ప్రపంచ దేశాల సారస్వతం
131-లైబేరియా దేశ సాహిత్యం
పశ్చిమ ఆఫ్రికాలో గునియా సరిహద్దున అట్లాంటిక్ తీరాన లైబేరియా దేశం ఉన్నది .రాజధాని మొన్రోవియ .కరేనీ –లైబెరియన్ డాలర్ .జనాభా -48లక్షలు .అధికశాతం క్రిస్టియన్లు .అధికారభాష ఇంగ్లీష్ .పాతికదాకా స్థానిక భాషలున్నాయి అందులో –కేపెల్లి బస్సా ,గ్రెబో, డాన్,క్రు ,మానో ,లోమా ,మండి౦గొ వగైరా .అక్షరాస్యత -48శాతం .ఉచిత ప్రభుత్వ ప్రాధమిక విద్య అమల్లో ఉన్నా ఉత్సాహం వసతులు తక్కువే .ప్రైవేట్ స్కూల్స్ లో తడిసి మోపెడు అవుతుంది .పుష్కలంగా నీరు ఖనిజాలు ఉన్నాయి వ్యవసాయఉత్పత్తులుఆదాయవనరులు. రబ్బరు పంట ఎక్కువ డైమండ్స్ ,బంగారం దొరుకుతాయి .నేషనల్ పార్క్ ,కేప్ పాల్మాస్ చూడతగినవి .సురక్షిత దేశం కాదు .
లైబేరియా సాహిత్యం –1800సంవత్సరం వరకు ఉన్న క్రానలాజికల్ రికార్డ్ ఆఫ్ పాస్టోరల్,ఫోక్ లిటరేచర్ దొరుకుతుంది
తరువాత కాలం స్త్రీరచయితలు – హేలేని కూపర్ –హౌస్ ఎట్ షుగర్ బీచ్ రాసిన జర్నలిస్ట్ .మూసు నోహ అడ్డాడ్-నెల్సన్ మండేలా అవార్డ్ హ్యూమన్ రైట్స్ అవార్డ్ బెస్ట్ జర్నలిజం కు ,పొంది౦ది .ఫాతిమా మసకోయ్ –దిఆటో బయాగ్రఫి ఆఫ్ ఆన్ ఆఫ్రికన్ ప్రిన్సెస్ ఎక్స్పీరిఎన్సేస్,ఎ ఫోక్ టేల్ ఫ్రం లైబేరియా రాసిన రాజవంశానికి చెందిన ఎఢ్యుకేటర్.మైకోలా సోంగా –నటి రచయిత్రి మాగజైన్ ఎడిటర్ .ఫిల్మోగ్రఫీలుగా –దేస్పెరేట్ గర్ల్స్ ,స్ప్లిట్ డెసిషన్ ,ది హార్ట్ ,బినీత్ దిథాట్స్,బ్లడ్ బ్రదర్స్ ,ఛీటర్స్ క్లబ్ .బెస్తేదితర్ అవార్డ్ గ్రహీత .
మగరచయితలు-ఎడ్వర్డ్ విల్మాట్ బ్లైడేన్ –కాలాఫ్ ప్రావిడెన్స్ ,క్రిస్టియానిటి,ఇస్లాం, నీగ్రో రేస్ ,ఆఫ్రికన్ లైఫ్ అండ్ కస్టమ్స్ ,వెస్ట్ ఆఫ్రికా బిఫోర్ యూరప్ రాశాడు .రోనాల్డ్ డెంపే స్టర్-ఎ సాంగ్ ఆఫ్ అవర్ మిడ్నైట్,సావెనీర్ ఆఫ్ టబ్మన్-టోల్బెర్ట్ ఇనాగరేషన్ రాశాడు .హెన్రి బోఇమా ఫన్బుల్లెహ్-వాయిసెస్ ఆఫ్ ప్రొటెస్ట్ ,లైబేరియా ఆన్ ది ఎడ్జి రాశాడు .ఎబెంజేర్ నార్మన్ –న్యు డైమెన్షన్ ఆఫ్ హాప్ స్థాపకుడు యాక్టి విస్ట్ ,-గ్లోబల్ గుడ్విల్ అంబాసడర్ అవార్డ్ గ్రహీత .క్లారెంస్ మొనిబ –దిఅఫీషియల్ గైడ్ బుక్ ఫర్ ఫుట్ బాల్రాసిన ఫుట్ బాల్ ప్లేయర్ ప్రభుత్వున్నతోద్యోగి .విల్టన్ సాన్కావులో –వై నో బడి నోస్ వెన్ హివిల్ డై,దిమేరేజ్ ఆఫ్ విస్డంమొదలైన కథలురాశాడు .గాబ్రియల్ విలియమ్స్ –లైబేరియా -దిహార్ట్ ఆఫ్ డార్క్ నెస్,అకౌంట్స్ ఆఫ్ లైబేరియా సివిల్ వార్స్ రాశాడు
132-లిబ్యా దేశ సాహిత్యం
లిబ్యా లేక దిస్టేట్ ఆఫ్ లిబ్యా ఉత్తరాఫ్రికాలో మఘ్రేబ్ ప్రాంతం లో ఉన్న దేశం .ఆగ్నేయాన నైగర్ ఉంటుంది .రాజధాని-ట్రిపోలి .కరెన్సీ-లైబేయన్ దీనార్ .జనాభా -67లక్షలు .సున్ని ముస్లిం లుఎక్కువ .అధికారభాష అరెబిక్ .అక్షరాస్యత శాతం ఎక్కువే .ఉచిత కంపల్సరి ప్రాధమిక విద్య ,సెకండరి మూడేళ్ళు . ట్రిపోలి మ్యూజియం కాజిల్ ,శిథిలాలు ,లేప్టిస్మంగా శిధిలాలు గడామిస్ ఎడారి పురాతన త్రవ్వకాలు చూడాల్సినవి .సురక్షితం కాదు .అత్యధిక ఆయిల్ నిల్వలున్న దేశాలలో ఒకటి. ఇదే ఆదాయవనరు .
లిబ్యా సాహిత్యం –1969లో మహమ్మద్ గడ్డాఫీ అధికారం లోకి రాకముందు సాహిత్యవాసనే లేదు ఈయనవచ్చి యూనియన్ ఆఫ్ లిబియన్ రైటర్స్ ఏర్పాటు చేసి ప్రోత్సహించాడు.
కర్మాని కాలం లో Muhammad ibn Khalil ibn Ghalbun (d. 1737ఆన్ హు హోల్డ్స్ పవర్ ట్రి పోలి’’రాశాడు Sulaiman al-Barouni al-Azhar al-riyadiya fi aimma wa-muluk al-Ibadiya, రాశాడు .
గడాఫీ కాలం లో అహ్మద్ ఫాగి –ఐ విల్ గివ్ యు అనదర్ సిటి నవలరాశాడు .ప్రముఖ రచయిత ఇబ్రహీం అల్ కోని వార్సా మాస్కోలలో జర్నలిస్ట్ గా పని చేసి నాస్టాల్జియా గా ‘’టురేగ్’’కల్చర్ నవల రాశాడు .దీనికి ఆరబ్ నావల్ అవార్డ్ వస్తే దానివల్లవచ్చిన డబ్బును టురేగ్ జాతి పిల్లల సదుపాయాలకు అందించాడు బ్లీడింగ్ ఆఫ్ ది స్టోన్ నవల లిబియన్ స్టేట్ అవార్డ్ పొందింది .దియానిమల్స్ లిబ్యా అండ్ మొరాకో ,పప్పెట్ నవలలు ఇంగ్లీష్ లోకి అనువాదం పొంది ప్రైజులు పొందాయి .సెర్చింగ్ ఫర్ ఎ lost ప్లేస్ కూడారాశాడు .
ఖలేఫా హుస్సేన్ ముస్తఫా ‘’దిఐ ఆఫ్ ది సన్,’’రాశాడు గద్దాఫీ కాలం లో సంస్కృతి స్వేచ్చపై ఆంక్షలు ఉండేవి మిలిటరివాళ్ళు ప్రతి బుక్ షాప్ లోకీ,లైబ్రరీకి వెళ్లి ,వేలాది పుస్తకాలు తగలబెట్టినట్లు బుకర్ ప్రైజ్ గ్రహీత ఇస్మాం మతార్ రాశాడు .ఈయన రెండు నవలలు –ఇన్ దికంట్రీ ఆఫ్ మెన్ అండ్ అనాటమీఆఫ్ ఎ డిసప్పియరెన్స్.ఇవి మాన్ బుకర్ ప్రైజ్ ,కామన్ వెల్త్ ఫస్ట్బుక్ అవార్డ్ ,రాయల్ సొసైటీ అవార్డ్ ,ఆరబ్ అమెరికన్ నేషనల్ మ్యూజియం బుక్ అవార్డ్ పొందాయి .వీటిలో అధికార రియాక్షనరీల ఆగడాలు కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు.
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-7-20-ఉయ్యూరు