలలో పొందు పరుస్తున్నారు
డిజి బౌటి సాహిత్యం ఇంకా యవ్వనం లోనే ఉన్నది .1960లో ప్రారంభమైంది .మొట్టమొదటి కవయిత్రి,రచయిత్రి అబ్డౌ రుహ్మాన్ వబెరి మల్లెల సుగంధ కవిత్వం రాసి పరిమళాలు వెదజల్లింది .విలియం జే ఎస్ స్వాద్ ఈదేశ కవిత్వ పిత .కాస్మిన్ అనే కవితా సంపుటితో దేశంలోనూ ఇతరదేశాలలో ప్రసిద్ధిపొందాడు .ఫ్రెంచ్ భాషకు పయనీర్ గా భావిస్తారు .లీ రివీల్ అనేది ఒక్కటే ఇక్కడి పత్రిక .హౌసీన్ అబేది రాసిన –అబిది దిచైల్డ్ ఆఫ్ ది ఫ్రెంచ్ టేర్రిటరిఆఫ్ అసర్సండ్ ఇస్సాస్ 1972ప్రచురితం .దీన్ జోమినిక్ పీనల్ బయగ్రఫిగా ఒక పుస్తకం రాశాడు .ఒబర్ ఒస్మాన్ రబెహ్ –దిసర్కిల్ అండ్ దిస్పైరల్ రాశాడు .దేబార్రే నటుడు నాటకకర్త ప్రయోక్త దర్శకుడు .
120-ఈజిప్ట్ దేశ సాహిత్యం
ఉత్తర ఆఫ్రికాను మధ్య ప్రాచ్యంతో కలిపేది ఈజిప్ట్ దేశం .నైలునది పరివాహక ప్రాంతం పారాలు అనే చారిత్రాత్మక కట్టడాలు స్మ్రుతి చిహ్నాలు ,పిరమిడ్లు ,రాజుల సమాధులు వగైరాలకు నిలయం.కర్నాక్ దేవాలయం ప్రసిద్ధి .రాజధాని –కైరో .కరీన్సి –ఈజిప్షియన్ పౌండ్ .జనాభా .దాదాపు 10కోట్లు . అధికశాతం ముస్లిం లు కొద్దిమంది క్రిస్టియన్లు ఉన్నారు .అరబిక్ భాష అధికార భాష .అక్షరాస్యత 71శాతం .నిర్బంధ విద్యావిధానం బేసిక్ విద్య కి౦డర్ గార్డెన్,ప్రాధమిక విద్య ఉంటాయి .వ్యవసాయం మీడియా ,పెట్రోలియం సహజ వాయువు ,టూరిజం ఆదాయవనరులు .ఆరబ్ లీగ్ లో సభ్యదేశం .
ఈజిప్ట్ సాహిత్యం –సాహిత్యం అంతా రోమన్ ఆధిపత్యం వరకు ఈజిప్షియన్ భాషలోనే ఉండేది .పుస్తక సంస్కృతికి నాంది పలికింది ఈజిప్ట్ .మొదట్లో పేపిరస్ పై రాసేవారు .మొదటి సాహిత్యం సిన్హూయీ కధ.తర్వాత ది ఫేమస్ బుక్ ఆఫ్ డెడ్.ఇక్కడి సాహిత్యాన్ని విస్డం లిటరేచర్ –జ్ఞాన సాహిత్యం అంటారు .ప్రాచీన ఈజిప్షియన్లపై నైలునది ప్రభావం జాస్తి .ప్రక్కదేశాలనుంచి మేధావులు ఇక్కడికి వలస వచ్చి స్థిరపడ్డారు .ఈజిప్ట్ కవి ,రచయితా ‘అపల్లోనియాస్ ఆఫ్ రోడ్స్’’, డయనోసియా కా అనే ఎపిక్ కావ్యం రాసిన నానోస్ ఆఫ్ పానాపోలిస్ చాలా ప్రసిద్ధులు .మధ్యయుగ గాధ సినూయే క్లాసిక్ గా భావిస్తారు
1-4శతాబ్దాలమధ్య అలెగ్జాండ్రియా క్రైస్తవానికి ప్రాధాన్యం కలిగింది .కాప్టిక్ రచనలు వచ్చాయి .నాగ్ హమ్మాది లైబ్రరి లెక్కలేనన్ని గ్రంధాలను రక్షించింది .18వ శతాబ్దిలో ముస్లిం లు ఈ దేశాన్ని ఆక్రమించి పాలించారు .పాపిరస్ బదులు పేపర్ వాడకం లోకి వచ్చింది .ప్రజలంతా ఇస్లాం తీసుకొన్నారు .ఐబాల్ అల్ నఫీస్ అనే నవల ఆరబ్ ఈజిప్ట్ లో వచ్చిన మొదటినవల .అరేబియన్ నైట్స్ కధలు మధ్యయుగ కధనానికి ప్రతిబింబం .పర్షియా బాగ్దాద్ కధలూ బాగా ప్రచారమయ్యాయి .1798లో నెపోలియన్ ఇక్కడ ఉన్నప్పుడు ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది .1805లో మహామ్మదాలి ‘’ అమీరి ప్రెస్’’ ఏర్పాటు చేశాడు .మొదట్లో అరబిక్ అటోమాన్ టర్కిష్ రచనలే ముద్రించారు .ఆల్ వకత్ న్యూస్పేపర్ వచ్చింది
19 వ శతాబ్దిలో నహ్డా ఉద్యమమ అంటే రినైసేన్స్ ఉద్యమం వచ్చి సంస్కృతితో పాటు సాహిత్యాన్నికూడా ప్రభావితం చేసింది .పాన్ఇస్లామిక్ రివల్యూషనరి ని మొహమ్మద అబ్డూ మొదలైనవారు తెచ్చారుకాని ఎక్కువకాలం నిలవలేదు.ఇస్లామిక్ మోడర్నిజం కు ఆద్యుడు అబ్డూ .ప్రభావవంతమైన రచనలు రిసలత్ అత్తావుహ్ద్,షర్హ్నః అల్ బాలాఘా ,మొదలైనవి రాశాడు .మొహమ్మద్ హుస్యాన్ హే కాల్ మొదటి ఈజిప్షియన్ ఇస్లామిక్ నవల ‘జేనాబ్ ‘’రాశాడు .ఈ శతాబ్దిలో తాహా హుస్సీన్ , నగూబ్ మెత్ ఫౌజ్ లు కూడా ప్రదిద్ధులైన రచయితలే .మెత్ ఫౌజ్ కు సాహిత్యం లో మొదటి నోబెల్ ప్రైజ్ వచ్చింది .
1990తర్వాత స్త్రీలు విజ్రుమ్భించి రాస్తున్నారు .ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ అరెబిక్ ఫిక్షన్ ఏర్పాటుచేసి సమర్ధులకు అందిస్తున్నారు .చాలామంది క్లాసిక్ ఆరబ్ లోనే రాస్తున్నారు
ముఖ్య రచయితలలో కొందరు –తాహాహుసేన్ ,యూసఫ్ ఇడ్రిస్,సోనల్లా ఇబ్రహీం ,నయుబ్ మతాఫౌజ్ ,నూర్ అబ్దుల్ మజీద్
ముఖ్యనవలలు –దిబ్లూ ఎలిఫెంట్-ఆహ్దాఫ్ సోయి , ,దిలాంప్ ఆఫ్ హం హసీద్ ,హెప్తా ,దియాకూబియన్ బిల్డింగ్ ,పాలస్ వాక్ ,పాలస్ డిజైర్ ,షుగర్ స్ట్రీట్-నాగాబ్ మౌత్ ,దిఓపెన్ డోర్,ఎస్పారో ఫ్రం దిఈస్ట్,ది కాల్ఆఫ్ దికర్లూ-కాహాహుస్సే .డెత్ ఆన్ దినైల్ –అగతా క్రిస్టి,దిగోల్డెన్ గాబ్లిట్-ఈలోస్ జార్వి ,దిఈజిప్షియన్-మికా వాల్టర్
నాగుబ్ మొహఫౌజ్ ఒక్కరికే సాహిత్య నోబెల్ ప్రైజ్ వచ్చింది
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-7-20-ఉయ్యూరు