7- రోజు కూలీ –పద్మభూషణ్ నజ్రుల్ ఇస్లాం కవిత
బజార్లలో నీ విలాసవంతమైన కార్లు పరుగు దీస్తున్నాయ్
నీపెద్ద నౌకలు సముద్రాలలో వాణిజ్య విహారం చేస్తున్నాయి
నీ వేగవంతమైన ఆవిరి ఇంజన్లు రైళ్లు నడుపుతున్నాయ్
దేశమంతా నీ యంత్రాలు ,మొక్కలతో నిండిపోయింది
ఇవన్నీ ఎవరి వలన నీకొచ్చాయో చెప్పగలవా ?
ఎవరి నెత్తుటితో నీ భవనాలకు ఎర్రరంగు పూయబడిందో
వాటిని కూలిస్తేనే నువ్వు చూడగలవ్
ప్రతి ఇటుకమీద స్పష్టంగా పేర్లు రాయబడి ఉన్నాయ్
నీకు బహుశా తెలియకపోవచ్చు కాని ప్రతిధూళి కణానికీ
నీ రోడ్ల ,నౌకల, రైళ్ళ ,విలాస హర్న్య వర్ణాల
అర్ధాల భాగవతమంతా తెలుసు
త్వరలోనే మంచి రోజులొస్తున్నాయ్
రోజు రోజుకీ నీ అప్పులపాపం పెరిగిపోతుంది
ఆభారీ రుణాలను నువ్వు తీర్చుకోక తప్పదు
బండ రాళ్ళను గొడ్డలి గునపం కొడవలి
కఠినశ్రమశక్తితో ముక్కలు చేసిన దినకూలీల శరీరాలు
నీ రోడ్డు మీదే నీ కోసం కార్చిన చెమటతో తడిసి
అటూ ఇటూ విసరివేయబడి ఉన్నాయ్ .
నీకు సేవ చేసిన దేహాలే అవి దినకూలీలవే
దుమ్ము ధూళి లో కప్పబడిన ఆ శరీరాలే
నిన్నూ నీ వాటినీ మోసుకు పోయేవి
వాళ్ళు నిజంగా మానవులే ,రుషి తుల్యులే
వారి అంతరాత్మ గీతాలను నా పాటలతో పాడుతా
వారి బాధామయ శోకమయ చాతీలపై కవాతు చేస్తూ
కొత్త విప్లవం కొత్త మెదడులోని ఉద్భవిస్తుంది
మేము కింద పడి కుళ్ళి పోతుంటే
హాయిగా మూడో అంతస్తుపై
సుఖ నిద్రపోతున్నావ్ కదూ !
అయినా నువ్వు ప్రభువా అని పించుకోవటం
దారుణం అసంబద్ధం అహేతుకం
ఈ ప్రపంచ అధికారం తనువూ మనసు
ప్రేమతో అంకితభావంతో ‘జన్మభూమీ కోసం
స్వేదం తో తడిసిముద్దయిన వారిదే
అలుపెరుగనినడకతో రోడ్లపై
అలసట లేని ప్రయాణం చేసిన వారి పాద ధూళి
నా శిరసుపై పవిత్రమైనదిగా ధరిస్తాను
మానవాళి బాధలు ఇక్కట్లు తొలగిపోతున్నాయ్
నూతన ప్రభాతాన కొత్త సూర్యుడుదయిస్తాడు
ఆ ధూళి దూసరితమైన రోడ్లను కడిగి ‘
త్రుప్పుపట్టిన నీ గుండె ఇరుకు తలుపులను బార్లాతీసి
స్వేచ్చావాయువులనాహ్వానించి ప్రవేశిస్తారు
ఆ ఉప్పొంగే ఉత్సాహంతో
ఉరకలు వేసే వారిని లోనికి స్వేచ్చగా రానివ్వు .
నేరుగా నీ గుండెల్లో దూరిపోతారు
అడ్డంగా ఉన్నవన్నీ కూల్చి ప్రవేశిస్తారు
మొత్తం నీలి స్వర్గం అంతా నీ కళ్ళముందే కూలి పోతుంది
సూర్య చంద్ర నక్షత్రాలు మాపై కురవనివ్వు
అన్నికాలాలప్రజలు , అన్ని రకాల శీతోష్ణ స్థితులు
గొప్ప సంగమం లా కలిసి వచ్చి
ఒకే జెండా కింద నిలబడి ఐక్య జాతీయ గీతాన్ని ఆలపిస్తారు
ఇక్కడ నువ్వు ఒక్కప్రాణికి హాని తలపెట్టినా
ఆబాధ దిగంతాలకు పతాక సన్నివేశంగా వ్యాపించి
ప్రతి హృదయంలో తీవ్ర ప్రకంపనలతో ప్రతిధ్వనిస్తుంది
ఒక వ్యక్తికీ జరిగే అవమానం
సకలమాన వాళినీచేసిన అవమానమే
మానవత్వానికి చేసిన ద్రోహమే అవుతుందని గుర్తుంచుకో
ఇవాళే ప్రపంచమానవాళి అనుభవించిన
హృదయవిదారక బాధ వేదన పై తిరుగు బాటు రోజు అని గుర్తుంచుకో
ఆధారం – పద్మ భూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం బెంగాలీ కవితకు అమీర్ హుస్సేన్ చౌదరి ఆంగ్లానువాదం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-7-20-ఉయ్యూరు
—
కోసూరు సుమంత్ బాబు
170 /2 (46 ) బిగ్ స్ట్ర్రేట్ ,తిరువల్లిక్కేణి ,
చెన్నై -600 005, తమిళనాడు
ఫోను 09445878668
“సుమకిరణసంయుక్తం”
యామినీ బిల్హణీయం
యువరాణి “యామినీ పూర్ణ తిలకం”
చంద్ర బింబం ఆమె “నిశిరాత్రి ప్రకాశం”
రాత్రి కాంతి,రజనీ కాంతి,వెన్నెలరేయి
వెయ్యేండ్లనాటి అమరప్రేమ నాయిక
పాంచాల రాజపుత్రి అందాల అతివ
మదనాభిరామ మందారమాలల పుత్రి
కుందనపుబొమ్మ చందనమేని ఛాయ
మగధ నుండి పలురాజుల కలల కన్య
యువరాణి పలువిద్యల కోరి నేర్పరి
గాన నృత్య కవిత్వ పాండిత్య పాటవం
సంస్కృతాంధ్ర ఛందస్సుపై మక్కువ
మగధరాజ విరచిత పద్య శేషపూరణం
పూరించినయువరాణీయే మగధరాణి!
పూర్ణతిలకయే పూరణకుసంపూర్ణదిట్ట
ఛందస్సునేర్చి ఏర్చి కూర్చి తీర్చచర్చ
ఇరుభాషా ప్రజ్ఞా శాలి గురు అన్వేషణ
‘కర్ణసుందరి’ కావ్య నాటకం ప్రదర్శనం
మదనాభిరాముని మెప్పుగొన్నబిల్హణ
ఆశ్రమ వాసి సహస్రావధాన ఆశుకవి
యువ కవీశ్వర బిల్హణుడు తనకే సాటి
కాశ్మీరదేశ కవిబిల్హణ తెలుగు బంధం?
శ్రీనగర ఖోణ్ముఖ్ గ్రామం జన్మస్థలం
విక్రమాదిత్యునిచే ‘విద్యాపతి’ బిరుదు
కవిపండితపోషక రాజామదనాభిరామ
తక్షణమే బిల్హణుని బిల్వనంపేతగురీతి
స్వయం మహామంత్రి ఆశ్రమ ఆగమం
వసంతసేనునికి మల్హణుని ఆహ్వానం
రాజాజ్ఞను రాజాహ్వానంగా సందేశం
అగ్రజునిఅనుమతి బిల్హణుడు సమ్మతి
మహామంత్రితో పాంచాల దేశపయనం
కవి బిల్హణునికి రాజసభ సుస్వాగతం
పంచకావ్య పఠనం 108విద్యల నేర్పరి
సారస్వత ముచ్చటల సభకె సంతసం
ఆస్థాన గురువు ధర్భాచారి కసహనం
గురువిణి సబబన్న తన సలహా వృధా
వృద్ధకాకాచారి దుర్బోధల పన్నాగాలు
రాజు మెచ్చిన కవి రవిరాజ విరాజిత
రాజపుత్రి యామిని దివ్యసురభామిని
ఇర్వురి సన్నిహిత విద్య పర్యవసానం
వయసు వర్చస్సు వలపు తలపులౌ!
మహారాజవారి మనో డోలాయమానం
గురుశిష్య ప్రత్యక్షపరిచయంవద్దు రద్దు
అశరీరవాణి అతీతం ‘ఆకాశవాణి’లేదు
దూరవాణి చరవాణిఇహలో ఊహేలేదు
మంత్రిఉపాయం లేని వ్యాధుల కల్పన
అపురూపవతికి ’నేహవ్యాధి’ ఆపాదన
వక్రరూపుల దర్శింపడు కవిబిల్హణుడు
‘దివ్యదృష్టి’ద్విజునికి ‘సవ్యదృష్టి లోపం’
ఆరడుగుల అందగాడు ‘అంధు డనిరి’
చూపులేనివార చూడనన్న యామినీ
ఇరువురినడుమ బరువైన బంగరుతెర
తెరవెనుక తెరముందు తెలిసిన వ్యక్ిి
మంజువాణి యామినీ ఆంతరంగికచెలి
అంతఃపుర ఆంతర్యం అంతరంగంలోనే
తెరచాటు నాటకం తెలిసినా తెలుపడు
బిల్హణచెలికాడు తరంగంఅంతరంగంలో
తెరవెనుక వాణీ వీనుల విందుగ విద్య
ఆంధ్రసంస్కృత భాషాబోధనఅమోఘం
ఆజానుబాహుడాశుకవి అగుపించడు
పారాయణ శ్రవణమే,వీక్షణఏక్షణమో!
అపురూపవతి కానరాదు గురువుకి
ఏకసంధాగ్రాహి ఏకలవ్యుని వలెవిద్య
గణవిభజన గురులఘువుల వివరణ
ఛందోబోధన నిరవధికంగా నిత్యసాధన
విద్యాజ్ఞానం అశేషంగా భాషాభ్యాసం
భాషా విశేషణాల సంభాషణలో నేర్పు
భావయుక్త గణబద్ధ కవిత్వ నాయిక
నవ యువరాణి యామినీపూర్ణ తిలక
మగధరాజ పద్య పూరణ సంపూర్ణం
మగధాధిపతిమెచ్చిన కవిత కవయిత్రి
బహుప్రజ్ఞాశాలి బిల్హణ కల్పనా రూపం
అదృశ్య అధ్యాపకుని స్వప్నదర్శనం
కలనిజమయ్యే తరుణం ఇలపైనెపుడో
చైత్ర పున్నమిరాతిరి నిండు చంద్రుడు
“యామినీ పూర్ణ తిలకం”సార్ధకనామం
గురువుసెలవున సెలయేర్లతీరవిహారం
చెలులతో చంద్ర చలువతో కలువ వలె
యువరాణి ఉల్లాసమందేవెన్నెలరేయి
అతిధిగృహ గవాక్షంలో గంధర్వ గానం
పూర్ణ చంద్రునిలో పూర్ణతిలకం గోచరం
సోముని సోయగాల కర్ణపేయమైవర్ణన
కళ్ళముందుంచే కవితకళ్ళతోనేసాధ్యం
పూర్ణ తిలక సంశయపూర్వ మనోస్థితి
కవిముందు కళ్ళముందు ప్రశ్నార్ధకం
యామినినిజమెరుగ తెర మరుగుదీసే
ఒకరినొకరు తొలి దర్శనం తొలి చూపు
నింగిపై నెలరాజు నేలపై తన కలరాజు
భావసౌందర్యమేగాదు నిజ సౌందర్యం
ఆజానుబాహుడ రవిందదళాయతాక్ష
ఆసుందరునికి దృష్టిలోపమనిరెందుకో
కట్టుకధకంచికి కాంతులీనేనయనాలు
ఆశ్రమవాసి బ్రాహ్మణ బిల్హణ కవీశ్వర
తానుతగనమ్మ యనుచువాపోవపోవ
తాను రోగినిగాదు రాగిణి యువరాణిని
తననొకపరిచూచి తదుపరితరలుమనె
యామినీపూర్ణకామిని లోచనాలోలం
యువరాణి సౌందర్యం మహా వశీకరం
అంతఃపుర రాజపుత్రి యామినీ దేవి
అమరప్రేమ అంకురం అల్లుకున్నలత
ఆ ప్రేమ జంట ఒకరికి ఒకరై సాగింది
గాంధర్వ వివాహం గాఢమైన బంధం
విడదీయలేని జంట విహరించిరంతట
విద్యామందిరాన కనరాని కవులజంట
కనుగొన్న మహామంత్రి అచ్చెరువందే
కధవిన్నమహారాజు కడుఆగ్రహమందే
కవి బిల్హణుని బంధింప రాజాజ్ఞ జారీ
మహారాజు మహామంత్రిని సంప్రదించే
కవి, ఆశ్రమవాసి మన్నింపదగుననే
న్యాయశాఖ ధర్భాచారితోసమాలోచన
ధర్భాచారి అదనుగ బిల్హణపైదెబ్బదీసే
ఆశ్రమవాసి రాజ్యకాంక్ష పొందినాడు
రాజద్రోహానికి మరణశిక్ష న్యాయపరచే
ఇరుహృదయ కలయికలోనేరమేమిటి
నిష్కల్మష మనసులు నిష్కపట ప్రేమ
ఇందు రాజద్రోహ మేది ఏది బూటకం
బిల్హణుడంధుడు, యామిని రోగియని
అబద్ధమాడి నాటకమే నమ్మకద్రోహం
నిరపరాధి న్యాయం నరపతి నిరాకరణ
అమరప్రేమజంట అన్యాయంపాలాయే
కవిబిల్హణ రవిదూరని కారాగృహమేగె
మరణానికి ముందు ఒక్కరాత్రి మిగిలే
రాత్రిఅంధకారం అంతిమరాత్రి అమరం
ఆశుకవి అవధాని కవనాని కడ్డులేదు
సూర్యోదయం తూర్పు పడమర ఏదో!
భార హృదయం భారీ కావ్యముదయం
‘ప్రేమ చోరుడు’పేర ఉద్గ్రంధ రచనారాత్రి
పరమ ప్రసిద్ధ కవిత ఆ చరమ గీతం
‘చోరపంచాశిక’ ‘చౌరపాంచశీకం’ నామ
యాభై చరణాలకావ్యం బిల్హణవిరచితం
మనసు విరిగి వెలువడిన భావోద్రేకం
కారాగృహాధిపతి వీరసేనుని లిపితో
పాఠకుల ద్రవింప ప్రేమ సందేశమది
యామిని చెరసాల ప్రవేశం ఆవేశం
బిల్హణుని ఓదార్పు ధర్మ బోధనవేళ
పారిపోవడం తప్పుకొనుట పిరికిదనం
పరమాత్మపైభారం జీవాత్మపై ప్రభావం
ఉదయాన్నేఉరిశిక్షకుపక్రమణ అకటా!
పురజన అంతఃపుర వాసుల సమక్షం
సర్వసమాయత్తం సమయమాసన్నం
ధర్భాచారి కాకాచారుల పగ పన్నాగం
వారినేరిగిన నర్తకి పారిజాతం సందేశం
అందినంత మహామంత్రి నిలుప ఆజ్ఞ
వీరసేనుడు చౌరపాంచశీకం విన్పించే
అమరప్రేమ గాధ విని విలపించే రాజు
యామిని అంతిమలేఖతో కలచిపోయే
మహామంత్రి శిక్ష నిలుపుదల ఆనవిని
మహదానందభరితుడాయే మహారాజు
బిల్హణుడు విడుదలాయే విశ్వామోదం
పూర్ణతిలకతో ఏకమాయేసర్వసమ్మతి
అన్యాయాధికారి ధర్భాచారి కాకాచార్లు
శిక్షార్హులైబందీలై చెరవాసులై నాశమైరి
యామినిబిల్హణీయం నేటికీరమణీయం
సహస్రాధిక సంవత్సరాలైనా సజీవమే
ఆ అమరప్రేమగాధ కడకు సుఖాంతం
‘ప్రేమ చోరుడన్న’ చౌర పాంచశీకం
ప్రసిద్ధికెక్కి పాశ్చాత్య భాషానువాదం
1848లో ఫ్రెంచ్ భాషలోనికనువాదం
1896లో ఎడ్వినఆర్నాల్డ్ అనువదించే
1919లో ‘బ్లాక్ మారిగోల్డ్’గ ప్రచురణ
ఆక్స్ ఫోర్డ్ పోవిస్ మాతేర్స్ ఆంగ్లంలో
సంస్కృతగ్రంధం పలుభాషల ప్రచురణ
అట్టిఅమరకావ్య రచయిత మనబిల్హణ
‘విక్రమార్కదేవచరిత్ర’ విరచించిన కవి
1088లో 40ఏళ్ల ప్రాయంలో మరణం
అయినా నేటికీ తన పుటలలో ప్రాణం!
********************