ప్రపంచ దేశాల సారస్వతం
121-ఈక్విటోరియల్ గినియా దేశ సాహిత్యం
మధ్య ఆఫ్రికాలో రియో ముని మెయిన్ లాండ్ తోపాటు అయిదు వల్కానిక్ ఆఫ్ షోర్ ఐలాండ్స్ ఉన్న దేశమే ఈక్విటోరియల్ గినియా.రాజధాని –మాలాబో .స్పానిష్ కలోనియల్ అర్కి టేక్చర్ కు ఆయిల్ నిల్వలకు ప్రసిద్ధి .ఎరీనా బ్లాంకా బీచ్ డ్రై సీజన్ సీతాకోక చిలుకలు ఆకర్షణ .కరెన్సీ –సెంట్రల్ ఆఫ్రికన్ ఫ్రాంక్ .జనాభా -13లక్షలు .రోమన్ కేధలిక్కులు ఎక్కువ .అక్షరాస్యత 95శాతం .ప్రీ స్కూల్ ప్రైమరీ సెకండరి హయ్యర్ విద్యావిధానం .14వ ఏడువరకు ఉచిత కంపల్సరి విద్య . అధికార భాషలు –స్పానిష్ ,పోర్చుగీస్ ,ఫ్రెంచ్ .గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు –ఫాంగ్, బూబే ,కొమ్బే ,పిడిజిన్ ఇంగ్లిష్ ,అన్నబోనేస్సి ,ఇగ్బో ఆఫ్రికాలో స్పానిష్ మాట్లాడే దేశం ఇది .ఆఫ్రికా ఖండం లో అత్యంత సంపన్న దేశం .నల్లబంగారం అంటే బొగ్గు గనులకు ప్రసిద్ధి .చిన్న కమతాల రైతులు మాత్రం పేదవారు ,తగిన సహకారం లేకపోవటమే కారణం .కోకా పంట ఉత్పత్తి ,ఆయిల్ వగైరా ఆదాయ వనరులు .
ఈక్విటోరియల్ గినియా సాహిత్యం -1778-1968మధ్య కాలనీ ప్రభుత్వకాలం లో ఇతర ఆఫ్రికా దేశాలకు భిన్నంగా ఈ దేశం లో స్పానిష్ భాషలోమాత్రమే సాహిత్యం వర్ధిల్లింది .అదే ఇప్పటిదాకా కొనసాగు తోంది.కాని అప్పటి సాహిత్యం చాలాతక్కువగా లభ్యమౌతోంది .మోర్గాన్ స్టేట్ యూని వర్సిటి ప్రొఫెసర్ స్పానిష్ భాషలో1979-91కాలం లో ప్రచురితమైన 30ఆన్దాలజీలపై రిసెర్చ్ చేస్తే ఈ దేశపు రచయిత రాసిన ఒక్క పుస్తకమూ దొరకలేదట .
ఈ దేశ సాహిత్యం పై మొదటి రచన స్పానిష్ జర్నల్-స్పానిష్ గినియా .కాని ఇందులో ఈదేశ రచయితల రచనలేవీ లేవు .మొదటి ఈక్విటోరియల్ నవల లివెంసియో ఎవిటాఎనాయ్ రాసిన ‘వెన్ ది కొమ్బేస్ ఫాట్’’.ఇందులో జాతులమధ్య పోరాటం ఉంటుంది .రెండవ నవల ‘’ఎ స్పియర్ ఫర్ ది బోబి ‘’.రచయిత డేనియల్ జోన్స్ మతామా .దాదాపు ఆత్మా కథవంటిది .1962-68మధ్య దేశ స్వతంత్ర పోరాటకాలం లో గొప్పరచనలేవీ రాలేదు .కొందరు కథలు లెజెండ్స్ ఎడిట్ చేసిజర్నల్స్ లో వేశారు.వీరిలో ఫ్రాన్సిస్కో ఓబ్లాంగ్ ,రాఫెల్ మేరియా నుజే మొదలైనవారున్నారు .అప్పుడే మొలకెత్తుతున్న సాహిత్యపు మొలకల్ని ఫ్రాన్సిస్కో నకియాస్ నగూమా ప్రజాస్వామ్య ఎన్నికలలో గెలిచి డిక్టేటర్ అయి తొక్కేశాడు .చాలామందిప్రజలు దేశం వదిలి ప్రవాసం వెళ్ళారు .దీనినే బల్బోరా బొమ్కేస్ ‘’lost జనరేషన్ ‘’అన్నాడు .
ప్రక్క దేశాల్లో స్థిరపడ్డ ఈదేశ రచయితలు రెండుభాషల్లోనూ రచనలు చేశారు. వారిలో ఎల్ సుయోనో ‘’డ్రీం ‘’,డొనాటో’’దిక్రాసింగ్ ‘’,మోప్లాల్ లబోజ్ ‘’దిలాస్ట్ లెటర్స్ ఆఫ్ ఫాదర్ ఫ్లుజెంషియోఅబద్’’,లలోతమ స్వాతంత్ర్య హరణం గొప్పగా చిత్రించారు .హిస్టరీ ఆఫ్ ట్రాజేడి ఆఫ్ ఈక్విటోరియల్ గినియా ‘’ను డొనాటో బిడ్యోగా రాశాడు .’’వేర్ ఆర్ యు గినియా ‘’అని జువాన్ బాల్బొవా బోనేకా రాశాడు .ఈయనే ‘’ఎక్సైల్’’కూడా రాశాడు .ఆంథాలజిఆఫ్ గినియన్ లిటరేచర్ కూడా రాశాడు .
1984నుంచి సాహిత్యానికి మంచి రోజులు వచ్చాయి .మేగజైన్ లలో సాంస్కృతిక సాహిత్య విశేషాలు ప్రచురించేవారు .సెంటర్ ఫర్ఇస్పానిక్ గినియా కల్చర్ ను 1982లో మలాబోలో స్థాపించి ఈ దేశ రచయితలకు ప్రోత్సాహం కలిగించారు .దిఫైత్ఫుల్ ఫ్రెండ్ ,ను అన్నా లూద్రాస్ సోహోరా ,’’అఫేన్ దిలిటిల్ గోట్ క్వీన్ ‘’,ది లాస్ట్ లెసన్ ఆఫ్ ది వెనరబుల్ ఏమగా ఎలా ‘’నుఆన్టిమోఎసోనో నోడోమ్గో ,దిబూటే చీబా ‘’ను పెడ్రో క్రిస్టినో బురిబెరి 1987నుంచి 92వరకు రాశారు .’’షౌట్స్ ఆఫ్ లిబర్టి అండ్ హాప్’’కవితా సంపుటి ని అనాక్లిటోఓలా ముబే,’’డెలిరియం’’ ను మేరియా నుయో అంగూ 1991లో రాశారు .
రెండవ తరం రచయితలు ఆ దేశ జీవితాన్ని సింబాలిక్ గా చిత్రించారు .1985లో మేరియాలూసే అంగు మొదటినవల ‘’ఎకోమో’’పబ్లిష్ అయింది .అప్పుడే జువాన్ బోలోబా బోనేకా ‘’ది రీయూనియన్ దిరిటర్న్ ఆఫ్ ది ఎక్సైల్’’నవల వచ్చింది .’’వాయిసెస్ ఫ్రం ది సర్ఫ్’’మొదటి గినియా కవితా సంపుటి లో సిరాకో బోకాసా తన బాధలు వ్యక్తపరిస్తే ,బోనేకా మొదటి ఆంథాలజిఆఫ్ పోయెట్రి’’డ్రీమ్స్ ఫ్రం మై జంగిల్ ‘’కవితా సంపుటి ప్రచురణ జరిగింది .1987లో ‘’ది డార్క్ నెస్ ఆఫ్ యువర్ బ్లాక్ మెమరి’’నవల డొనాటో బిడ్యోగో రాసి ప్రచురించాడు .
సమకాలీన రచయితలలో కొందరు –ఆన్తిమో ఎసోనో ,మెర్సేడేస్ జోరా,జేరార్డోబేహారి ,మాక్సిమిలనో నుకోబో ,జోస్ఎనేమే ఒయోనో వగైరా .
122-ఎరిట్రియా దేశ సాహిత్యం
ఈశాన్య ఆఫ్రికాలో యెర్ర సముద్రం ప్రక్కన ఇధియోపియా సరిహద్దులో ఎరిట్రియా దేశం ఉన్నది .రాజధాని –అస్మారా .కరెన్సీ –ఎరిట్రియన్ నక్ఫా .జనాభా -32లక్షలు .ఆర్ధడాక్స్ క్రైస్తవులు సున్ని మతస్తులు ,రోమన్ కేథలిక్కులు ఉంటారు .టిగ్రినా టీగ్రె,దాహ్లిక్ ,ట్రిగ్రిన్యాలు మిగిలిన భాషలు .అధిరార భాష –ట్రి గ్రిన్యా .అక్షరాస్యత 84శాతం .ప్రైమరీ, ప్రీ ప్రైమరీ , ,మిడిల్ ,సెకండరి విద్యా విధానం .వ్యవసాయం ముఖ్య ఆదాయం .జొన్న మొక్కజొన్న బార్లి ,గోధుమ సోర్ఘం ము ఖ్యపంటలు .అనుమతుఅలతోనే దేశంలో యాత్ర చేయాలి .రిస్క్ ఎక్కువ .
ఎరిట్రియా సాహిత్యం –ఈ సాహిత్యం లో చారిత్రకకథలు ఎక్కువ .మత కవిత్వాలూ ఎక్కువే . ట్రిగ్రిన్యా భాషలో మొదట వెలువడిన పుస్తకం ‘’గాస్పెల్స్ అనువాదం’’1830లో రాయబడి ,1866లో ప్రచురితం .సాహిత్యభాషగా గీఎజ్ డామినేట్ చేసింది .తర్వాత టిగ్రినియ దాని స్థానం పొందింది .20వ శతాబ్దిలో మరిన్ని రచనలొచ్చాయి .గేబ్రే మేదిన్ దిఘ్నేయి జానపద కథలు,గాథలు సేకరించి1902లో రోమ్ లో ప్రచురించాడు .34కథలలో ది బాయ్ హు క్రైడ్ ఉల్ఫ్ ఒకటి .కార్లో కొంటిరోస్సాని మౌఖిక కవిత్వం సేకరించి ముద్రించాడు. దోగా విషాదగీతాలూ అచ్చు అయ్యాయి .రాస్ వాల్దామిక్ హీల్స్ ఆఫ్ హేజ్జేగా దిగ్గియాట్ హాలు ఆఫ్ జాజేగ్గా లు 19వ శతాబ్ది పోరాటాలనుంచి ఇప్పటివరకు సేకరించి ప్రచురించారు .
సృజన రచన ‘’హౌ ది వరల్డ్ వజ్ సెట్ అబ్లేజ్ బికాజ్ ఆఫ్ ది టు సర్పెంట్స్’’అనే 270లైన్ల కవిత్వం 1916లో రోమ్ లో పబ్లిష్ అయింది .ఇది మొదటి ప్రపంచ యుద్ధ౦పై కామెంటరి.స్వతంత్రం ముందు ,తర్వాత నాటకం మాంచి ఊపు పొందింది .సోలోమన్ దిలార్ ,ఎస్సలాస్ సెగ్గాయ్మాస్గుం ,జెరియా నాటకాలు ప్రసిద్ధం .ఆ దేశ నాటక చరిత్రలో ఇవి మణిపూసలు .’’టిగ్రినియా ట్రడిషనల్ ప్రావెర్బ్స్ అండ్ సాంగ్స్’’1942లో పబ్లిష్ అయింది .రినైసేన్స్ ఉద్యమం ఇక్కడా వచ్చి టిగ్రిన్యా భాషలో ఘెబ్రియాస్ హైలు ‘’ఎ స్టోరి ఆఫ్ ఎ కాన్స్క్రిప్ట్’’నవల రాశాడు .టేక్లాయ్ జేవేల్డి’’ డాన్ఆఫ్ ఫ్రీడం ‘’1954లోనవలరాశాడు రిసరక్షన్అండ్ విక్టరి’’నవల జగ్గా ఇలూసియాస్ జేవేల్డిరాశాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-7-20-ఉయ్యూరు