10- భీరువు –పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం కవిత
నువ్వెందుకు వెనక్కి తిరిగిచూడటం లేదో నాకు తెల్సు
దేవాలయంలో దైవ సాన్నిధ్యం కోసం
ఆట బొమ్మలకు దూరంగా ఉండటానికే
నీ ఇల్లు వదిలేశావ్.
హృదయంతో ఆటలాడుతున్నావని తెలీకనే
నీ దనే దాన్ని దూరంగా వదిలేయటానికే
అది అనంత కన్నీటికి దారి అని తెలీక
నీ ఇల్లు వదిలేశావ్ మిత్రమా .
నీ కళ్ళు కలిశాక ,ఆ క్షణాలజాడ తెలిశాక
అప్పు యెంత భారమో తెలిసింది
ఎందుకు నువ్వు వెనక్కి తిరిగి
చూడటం లేదో నాకు తెలుసు .
నాకు తెలుసు నువ్వెందుకు వెనుదిరిగి చూడటం లేదో
కళ్ళు కళ్ళల్లోకరిగిపోతే
ప్రపంచం నెమ్మదిగా మరణిస్తుంది.
నీ పవిత్ర గర్భగుడిలో ఒంటరిగా ఉంటే
నీ తేజోమయ కనులలో
శుబ్రపరచే ద్రవం ఉంటే
కన్నీళ్లు రావు
నీ కాలి అందెలలలో
ఏ వంచనా మోసం మోగదు.
,
నిర్జనప్రాంతంలో నడకలో లతలు నీపాదలపై పాకకపోయినా
నువ్వు నడుస్తూ వెనక్కి ఎందుకు తిరిగి చూడవో నాకు తెల్సు
వేళ్ళకు దెబ్బతగలకుండా
నీగుండె కూడా పూలహారాలతో
సిగ్గుపడుతుండానే సత్యం తెలీకపోయినా
పూలు కోశావ్ మనసు వశం లో లేకుండానే .
దుర్భాషలాడే నోటి వెనక
ఒంటరితనం పొంచిఉంది
నాకు తెల్సు నువ్వు ఎందుకు వెనక్కి తిరిగి చూడటం లేదో .
నీ కపట నేర్పు తెలిసిన చేతన నాది
కానీ నిజానికి నీ బుగ్గలపై దానిమ్మ
గి౦జల రంగులున్నాయని నీకు ఏమాత్రం తెలీదు .
ఆడవారి పిరికి గుండెల్లో
చెప్పరానిమాటలు తిరస్కారాల వణికే వేదన తో
తేనెటీగ వాలిన లత ఉందని ఎన్నటికీ తెలీదు .
కనులు కన్నీరు కార్చినంత సేపూ
మర్యాద వ్యాపించదు
నీ నీడనే చూసి తెలియకుండానే భయపడే
పిరికి అని నాకు తెలుసు నువ్వు .
మనిషి గురించి నీకు తెలుసు వాడొక శిల
వాడి ముందు నువ్వెప్పుడూ వంగలేదు
దురాశ చేతులను కోరుకున్నావ్
హృదయం మరొక చేతి స్పర్శతో
గీటు రాయి ఔతుందని తెలీక
అందుకే వంగి పాదాలకు దణ్ణం పెట్టావ్
ఓ భీరువూ! నువ్వు ఎందుకు ఊరికే సంచరిస్తావో నాకు తెల్సు.
గుండెలోని కోరికలు శరీరం రెండు తీరాలమధ్యా
గుసగుస లాడుతాయి కనుక
నీ భయ మేమిటో నాకు తెలుసు .
వికసించే హృదయ పరిమళాన్ని
దాని రేకులు అడ్డగించలేవు
నువ్వు యెంత దాచుకోవాలని ప్రయత్నించినా
చాలాదూరం వ్యాపిస్తుంది .
నీహృదయం లో పోగుపడిన రహస్యపలుకులు
నాకు తెలుసు నీ భయమేమిటో.
ఎందుకు నువ్వు బయటికి చెప్పలేకున్నావో నాకు తెలుసు
కోయిల రహస్యసందేశం మోసుకొచ్చింది
నువ్వు వినాలనుకొన్నమాటలు
దానికెలా తెలిశాయి మిత్రమా ?
నెమ్మదిగా కనులు పైకెత్తి
వధువు గొణిగిన మాటలే అవి .
క్రూరమైన ఆమె చేతి వేళ్ళలో అలాంటి మాయాజాలం ఉంది
నువ్వెందుకు బయటికి చెప్పటం లేదో నాకు తెలుసు
ఎందుకు నువ్వు ఆభరణాలు ధరించటం లేదో
నీ వేదనజ్వాల నీమాంసాన్ని స్వర్ణ౦ గా మార్చిందని నాకు తెలుసు
మట్టిబొమ్మకు వస్త్రాలంకారం చేయటమా ?
ఎందుకు బంగారం ?
కేవలం బంగారుకోరిక ?
శరీర తీరాలు వదిలేస్తే మనసు స్వచ్చమౌతుంది
ప్రియతమా నా వేదన
నీ సౌందర్యాన్ని అలంకరిస్తుంది
అందుకే ఏ ఆభరణాలు నువ్వు వేసుకోవని నాకు తెలుసు .
వాళ్ళు కట్టుబడి ఉంటారని నేననుకోను
రాత్రి నిద్రించిన కన్య ,వధువుగా మేల్కొన్నది.
ముత్యాల గృహం అని నిజంగానే తెలియక
నురుగులో ఆమె ఈదింది.
ఆ ముత్యం నీకు దక్కింది .
కానీ కనురెప్పల చిప్పలు
కన్నీరు లో మునిగిపోయాయ్
భారం భరించలేనప్పుడు
గుండె కూడా తీవ్ర నిరాశతో
మునుగుతుంది
ఓఅదృష్ట హీన మహిళా !
ఎప్పుడు దాన్ని స్పష్టం చేస్తావమ్మా !
ఆధారం –పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం బెంగాలీ కవిత ‘’భీరు ‘’కు సయ్యద్ ముజిబుల్ హక్ ఆంగ్లానువాదం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-7-20-ఉయ్యూరు