ప్రపంచదేశాల సారస్వతం
123-ఇధియోపియా దేశ సాహిత్యం
గ్రేట్ రిఫ్ట్ వాలీతో విభజింప బడిన ఇథియోపియా దేశం ఆఫ్రికా కొమ్ము భాగాన ఉన్న ది.3మిలియన్ల సంవత్సరాలక్రిందటి శిధిలాలున్నాయి .12,13శతాబ్దాల రాక్ కట్ చర్చిలు,సమాధులు గోపురాలు ఆకర్షణ .లేడీమేరీ జియాన్ చర్చ్ యాత్రాస్థలం .రాజధాని –ఆడిస్ అబాబా ,కరెన్సీ –ఇథియోపియన్ బిర్ర్. జనాభా -11కోట్లు .అధికారభాష –అమ్ హరిక్.ఇటాలియన్ ఫ్రెంచ్ కూడా మాట్లాడుతారు మతం –ఆర్ధడాక్స్ క్రిస్టియానిటి రోమన్ కేధలిక్ ,కొద్దిమంది యూదులు ఉన్నారు .అక్షరాస్యత 52శాతం .8ఏళ్ళ ప్రాధమిక ,నాలుగేళ్ల సెకండరి ఉన్నాయి .వ్యవసాయమే ముఖ్య ఆదాయవనరు .కాఫీ పప్పు ధాన్యాలు ,సేరియల్స్ ,బంగాళాదుంప చెరుకు ,కూరగాయలు పండిస్తారు .సురక్షిత దేశం .బ్లూ నైల్ ఫాల్స్ ,సిమీన్ పర్వతాలు ,లేక్ టానా మొదలైనవి టూరిస్ట్ స్పాట్స్ .
ఇధియోపియా సాహిత్యం –మూడు భాగాలలో సాహిత్యం ఉంటుంది .క్లాసికల్ సాహిత్యం లో చారిత్రిక విషయాలు వీరులపై కవిత్వం ,ఊహాత్మక తాత్విక రచనలు ,రొమాంటిక్,రాజకీయ సాహిత్యం .ఇదంతా గేఎజ్ సెమెటిక్ భాషలో ఉంటుంది .ఇవి హృదయాలలో చొరబడవు సాహిత్య సంస్కృతీ ప్రతిబింబించవు.
ఆక్సుమైట్ సాహిత్యం –క్రీ.శ 330-900-2000బిసి నుంచే ఈదేశం లో సెమెటిక్ భాష ప్రచారం లో ఉంది .340లో క్రిస్టియానిటి వచ్చాక గీజ్ భాష అధికారభాష అయి సాహిత్యం వచ్చింది.ఒకటవ శతాబ్దినుంచి ఇక్కడ క్రైస్తవం ఉంది .5,6శతాబ్దాలకు చెందిన గోఎజ్ స్క్రిప్ట్ లో గరిమ గాస్పెల్స్ దొరికాయి .ఆక్సుమైట్ కాలం లో వచ్చినదంతా క్రిస్టియన్ సాహిత్యమే .
పోస్ట్ ఆక్సు మైట్ సాహిత్యం -1200-1600ఆక్సుమైట్ కు దీనికీ మధ్య ఉన్న 300ఏళ్ళలో ఏ సాహిత్యమూ రాలేదు 1270లో సాల్మన్ రాజవంశకాల౦ లోరచనలు ఉన్నాయి. ఇది గేఎజ్ భాషా సాహిత్యానికి స్వర్ణయుగం గా భావిస్తారు అప్పటికి గేఎజ్ భాష అదృశ్యమైనా .ఈభాష స్థానం లో ఆం హెరిక్ భాష వచ్చింది . 15వ శతాబ్దంలో ‘’దిఎక్స్ప్లికేషన్ ఆఫ్ జీసెస్ ‘’ఒకరాజు గారి జోస్యం.దీనికి 19వ శతాబ్దిలో ప్రాచుర్యం కలిగి రెండవ ధియోడరస్ రాజు ఈదేశానికి ఈ పేరు పెట్టాడు .జరా యాకోబ్ కాలం లో సాహిత్యం వృద్ధి చెందింది .ఆయనే దిబుక్ ఆఫ్ లైట్ ,దిబుక్ ఆఫ్ నేటివిటి రాశాడు .ట్రూ ఆర్ధడాక్సి ని జాన్ క్రిసోస్టో౦ రాశాడు .లాస్ ఆఫ్ కింగ్స్ అనేది గేఎజ్ భాషలో ఉన్న దానికి అనువాదంగా వచ్చింది అబ్బా ఏమ్బకోంరాసినుత్తరం హబాకుక్ ,గేట్ఆఫ్ది ఫెయిత్ లో ఇస్లాం ను ఎందుకు వదిలేయాలో ఉన్నది .17వ శతాబ్ది ఆఫ్రికన్ బయాగ్రఫి ఆఫ్ యాన్ ఆఫిదియోపియన్ వుమన్ ను 1672లో గాలా వుడవోస్ రాస్తే ,ఇంగ్లీష్ అనువాదం పొంది 2017లో పాల్ హెయిర్ ప్రైజ్ పొందింది .
16-18శతాబ్దాలకాలం లో అమ్హెరిక్ భాషవ్రాతభాషగా రూపు దిద్దుకొని సాహిత్యం మొలకలు తొడిగింది అబ్బా గోగోరిస్ ,స్నేహితుడు హియాబ్ లుడాల్ఫ్కలిసి ఈభాషలో మొదటి వ్యాకరణం, అమ్హేరిక్ –లాటిన్ నిఘంటువు రాశారు .ఏ హిస్టరీ ఆఫ్ ఇథియోపియా తోపాటు విజ్ఞానసర్వస్వమూ వెలువడింది .అబ్బా బోహ్రె అనే మాంక్ చారిత్రక రచయిత ,ఎత్నోగ్రాఫార్ .1593లో ‘’దిహిస్టరీ ఆఫ్ దిగల్లా ‘’గ్రంధం రాసి ప్రసిద్ధి పొందాడు .ఇందులో 16శతాబ్దపు ఒరోమో ప్రజల గురించికూడా ఉంది .ఇతడే ‘’కింగ్ ఆఫ్ సరసా డేన్గేల్’’కూడా సరసా డేన్గెల్ రాజుపాలన గురించి రాశాడు .
19వ శతాబ్దం నుంచి నేటిదాకా –అడ్డిస్ అలమాహేయు ట్రాజిక్ నవల ‘’లవ్ టు ది గ్రేవ్ ‘’రాశాడు .ఇదే ఆధునిక సాహిత్యం లో మాస్టర్ పీస్ అంటారు
పురుష రచయితలు –జియోర్గిస్ ఆఫ్ సేగ్లా-మతగ్రన్ధరచయిత .బెఫెకూడు హైలు-నెట్ లో బ్లాగు నిర్వహిస్తాడు .2012లో బర్ట్ అవార్డ్ ఇంటర్నేషనల్ ప్రెస్ ఫ్రీడం అవార్డ్ గ్రహీత .చిల్ద్రెన్ ఆఫ్ దెయిర్ పేరెంట్స్ గొప్పరచన .మెంగిస్టూ లెమా-మరేజేస్ బై అబ్డక్షన్ నాటకం తో పేరొచ్చింది .మారేజేస్ ఆఫ్ అన్ ఈక్వల్స్ బలేకాబా ఏనా ,ఎలేచ్చా గబిచ్చ నాటకాలు కూడా రాశాడు.జిబ్రేబ్ టేఫరి –కవి ,నాటకరచయిత .లైఫ్ పోషన్ ,డోంట్ ఫర్గెట్ యువర్ మిలిటరి డ్యూటి ,ఏ సోల్జర్ ఈజ్ నాట్ అఫ్రైడ్ ,లవ్ ఈజ్ ది డాక్టర్ మొదలైనవి రాశాడు
స్త్రీ రచయితలు –ఎమోడిష్ బెకేలే –కవిత్వం,కధాసంపుటి తో పాటు ఏడురచనలు చేసిన క్రైం జర్నలిస్ట్ .రివల్యూషనరి పోయెమ్స్ ,వేస్టెడ్ టైం,ఫ్రూట్ వితౌట్ ఫ్రూట్, మడ్ ఈజ్ బెటర్ నవల ,లైఫ్ వాంట్స్ లవ్-క్రైంనవల వగైరా రాసింది .బెల్లిని సియోం వోల్డీస్-సమానహక్కుల ఉద్యమకారిణి కవి రచయిత్రి .’’ధింగ్స్ ఐ ఇమాజిన్ టెల్లింగ్ మై డాటర్ ‘’కవితాసంపుటి .మోడరన్ స్లేవరి ఇన్ ఇధియోపియా,ఇధియోపియ వయోలెన్స్ ఎగైనెస్ట్ వుమెన్ ఆన్ ది రైజ్ వ్యాసావళి .ట్రాన్స్ ఫర్మేటివ్ స్పేస్ వగైరా .సేనేడు గేబ్రు –పార్లమెంట్ కు ఎన్నికైన మొదటి మహిళా .మేక్లిట్ హేడేరో –సంగీతరాణి.నాటకాలు రాసి ప్రదర్శించింది .వుయ్ ఆర్ అలైవ్. మొదలైన ఆల్బమ్స్ తెచ్చింది .మార్తా నసిబు -2005లో జ్ఞాపకాలురాసి ప్రచురించింది .మేరియా అబ్బేబు వయరెంగో-ఒరోమోభాష , దేశ సంస్కృతీ జ్ఞాపకాలు లపై రచనలు చేసింది
124-గాబన్ దేశ సాహిత్యం
మధ్య ఆఫ్రికా అట్లాంటిక్ తీరాన దట్టమైన అరణ్యాలు అడవి మృగాలు ఉన్న దేశం గాబన్ .రాజధాని –లిబ్రేవిల్ .కరెన్సీ –సె౦ట్రల్ ఆఫ్రికన్ ఫ్రాంక్ .జనాభా 21లక్షలు .అధికారభాష –ఫ్రెంచ్ .రోమన్ కేధలిక్ మతం .అక్షరాస్యత 84.7శాతం .6-16ఏళ్ళవారందరికి నిర్బంధ విద్య .ఆయిల్ ఉత్పత్తిలో ఆఫ్రికాలో అయిదవ స్థానం ఇదే ఆదాయవనరు .నేషనల్ పార్క్ లు దర్శనీయాలు .
గాబన్ సాహిత్యం –అమెరికా యూరోపియన్ రచయితల రచనలే ఉంటాయి .ఏ థౌజండ్లీగ్స్ ఇంటూ దిఅన్ నోన్ పుస్తకం బాగా ప్రాచుర్యం పొందింది.
ఈతరం రచయితలలో జస్టిన్ మింటేసా హానోరిన్ నూగు ,సిల్వి నేస్టెంఅన్గేలి రవ్రి స్త్రీరచయితలు .ఇంతకంటే వివరాలు దొరకలేదు
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-7-20-ఉయ్యూరు