ప్రపంచ దేశాల సారస్వతం
133-మడగాస్కర్ దేశ సాహిత్యం
ఆఫ్రికా తూర్పు తీరానికి400కిలో మీటర్ల దూరం లో ఇండియన్ ఓషన్ లో మడగాస్కర్ ఐలాండ్ దేశం ఉంది .592 ,800చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం తో ప్రపంచంలో రెండవ పెద్ద ఐలాండ్ దేశం .రాజధాని –అంటా నవారివో .కరెన్సీ –మలగాసి అరియారి జనాభా -2.63కోట్లు .41శాతం మలగాసి క్రిస్టియన్లు.ఈ దేశ ప్రజలు ఆండ్రియా మనిట్రా అనే ఉత్కృష్ట వ్యక్తిని పూజిస్తారు .వారి పూర్వీకులు బ్రతిన చనిపోయిన వారి ద్వారాకనిపిస్తారని నమ్మకం .అధికారభాషలు –మలగాసి ,ఫ్రెంచ్ .అక్షరాస్యత -74.8 .ఆరేళ్ళ ప్రైమరీ ఏడేళ్ళ సెకండరి ,మూడేళ్ళ సీనియర్ సెకండరి విద్య .వ్యవసాయం,యాంత్రికత టూరిజం ముఖ్య ఆదాయవనరులు .వరి,కస్సావా తోపాటు కాఫీ వనిల్లా పండిస్తారు .బబోవా అవేన్యు, టింజిడీ బెమరాహా నేచర్ రిజర్వ్ ,ఐసాలో నేషనల్ పార్క్ దర్శనీయాలు ,నిర్భయంగా టూర్ చేయవచ్చు .
మడగాస్కర్ సాహిత్యం –ను మలగాసే సాహిత్యం అంటారు .కాలనీ ప్రభుత్వాల అన౦తరమేసాహిత్యం వచ్చింది .1906-1938కాలం రచయితలను ఎల్డర్స్ అంటారు .వీరు పూర్వం మెరినా మొనార్కి కాలం లోపుట్టినవారు . తర్వాత ఫ్రెంచ్ అడ్మినిస్ట్రేషన్ లోని వారిని జూనియర్స్ అంటారు .మొదటి మోడరన్ ఆఫ్రికా మెరీనా కవి జీన్ జోసెఫ్ రబీ రివెలో-1901-37సర్రియలిస్ట్ రొమాంటిక్ మోడర్నిస్ట్ కవి .చారిత్రాత్మక నవలలూ ,వెస్టర్న్ ఒపేరా స్టైల్ నాటికలూ రాశాడు .ఎలీ రాజోనారిసన్ న్యు వేవ్ కవిత్వం రాశాడు .జాక్విస్ రాబె మనంజారా ,పియర్రీ రాండ్రినారిసోవా ,క్లారిస్సీ రాట్సి ఫండ్రి,డీ వెడ్రిసాల్మన్ మొదలైనకవులూ ఉన్నారు .లీడింగ్ పోఎట్స్ గా జీన్ లూక్రహమరిమానా ,మైకేలీ రాక్స్తంసన్,ఏమిల్సన్ డేనియల్ వగైరా .అల్సల్మేరజఫిండ్రానిబే కామిక్ పుస్తకాలు చాలారాశాడు .మలగాస్సీ భాషా సాహిత్యాలను ఎందరో రచయితలూ రచనలద్వారా పోషిస్తున్నారు వారిలో –ఎల్లె చార్లెస్ అబ్రహం డేవిడ్ జావో మనోరో ,చార్లేట్ అరిసోవా రేఫెనో మంజటోలు .
ముఖ్యమైన పుస్తకాలు –బియాండ్ దిరైస్ ఫీల్డ్స్ –నైవో ,ఓవర్ దిలిప్ ఆఫ్ దివరల్డ్ –కోలిన్ మెక్ ఎల్రాయ్ ,దిఎఇత్ కా౦టినేంట్-పీటర్ టైసన్,హాట్ఐస్-నోబా రాబర్ట్స్ .
134-మలావి దేశ సాహిత్యం –
ఆగ్నేయ ఆఫ్రికాలో గ్రేట్ రివర్ వాలీ తో వేరు చేయబడిన ఎత్తైన దేశం మలావి .సరస్సులు పార్కులు బాగా ఆకర్షణ .రాజధాని –లిలోంగ్వే.కరెన్సీ-మలవియన్ క్వాచా .జనాభా -1.81కోట్లు. అధికారభాష వాడుకభాష ఇంగ్లిష్ .మూడువంతులు క్రిస్టియన్లు.అక్షరాస్యత 61.4శాతం .6వ ఏట స్కూల్ లో చేర్చుకొని ,మొదటి నాలుగేళ్ళు స్థానిక భాష లో బోధిస్తారు .తర్వాత ఇంగ్లీష్ మీడియం .అత్యంత వెనుకబడిన దేశాలలో ఒకటి .వ్యవసాయమే ముఖ్య ఆదాయం .దాదాపు ముప్పాతికశాత౦ ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువున ఉన్నారు .సీజనల్ వ్యాధులు ఎక్కువ .లేక్మలావి ,నేషనల్ పార్క్ చూడచ్చు .సేఫ్ కంట్రీ.
మలావి సాహిత్యం –ఏడుగురు రచయితలు సాహిత్యాన్ని రచనలతో పోషింఛి తీర్చి దిద్దారు . .ఉపెలి చిసాలా –సృజనాత్మక రచయిత్రి.బెస్ట్ స్టోరీ రైటర్ గా గ్లోబల్ ఫేం పొందింది .కవితాసంపుటులు తెచ్చింది మలేవియన్ సంస్కృతీ ఆఫ్రికన్ చరిత్ర నిలబెట్టటమే ధ్యేయంగా రాస్తుంది .జోలి మాక్స్ వెల్ నటాబా-1964దేశం స్వతంత్రం పొందాక విజ్రుమ్భించి రాస్తున్నవారిలో ఒకరు .గొప్ప కథకుడు .అవెంజేర్స్ ఫ్యూరి ,మివానా వ మిన్జోకా ,మిటిమా సుకోటా వగైరా .డిడి.ఫిరి-వార్తాపత్రికలలో ఎన్నో రాశాడు .హిస్టరీ ఆఫ్ మలావి ,దినివే ఇన్ డ్రీం లాండ్ ,లెట్ అజ్ ఫైట్ ఫర్ ఆఫ్రికా ,యాన్ అప్ర్రైజింగ్ బై జాన్ చిలెంబ్వే .జాక్ మపంజే –కవి .’’ఆఫ్ చామిలియన్స్ అండ్ గాడ్ ‘’రాసినందుకు 1987లో జైలు పాలయ్యాడు .ది చాటరింగ్ వాగటైల్స్ఆఫ్ మిఖియు పిసన్ 1993లో రాశాడు .దీనికి రాటర్ డాంపోయెట్రి ఇంటర్నేషనల్ అవార్డ్ వచ్చింది .గాదరింగ్ సీవీడ్-ఆఫ్రికన్ ప్రిజన్ రైటింగ్ మరో కవితాసంపుటి .కెన్ లిపెంగా –ఫైనెస్ట్ లిటరరి ఫిగర్ గా గుర్తింపు .న్యూస్ పేపర్ ఎడిటర్ .వైటింగ్ ఫర్ ఏ టర్న్ సేకండరీ సిలబస్ లో చేర్చారు.ఆఫ్ బీం టోస్ ప్రతిభావంతమైన రచన .స్టీవ్ బెర్నార్డ్ మైల్స్ చిమేమ్బో –నోమా అవార్డ్ గ్రహీత .దిబాస్కెట్ గర్ల్, రాత్ ఆఫ్ నేపాల్లో నవలలు ,ది రైన్ మేకర్ ,వచియోననడాని నాటకాలు,నపోలో ,దిపైథాన్ కవితాసంపుటులు ,దిహైనా వేర్స్ డార్క్ నెస్ కథా సంపుటి రాశాడు .స్టాన్లీ ఒంజెజానీకెనాని-అంతర్జాతీయ ఖ్యాతిపొందిన రచయిత.లవ్ ఆన్ ట్రయల్ ,ఫర్ ఆనర్ అండ్ ఆదర్ స్టోరీస్ కథాసంపుటలు తెచ్చాడు .రెండు సార్లు కిని ప్రైజ్ పొందాడు
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-7-20-ఉయ్యూరు