8-అడవి ప్రక్కన –పద్మభూషణ్ ఖాజీ నజ్రుల్ ఇస్లాం కవిత
అడవి పక్కన ఎవరు నడుస్తారు ?
అతడెవరో నాకు తెలుసు ననుకొంటా
లయాత్మకంగా రాత్రి నిశ్శబ్దాన్నిచీలుస్తూ
అర్ధరాత్రి వేళల్లో అతని చిరుగంటలమువ్వలు
లేపుతాయ్ అతని వంపు తిరిగిన ముంగురులు
నా హృదయ శిలపై జలపాతమై ధ్వనిస్తాయ్ .
ఆధారం –పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం బెంగాలీ కవిత ‘’బోనో పోథే కే జెయ్’’కు మహమ్మద్ నూరుల్ హుదా ఆంగ్లానువాదం .
9-ప్రభూ !ఆశీర్వదించు మమ్మల్ని –పద్మభూషణ్ ఖ్వాజీ నజ్రుల్ ఇస్లాం కవిత
మమ్మల్ని ఆశీర్వదించు ప్రభూ !మమ్మల్నందర్నీ దీవించు
ఇతరులను మేము, మమ్మల్ని ఇతరులను ప్రేమించేట్లు చేయ్
ద్వేషం ,అసూయ ,భౌతిక బాధ ,మానసిక వేదన
మామధ్య లేకుండా చూడు ప్రభూ
భువి మరొక దివి అవ్వాలి
జ్ఞానకాంతిని ,భీమబలాన్ని మాకు ప్రసాదించు దేవా !
నువ్వు అందించిన ఆ జ్ఞాన జ్యోతితో నిన్ను మేము అన్వేషిస్తాం
నువ్వు అందించిన బలమే మాకు,
మా కార్యక్రమాలకు శక్తి, తోడ్పాటు
మా సహచరుల నీతి ,ధర్మమే మాకు
శ్రీరామ రక్షఅయి మా భయాలు దుఖాలు అంతమౌతాయి
కానీ ప్రభూ !ఏ ప్రమాదం వల్లనైనా మేం
ఓడిపోతే మాత్రం మమ్మల్ని రక్షించే బాధ్యతా నీదే .
ఆధారం –పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం బెంగాలీ కవితకు ఆబు రషిద్ ఆంగ్లానువాదం
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-7-20-ఉయ్యూరు