ప్రపంచ దేశాల సారస్వతం
129-కెన్యా దేశ సాహిత్యం
తూర్పు ఆఫ్ర్రికాలో హిందూ సముద్రతీరాన కెన్యాదేశం ఉంది.సవానా ,లేక్లాండ్స్ ,డ్రమాటిక్ గ్రేట్ రిఫ్ట్ వాలీ ,మౌంటేన్ హై లాండ్స్ ఉంటాయి .సి౦హాల ఆవాసభూమి .రినో, ఏనుగుల నిలయం .సఫారికి ప్రత్యేకం .రాజధాని –నైరోబి .కరెన్సీ –కెన్యన్ షిల్లింగ్ .జనాభా 5.14కోట్లు .అధికారభాషలు-బంటూస్వాహిలి ,ఇంగ్లిష్ .మతం –ఎక్కువశాతం క్రిస్టియన్లు మిగిలినవారు ముస్లిం లు వగైరా . అక్షరాస్యత -81.54.విద్య -8-4-4తరహా .వ్యవసాయం ,ఫారెస్త్ట్రి,ఫిషింగ్ ,ఎగుమతులు ఆదాయ వనరులు .
కెన్యా సాహిత్యం –మౌఖిక సాహిత్యమే చాలాకాలం .తర్వాత బ్రిటిష్ ఆంధ్రాపాలజిస్ట్ లు ఎస్పెత్ హక్సలి ,ఇసాక్ దినేసన్ వాటిని సేకరించి భద్రపరచారు
కెన్యారచయితలలో గ్రేస్ ఒగోట్,మేజామివాంగి,పాల కిపచుంబ ,కిన్యాంజు కొమ్బాని ,బిన్నవాంగా వైనేనా .
స్టోరి ఆఫ్ తంబూకా ను సుల్తాన్ ఆఫ్ పేట్ ఆస్థానకవి మేవంగో 1114లో రాశాడు .అతని ఎపిక్ కవిత్వమే మొదటిది .వీప్ నాట్ చైల్డ్ మొదటి నవల ఇంగ్లీష్ లో దియాన్గో రాశాడు .ఇతనే రాసిన రివర్ బిట్వీన్ నవల సెకండరి స్కూల్ సిలబస్ లో ఉన్నది .ఇసాక్ డినేన్సన్’’అవుట్ ఆఫ్ ఆఫ్రికా ‘’.ఎల్స్ పేత్ హక్స్లీ రాసిన ది ఫ్లేం ట్రీస్ ఆఫ్ థీకా సింక్లైర్ ప్రైజ్ వచ్చింది .బేరిన్ మర్కహాం ‘’వెస్ట్ విత్ ది నైట్ ‘’రాశాడు .
130-లెసోతో దేశ సాహిత్యం
దక్షిణాఫ్రికాలో హైఆల్టిట్యూడ్ దేశం లెసోతో .రాజధాని-మసేరు .జనాభా -21లక్షలు కరెన్సీ –లెసోతో లోటి.క్రిస్టియన్ దేశం.అధికార భాషలు – సేసోతో ,ఇంగ్లిష్ .మిగిలినవి-పూతి హోసా ,జులు వగైరా .అక్షరాస్యత -76.64శాతం విద్య -3-7-3-2విధానం .భూమి పశుపోషణ,గనులు ఆదాయవనరులు .ఆఫ్రికి పర్వతాలు ,మాలసున్యా ఫాల్స్ ,కాట్సే డాం విహార స్థలాలు .
లెసోతో సాహిత్యం –ఆంగ్లంలోనే ఉంటుంది.1931లో చోకా నవల సేసోతోభాషలో ధామస్ మొఫోలో రాశాడు .జులు చక్రవర్తి సామ్రాజ్యం ఉత్దానపతనాలు వర్ణించాడు .ఇంగ్లీష్ లోకి రెండుసార్లు తర్జుమా అయింది.ఒకరకంగా అ దేశ సాహిత్యజనకుడు . Mofolo-Plomer Prize ను ఆయన గౌరవార్ధం ఏర్పాటు చేసి ఫిక్షన్ రచయితలకు అందజేస్తున్నారు ,
ఆధునిక రచయితలు-జెడి మంగోలా –దిప్రైజ్ పోయెమ్స్ ,అమాంగ్ దిప్రిడటార్స్ అండ్ ప్రే,బంటు స్టడీస్ రాశాడు .,మోపెలి పాలస్ –టుట్రావెల్ ఈజ్ టు లెర్న్,టర్న్ టు దిడార్క్ నవలలు రాశాడు .
- Masechele Caroline Ntseliseng Khaketla -రచయిత్రి ,ఎడ్యుకేటర్ రచనలు – Mantsopa le Molamu oa Kotjane
- Mosiuoa Masilo
- Mosali eo o ‘Neileng Eena
- Pelo ea Monna
- Ka u Lotha
- Mahlopha a Senya
- Ho Isa Lefung
- Molekane ea Tsoanang le Eena
- Khotsoaneng
- Selibelo sa Nkhono
- Maoelana a hlompho (2002)
షీలాకాలా –గొప్పకవయిత్రి .ఫార్ములా ,మై పెన్ ఈజ్ ఎసోషలైట్ కవితా సంపుటులు రాసింది . Mpho ‘M’atsepo Nthunya,’’సింగింగ్ అవే ది హంగర్ లో యూనివర్సల్ ఫిమేల్ ఎక్స్ పీరియెన్స్ ను వర్ణించింది
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-7-20-ఉయ్యూరు