దక్షణ ఆఫ్రికాలో పొడవైన హిందూమహాసముద్ర తీరం బీచ్ లు ఉన్న దేశం మొజాంబిక్ .క్విరంబాగాస్ ఆర్చి పేలగ.రాజధాని –మపుటో.కరెన్సీ –మొజాంబిక్ మెటికల్ .జనాభా -3కోట్లు .సగం మంది క్రైస్తవులు మిగిలినవారిలో సున్ని ముస్లిం లు వగైరా ఉంటారు .’అధికార ,వాడుక భాష –పోర్చుగీస్ .47శాతం అక్షరాస్యత .ఉచిత కంపల్సరి ప్రైమరీ విద్య .అప్పర్ ప్రైమరీ సెకండరి స్థాయి విద్య .వ్యవసాయం రొయ్యలు కాటన్,జీడిపప్పు, షుగర్, సిట్రస్ చోప్రా ,కోకోనట్స్ ఆదాయవనరులు ,బజురూటోఆర్చ్ పెలాగో ,క్విరిమ్బాస్ ఐలాండ్స్ ,ఐలాండ్ ఆఫ్ మొజాంబిక్ చూడతగినవి .అతిబీద దేశం .వీధి రౌడీలు ఎక్కువ .జాగ్రత్తగా ఉండాలి .
మొజాంబిక్ సాహిత్యం –ఆధునిక రచయితలు-పాలీనా సిజానే –నవలలు కథలు రాశాడు .మియాకౌటో-షార్ట్ స్టోరి రైటర్ ,జోస్ క్రావేరింహా –కవి ,లుయి బెర్నార్దో హన్వానా –కథారచయిత ,ఉర్గులాని బాకా ఖోసా –నవలాకారుడు ,లినామగాల – నావలిస్ట్ ,లూయీ బెర్నార్డోమలగా౦టన-కవి స్వీయచరిత్రకర్త ,ఓర్లాండో మార్కస్ డీ అల్మీడియామెండిస్-నావలిస్ట్ .మబాటే పెడ్రో-కవితా సంపుటాలు రాసి బిసియి ప్రైజ్ పొందాడు .హేల్డేర్ఫైఫ్-కవి ,సండ్రా టేమేలి-అనువాదకుడు, రోజేరో మంజాటే-నటుడు డైరెక్టర్ ,మియా కోటో-జర్నలిస్ట్ ,ప్రఖ్యాత కవి .
140-నమీబియా దేశ సాహిత్యం
ఆగ్నేయ ఆఫ్రికాలో నమీబ్ ఎడారి ఉన్న దేశం నమీబియా .చిరుతపులులు ఎక్కువ .రాజధాని –విండ్ హోక్.కరెన్సీ –సౌత్ ఆఫ్రికన్ రాండ్ ,నమీబియన్ డాలర్ .జనాభా -24.5లక్షలు .క్రిస్టియన్ దేశం .అధికార వాడుకభాష –ఇంగ్లీష్ .91.53శాతం అక్షరాస్యత .ఫ్రీ ప్రైమరీ విద్య .ఆతర్వాత గ్రేడులవారీ విద్య .వ్యవసాయం యంత్రాలు ,ఎగుమతులు డైమండ్స్,చేపలు ఆదాయ వనరులు .పెరల్ మిల్లెట్ ,సోర్ఘం ,మైజ్ ,వీట్, బీన్స్, ఆల్ఫాల్ఫా పంటలు .ఎతోషా నేషనల్ పార్క్ ,,
నమీబియా సాహిత్యం –ఇంగ్లీష్ లోనే ఉంటుంది .హీరోస్ ఆక్రే మెమోరియల్ సోస్సాల్వే సాల్ట్ ప్లాట్స్ ,స్వాకో మాండ్ బీచ్ చూడతగ్గవి .సేఫ్టి దేశం .
- 20,21వ శతాబ్దం రచయితలు-నేషాని అన్డ్రియాస్-దిపర్పుల్ వయొలెట్ వోషాంటూ అనే అనుభవాలు రాసింది .జోసెఫ్ డీ షో-బారన్ ఆఫ్ ది సన్నవల రాశాడు .డోరియన్ ఆర్చాఫ్ –కవి రచయిత,గ్వెన్ లిస్టర్ –అంతర్జాతీయ అవార్డ్ పొందిన జర్నలిస్ట్ ,హన్స్ డేనియల్ నముహూజా –ఒషిన్ డాన్‌గా,తోపాటు పదికి పైగా పుస్తకాలు రాసిన కవి .వీటిని స్కూల్స్ లో పాఠ్య గ్రంథాలు చేశారు .బ్రియాన్ ఓ లినిన్ –ది నమీబియన్ ,ది సేక్రేడ్ ట్రస్ట్ ఆఫ్ సివిలిజేషన్ రాశాడు .సిల్వియా శ్లేట్విన్-బుల్లీస్ ,బీస్ట్స్ అండ్ బ్యూటీస్ ,కదా సంపుతులు రాసింది ఫ్రేమింగ్ ది నేషన్ కధకు మంచి గుర్తింపు వచ్చింది .హేలావో షిట్యూఎటే-‘’నేవర్ ఫాలో ది ఉల్ఫ్ ‘’ఆటోబయాగ్రఫీ ‘’రాశాసిన మిలటరికమాండర్ .హాన్స్ స్మిత్ –వేర్ ఆదర్స్ వేవర్డ్,దిఆటో బయాగ్రఫి ఆఫ్ సం నుజోమా ,రాశాడు.అనోచికా వాన్మెక్-గోల్డెన్ పోయేట్ అవార్డీ. Annerkant die Longdrop, 1998 Vaselinetjie, 2004 Essie Honiball – Die Ontwaking, 2010 రాసింది .
- సశేషం
- మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-7-20-ఉయ్యూరు