ప్రపంచ దేశాల సారస్వతం
135-మాలి దేశ సాహిత్యం
పశ్చిమ ఆఫ్రికాలో దిరిపబ్లిక్ ఆఫ్ మాలి ఆఫ్రికాలో ఎనిమిదవ పెద్ద దేశం .రాజధాని –బమాకో .కరెన్సీ-వెస్ట్ ఆఫ్రికన్ ఫ్రాంక్ .జనాభా –దాదాపు రెండుకోట్లు .ముస్లిం దేశం .అధికార భాష ఫ్రెంచ్ .అందరూ మాట్లాడేది బంబారా భాష .అక్షరాస్యత 34శాతం మాత్రమె .9ఏళ్ళు ఫ్రీ కంపల్సరి విద్య ఆరేళ్ళ ప్రైమరీ ఆరేళ్ళ సెకండరి .గ్రామీణ వ్యవసాయం ఆదాయ వనరు .పూరెస్ట్ కంట్రీ..డిజిని ఆర్కి టేక్చార్,మోప్టి రివర్ దర్శనీయాలు .భద్రత ఉండదు .
మాలి సాహిత్యం –చాలాభాగం మౌఖికమే .హమదౌ అమ్పాటేబా ఈ దేశ ప్రముఖ చరిత్రకారుడు 1996లో యామ్బో ఔలోగం రాసిన ‘లే డేవాయిర్ డీ వయోలెన్స్’’నవల ప్రిక్స్ రెనడాట్ ప్రైజ్ పొందింది .ది ఎపిక్ ఆఫ్ సొండియాటా ,కౌటా ట్రయాలజి రాశాడు మస్సా మకాన్ డయాబెటే .ఒసమేన్ సేమ్బెని ‘రచన –గాడ్స్ బిట్ ఆఫ్ ఉడ్స్ ఇన్ బమాకో .
ఇతర రచయితలలో –అహ్మద్ బాబా అల్మస్సూఫీ ,ఇబ్రహాం ఆయా అమడౌ హంపాటేబా ,సిదికి డెంబెలి,అలీ డీలో వగైరా Yambo Ouologuem కు రేనడార్ ప్రైజ్ 1969లో వచ్చింది Ibrahima Ly, Modibo Keita, Moussa Konaté and Doumbi-Fakoly .రచయితలే.ఔవా కీటా ఆటోబయాగ్రఫీ రాసుకొన్నది .ఐచా ఫోఫేనా ‘’మారేజ్ ఆన్ కోఫి ‘’అనే ఇంటర్నేషనల్ నవలరాసింది .మాడీడయాలో Kouthy, mémoire de sang రాసింది Fanta-Taga Temble ‘’డెస్టిని’’నవల , Aminata Traoré అనే మాజీ మంత్రిణి వ్యాసాలూ , Fatoumata Fathy Sidibé 2006లో ఒక నవల,ప్రెసిడెంట్ భార్య Adame Ba Konaré ‘’Ces mots que je partage: Discours d’une Première Dame d’Afrique’’గ్రంథం రాశారు
136-మౌరిటేనియాదేశ సాహిత్యం
ఇస్మామిక్ రిపబ్లిక్ ఆఫ్ మౌరి టేనియా దేశం వాయవ్యాఫ్రికాలో ఉంది .ఆఫ్రికాలో 11వ పెద్ద సావరిన్ దేశం.రాజధాని –నౌకాచోట్.జనాభా 44లక్షలు కరెన్సీ –మారిటోనియన్ ఆగుయా .హస్సానియా అరబిక్ , బెర్బెర్ ,పులార్ ,సోనేన్కే ,ఒలోఫ్ భాషాజనం ఉన్నారు .అరబిక్ అధికారభాష .సున్ని ముస్లిం దేశం .అక్షరాస్యత 55శాతం .4-6ఏళ్ళ వయసుపిల్లలు ఖోరానిక్ స్కూల్స్ లో చదివి ఆతర్వాత కంపల్సరి విద్య నేరుస్తారు .వ్యవసాయమే ఆదాయ వనరు .వరి మొక్కజొన్న మిల్లెట్ సోర్ఘం పంటలు పండిస్తారు .నౌకాచోట్ ,చిన్గుట్టి ,అటార్ ఎడారి దర్శనీయాలు .టెర్రరిస్ట్ యక్టివిటి ఎక్కువ.
మౌరిటోనియాదేశ సాహిత్యం -300ఏళ్ళ సాహిత్యచరిత్ర ఉన్నది .1800మంది రచయితలూ 10వేలకు పైనే పుస్తకాలురాశారు .డెజర్ట్అండ్ ది డ్రం నవల Mbarek Ould Beyrouk’s Amadou రాసింది ఆంగ్లం లోకి అనువాదం పొంది ప్రైజ్ గెల్చింది
- అహ్మద్ బాబా రాసిన మున్యత్ ఉల్ మురిద్పుస్తకం లో మహమ్మద్ భార్యల విషయం ఉంది Ahmad ibn al-Amin al-Shinqiti Al-Wasit fi tarájim udaba al-Shinqit, రాశాడు Tène Youssouf Gueye రాసినవి –
- Les exilés du Goumel, play, 1968 A l’orée du Sahel, stories, 1975 Sahéliennes, poems, 1975 Rella, 1985
- Aïchetou Mint Ahmedou రచయిత్రి ,కవయిత్రికూడా La couleur de vent, నవలరాసింది Mubarkah Bent al-Barra –సాంగ్స్ ఫర్ ఏ కంట్రిఫర్ ఆలి,కవితా సంపుటి ,మోడరన్ మౌరిటోనియన్ పోయెట్రి ,మై గ్రాండ్ మదర్స్ టేల్స్అనే పిల్లలపుస్తకం రాసింది .మౌసా డయాగననాటకరంగ ప్రముఖుడు – La Légende du Wagadu, vue par Sïa Yatabéré, 1988 (theatre) Targuiya, 2001 రాశాడు . Tène Youssouf Gueyeకవి చరిత్రకారుడు . Les exilés du Goumel, play, 1968, A l’orée du Sahel, stories, 1975 Sahéliennes, poems, 1975 Rella, 1985 రాశాడు . Ahmad ibn al-Amin al-Shinqiti “The Transmission of Islamic Knowledge in Moorish Society from the Rise of the Almoravids to the 19th Century”, రాశాడు
- సశేషం
- మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-7-20-ఉయ్యూరు