పశ్చిమాఫ్రికాలో ట్రాపికల్ దేశం గినియా బిస్సౌ .నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ ఆకర్షణలు .రాజధాని –బిస్సౌ .కరెన్సీ –వెస్ట్ ఆఫ్రికన్ ఫ్రాంక్ .జనాభా 18.75లక్షలు .పోర్చుగీస్ భాషమాట్లాడే ,ముస్లిం దేశం .అధికార భాష పోర్చుగీస్ ఫ్రెంచ్ కూడా జనం మాట్లాడుతారు .అక్షరాస్యత 46శాతం .ఏడవఏడు నుంచి 14వరకు కంపల్సరి విద్య .ప్రపంచ 10పేదదేశాలలో ఒకటి .వ్యవసాయం ఫిషింగ్ ముఖ్య ఆదాయ వనరులు .జీడిపప్పు పంటకు ప్రసిద్ధి .జీడిపప్పు ఉత్పత్తిలో ప్రపంచంలో ఆరవ దేశం .బిస్సగోస్ ఐలాండ్స్ ,తోపాటు హిప్పో పోటామస్ ,ఒరంగో జంతువులకు ప్రసిద్ధి .
గినియా బిస్సౌ సాహిత్యం –యుద్ధానంతర సాహిత్యమే ఎక్కువ అగష్టిన్హోనెటో,మేరియో పింటోవిరియాటో డా క్రూజ్ లు కవులుగా ,లువాన్డినో వీరా నవలాకారుడిగా ప్రసిద్ధులు
పోర్చుగీస్ పాలనలో 500 ఏళ్ళు విద్యాసంస్థల నిర్మాణ౦ జరగలేదు .స్వతంత్రం పొందాకే సాహిత్యారంభామైంది .1970లో మొదటి కవిత్వం ప్రచురితమైంది 1982ల రైటర్స్ యూనియన్ ఏర్పడింది .
- మగరచయితలు –అమిక్రార్ కేబ్రెల్ –వామభావ రచయిత.రెసిస్టన్స్ అండ్ డీ కలనైజేషన్ ,రిటర్నేడ్ టు ది సోర్స్,యూనిటి అండ్ స్ట్రగుల్ పుస్తకాలురాశాడు .వాస్కో కాబ్రా –ఫైనాస్ మినిస్టర్ . A luta é a minha primavera, 1981 (poetry) రాశాడు .ఫాస్టో ద్యుఆర్టే-బ్లాక్ నావేల్లా నవల ,జ్ఞాపకాలు మరో నాలుగుపుస్తకాలు రాశాడు .కార్లోస్ లోప్స్-ఎకనామిస్ట్ సివిల్ సర్వెంట్ .ఆఫ్రికన్ యూనియన్ కు ప్రతినిధి .అబ్డులాయ్ శిలా –పాటలరచయిత .ఎటేర్నాపెక్సావో ,అల్టిమేట్ ట్రాజేడియా.మిస్టిడా నవలలురాశాడు
- స్త్రీ రచయిత-ఒడేటి సేమేడో-ఎంట్రి ఓ సీర్ ఇఒ అమర్ ,నో ఫన్డోడో కాంటో,లితెరేచారా డీ గినియా రాసింది
- 128-ఐవరీ కోస్ట్ దేశ సాహిత్యం
- ఐవరీ కోస్ట్ అనబడే కోటే డి ఎల్ వోయిర్ పశ్చిమాఫ్రికాలో బీచ్ రిసార్ట్స్ఉన్న దేశం . రాజధాని యామౌస్సోక్రా .కరెన్సీ –వెస్ట్ ఆఫ్రికన్ ఫ్రాంక్ .జనాభా 2.51కోట్లు .అధికారభాష ఫ్రెంచ్ .ఆఫ్రికాభాషలైన యకౌబా ,సేనౌఫా ,బయోలె ,అట్టి,అగ్ని,దయౌలా అనే మార్కెట్ భాష మాట్లాడుతారు .కేధలిక్కు క్రైస్తవులు సున్ని ముస్లిం లు సమానంగా ఉంటారు .అక్షరాస్యత 47శాతం .ఫ్రెంచ్ కాలనీ విద్యావిధానం మూడేళ్ళ ప్రీ స్కూల్ ,ఆరేళ్ళ ప్రైమరీ ,ఏడేళ్ళ సెకండరి విద్య ఉంటుంది .సెయంట్ పాల్ కేదేద్రల్ ,గ్రాండ్ బస్సం నేషనల్ పార్క్ దర్శనీయాలు .కాఫీఉత్పత్తి,యెగుమతులలొ ప్రపంచంలో మొదటిస్థానం .కోకాబీన్స్ ,పామాయిల్ ,టింబర్,పెట్రోలియం కూడా ఆదాయ వనరులు .
- ఐవరీ కోస్ట్ సాహిత్యం –దీన్నే ఐవోరియన్ సాహిత్యం అంటారు .అకే లోబా ,పియర్రి డూప్రే,జేగోవా బెస్సి నోకాన్ రచయితలూ .బెర్నార్డ్ డాడీ ఐవరికోస్ట్ ఫైనేస్ట్ రచయితగా గుర్తింపు పొందాడు.జీన్ మేరి అడియాఫ్ఫీ –లాకార్టేడిడెంటీ నవల కు గ్రాండ్ ప్రిక్స్ అవార్డ్ వచ్చింది .మారిస్ బాండ్ మన్- Le fils de la femme maleకూ గ్రాండ్ ప్రిక్స్ వచ్చింది .అకే లోబా రాసిన – Kocumbo, l’étudiant noirకూ ఆ ప్రైజ్ దక్కింది .ఆహ్మదౌ కౌరౌమా రాసిన Monnè, outrages et defisకూ, Les Soleils des indépendances వచ్చింది అదే ప్రైజ్ .బెర్నార్డ్ డాడీ రాసిన Patron de New-Yorkకూ La ville où nul ne meurt లభించింది
- స్త్రీలలో –మార్గురైట్ అబౌ ఎట్ -అయాఆఫ్ యోప్ సిటినవలరాసింది ఈదేశంలోని వైవిధ్యభరిత జనం పై రాసిననవల.ఆదేశాజాతీయత కల్చర్ , ఆర్టిస్టిక్ స్టైల్ అన్నీ ఉంటాయి
- సశేషం
- మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-7-20-ఉయ్యూరు