ప్రపంచ దేశాల సారస్వతం
125-ది గాంబియా దేశ సాహిత్యం
పశ్చిమాఫ్రికాలో చిన్న దేశం ది గాంబియా .అట్లాంటిక్ తీరాన ఉన్నది ,వైవిధ్య ఈకో సిస్టం కు ఉదాహరణ .సెంట్రల్ గాంబియా నది ప్రాణం .రాజధాని –బెనుజి.కరెన్సీ –గామ్బియన్ డలాసి.జనాభా -23లక్షలు .అన్నిమతాలవారు ఉన్న మతసామరస్య దేశం .అధికారభాష –ఇంగ్లీష్ .మండింక,ఒలోఫ్ భాషాజనం కూడా ఉన్నారు .అక్షరాస్యత -64శాతం .7సంవత్సరాల బ్రిటన్ మోడల్ చదువు .వ్యవసాయమే ముఖ్య ఆదాయం. వేరుసెనగ ,మిల్లెట్ ,కాటన్ కస్సావా ముఖ్యపంటలు .గాంబియా రివర్ సేర్రెకుండా ,మార్కెట్ కోలోలి బీచెస్ .మొసళ్ళ బీచ్ ,సఫారి టూరిజం స్పాట్స్ .
గాంబియా సాహిత్యం –డయో ఫారేస్టర్ మొదటి నవల ఆఫ్రికా రీజియన్ రీడింగ్ దిసీలింగ్ కు కామన్ వెల్త్ రైటర్స్ ప్రైజ్ 2008లో వచ్చింది .శాలీ శాడిల్ సిన్ఘలె మొదటి నవల ‘’క్రిస్టీస్ క్రైసిస్.రెండవది ది సన్ షైన్స్ .ఎబౌ గాయే ‘’ఫేక్ లవ్’’,రోహా ఫోలి ఒదాం ‘’కాస్ట్లి ప్రైసెస్’’ముఖ్యమైనవి
జానెట్ బద్జాన్ యాంగ్ –దేశం లో ప్రముఖ స్త్రీ నాటకకర్త .గాంబియా దేశ సాహితీ సేవకు అవార్డ్ పొందింది .దిఅల్టిమేట్ ఇన్ హీరిటేన్స్,దిబాటిల్ ఆఫ్ సన్కాండ్,దిడాన్స్ ఆఫ్ కచ్చికాలి ,దిహాండ్ ఆఫ్ ఫేట్,చైన్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ నాటకాలు ,కలెక్టివ్ వార్ ఎగైనెస్ట్ పావెర్టి వ్యాసాసంపుటి రాసినది .విలియం ఫర్కుహార్ కాంటన్-రాసిన 12పుస్తకాలలో ది ఆఫ్రికన్ ఒకటి.దీనికి సీక్వెల్ గా దిఫ్లైట్స్ .వెస్ట్ ఆఫ్రికా ఇన్ హిస్టరీ కూడా రాశాడు .హస్సౌం సీసే –హిస్తోరియాన్ మ్యూజియం క్యురేటర్. గామ్బియన్ వుమెన్ , పేట్రియట్స్ , ఫౌండింగ్ ఫాదర్ రాశాడు విజ్ఞానసర్వస్వ నిర్మాణంలో పాలుపంచుకొన్నాడు, చాలావ్యాసాలురాసిన టివి పెర్సనాలిటి మిగిలినవారిలో వుయేడ్రమ్మే ,అబౌ డిబ్బా,హస్సాన్ బుబాకర్,అగుస్టాజవారా ,జోసెఫ్ హెన్రి జూఫ్ ,అల్హాజి అలియు ఎబ్రిమా చాం జూఫ్ ,టాంసియర్ జూఫ్ ,అగాస్టామొహానే ,సుల్యమాన్ నియాంగ్ ,లేన్రి పీటర్స్ ,టిజాన్సల్లా ,సాలి సిన్ఘేటాలామిన్ సిన్నేహా ,ఫిలిప్స్ వీట్లీ ఉన్నారు ‘
126-గినియా దేశ సాహిత్యం
పశ్చిమ ఆఫ్రికాలో అట్లాంటిక్ కు పడమట గినియా దేశం ఉన్నది .మౌంట్ నిమ్బా నేచర్ కు ప్రసిద్ధి .రాజధాని –కొనాక్రీ .కరెన్సీ –గినియన్ ఫ్రాంక్ .జనాభా -1.24కోట్లు .అధికారభాష –ఫ్రెంచ్ .ఇతరభాషలు –ఫుల ,కిస్సి ,కేపెల్లా,సుసు వగైరా.మతం -85శాతం ముస్లిం లు .ఫ్రాన్స్ విద్యావ్యవస్థ అమలులో ఉంది .అక్షరాస్యత 32శాతం మాత్రమె . కొనాక్రీ ఐలాండ్స్ ,కిన్డ్లా నేచర్,కంకాన్ యాత్రాస్తలాలు .నేరాలెక్కువ సురక్షితం కాదు .ప్రపంచ బాక్సైట్ గనులలో 25శాతం ఇక్కడే ఉన్నాయి .వజ్రాలు బంగారం కూడా లభిస్తాయి .అల్యూమిన ఉత్పత్తులు 80శాతం ఆదాయ వనరులు .
- గినియన్ సాహిత్యం –మొదట్లో మౌఖికమే .పాపువా యూనివర్సిటి చొరవతో రచనలు జరుగుతున్నాయి .మొదటి మేగజైన్ కోవావే .1968లో ఆల్బర్ట్ మావొరీ కికి ‘’టెన్ దౌసండ్ యియర్స్ ఇన్ లైఫ్ టైం’’రాశాడు .పురుషరచయితలు-మొహముడ్ బా –Construire la Guinée après Sékou Touré, Éditions L’Harmattan, 1990
- Guinée 1958-2008 : రాశాడు .
- టీర్నో అబ్దుల్ రహ్మానే –వచనరచనలు చాలచేశాడు .ఫ్రూట్స్ ఆఫ్ మై దాట్స్ కవితా సంపుటి
- సైడో బోకోం –చైనే నవల రాశాడు .బౌబుకర్ యాసినో డయల్లో –మానవహక్కుల పోరాట యోధుడు రచయితా .దేర్నో డయావోపెల్లేట్ -409కప్లేట్స్ రాశాడు .సలోమనా కాంటే-నుకో ఆల్ఫబేట్ సృష్టికర్త .ఫోదేబా కీటా-నాటకరంగ రచయితా దర్శకుడు .కమారాలాయే –దిఆఫ్రికన్ చైల్డ్ ,దిరేడియన్స్ ఆఫ్ దికింగ్ ,దిగార్డియన్ ఆఫ్ ది వరల్డ్ రాశాడు .టేర్నోమొనేమేమ్బో –లెస్ క్రాప్డ్స్ బిసె ,పెల్పోర్నియో ,పీయస్ సేయుల్ ,బీడ్ స్యూల్ వగైరారాశాడు .దిబ్రిల్ తామసిన్ నియానే – the father of the late model Katou.ఆలు –చారిత్రాత్మక రచనలు –లా టైతే,రెసిస్టన్స్ మొదలైనవి లివ్రేట్ డీ బాల్లేట్ మేరీ మొదలైన నాటకాలు .హిస్టరీ డిఅఫ్రికి ,జాగ్రఫీ ,ఎడ్యుకేషన్ సివిక్ ,మొన్ బియు పేస్ లాగినీ చారిత్రకాలు రాచ్శాడు .విలియమ్స్ సస్సినే –అల్ఫాబీటే ,మెమొరి దీం పియూ ,లిజున్ హోమ్మేవగైరా.రాశాడు .
- సశేషం
- మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-7-20-ఉయ్యూరు