- ప్రపంచ సారస్వతం
- 147-సోమాలియా దేశ సాహిత్యం
హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఎక్కువ తీర ప్రాంతమున్న సోమాలియా దేశం ఉంది.రాజధాని -మొగడిషు .కరెన్సీ-అమెరికా డాలర్, సొమాలి షిల్లింగ్ .జనాభా -1.5కోట్లు .అధికారభాష సొమాలి .సున్ని ముస్లిం దేశం .అక్షరాస్యత 37.8శాతం .సరైన విద్యావిధానం లేదు .పశు సంపద, చేపలు ,చార్ కోల్ ,బనానా షుగర్, సోర్ఘం ,కార్న్ ఆదాయవనరులు .లాస్ గీల్ ,కేధలిక్ చర్చ్ దర్శనీయాలు .యాత్ర వద్దు అనే అందరి ఉద్ఘాటన .టెర్రరిజం అస్థిరత కిడ్నాపింగ్ ,హత్యలు నిత్యకృత్యాలు .
సోమాలియా సాహిత్యం –శతాబ్దాలనుంచి షేకులు రాసిన కవిత్వం వచనరచనలున్నాయి .కవిత్వానికి పెద్ద పీట.మార్గరెట్ లారెన్స్ జాతీయకవి .ఐదాగల్లా జాతి వారు గొప్పకవిత్వం రాశారు .వందమందిలో90మందికవులే .ముహమ్మద్ అబ్దుల్లా హసన్ మాస్టర్ పోయేట్. ప్రకృతిపై అద్భుత కవిత్వం రాశాడు
God’s Blessing are more numerous than those growing trees.
I will remind you of the victory he gave us
Listen to me my council, for you are most dear to me
ఎల్మి బూధారి –కరామి పాషన్స్ కవిత –
Her fine-shaped bones begin her excellence;
Magnificent of bearing, tall is she; A proud grace is her body’s greatest splendor; Yet she is gentle, womanly, soft of skin. Her gums’ dark gloss is like unto blackest ink; And a careless flickering of her slanted eyes Begets a light clear as the white spring moon. My heart leaps when I see her walking by, Infinite suppleness in her body’s sway. I often fear that some malicious djinn
May envy her beauty, and wish to do her harm
అలీ బువుల్-కవి ,మిలిటరీ లీడర్ .’’గూల్వాడే’’అనేమాటను కాయినేజ్ చేశాడు ఇప్పటికీ అంతా దాన్ని వాడుతారు .తన గుర్రం పైకవిత –
O my horse Guulside!
If his goodness
And his nature I try to describe,
He is a pool that refills itself
And I cannot plumb his secret.
I fall short.
సోమాలికి ఎంతోఘనమైన జానపద సాహిత్య సంపద ఉన్నది .దేగ్ధీర్ దికానిబాల్ వుమన్ ‘’వంటికథలు తరతరాలుగా పిల్లలకు చెబుతూనే ఉన్నారు .అలాగే హింస వ్యతిరేకించే సైనికుడి కథ,కొల్డిడ్ దివైజ్ వారియర్కథలు కూడా ,’’ఎలయన్స్ టేల్’’ప్రసిద్ధ పిల్లలపుస్తకం .దీన్ని స్కూలు నాటకాలలో ప్రదర్శిస్తారు .
ఆధునిక సాహిత్యం –ముస్లిం సాహిత్యం కవిత్వం నుంచి హాడిత్ దాకా విస్తరించింది .లింగ్విస్ట్ ఐన షైర్ జామా అహ్మద్ స్టాండర్డ్ ఆర్దోగ్రాఫర్ .నూరుద్దీన్ ఫరా –ఫ్రం ఎ క్రూకేడ్ రిబ్ ,లింక్స్ రచనలు చాలా విలువైనవి .వీటికి అంతర్జాతీయ బహుమతి పొందాడు Mohamed Ibrahim Warsame – గ్రేటెస్ట్ లివింగ్ పోయేట్ .ఫరా మహమ్మద్ జామా ఔల్ –‘’డెర్విష్ ఎరా’’నవల’’ఇగ్నొరెంస్ ఈజ్ ది ఎనిమి ఆఫ్ లవ్ ‘’తో సుప్రసిద్ధుడు .గ్రేటెస్ట్ లివింగ్ పోయేట్ కూడా .క్రిస్టినా ఆలి ఫరా –కవిత్వం అనేకమాగజైన్లలో ప్రచురితం .పోయెట్రి ఆఫ్ మైగ్రేషన్ఇన్ ఇటలీ కూడా రాసింది .మదర్ ట౦గ్ అనే కవిత టోరినో ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ లో పురాస్కారం పొందింది .
148-టునీషియా దేశ సాహిత్యం
ఉత్తర ఆఫ్రికా మఘ్రేబ్ ప్రాంతం లో నార్దర్న్ మోస్ట్ పాయింట్ ఉన్న దేశం టునీషియా .రాజధాని టునిస్.కరెన్సీ –టునీషియన్ దీనార్ ,దీనార్ లు .అధికార భాష అరబిక్ .కొద్దిమంది బెర్బెర్ ఫ్రెంచ్ మాట్లాడుతారు .సగానికిపైగా సున్నీ మతస్తులు .అనాభా 1.16కోట్లు .అక్షరాస్యత 79శాతం .విద్య సైకిల్స్ స్థాయిల్లో ఉంటుంది .మొదటి ఆరేళ్ళు ప్రైమరీ సైకిల్ తర్వాత ఆరేళ్ళు హయ్యర్ సైకిల్ .ఆయిల్ ,వ్యవసాయం ,ఫాస్ఫేట్ ,కార్ భాగాల ఉత్పత్తి ,టూరిజం ఆదాయవనరులు బార్డో నేషనల్ మ్యూజియం ,దౌగ్గా,పోర్ట్ ఎల్ కన్తోరి చూడదగ్గవి .సురక్షిత దేశం .
టునీషియా సాహిత్యం –అరబిక్ ఫ్రెంచ్ భాషలలో విస్తృతంగా సాహిత్యం ఉన్నది సాహిత్యం కోసం ఏటా 3మిలియన్ దీనార్లు కేటాయింపు ఉంటుంది .వంద దాక ప్రచురణ సంస్థలున్నాయి .
ఆధునిక సాహిత్యం లో ఆలి దౌవాగి 150రేడియో నాటికలు,500పైగా కవితలు పాటలు రాశాడు .బెచ్రి ఖరీఫ్ అరబిక్ నవలకు కొత్త అందాలు కూర్చాడు కధకుడుకూడా .మొన్సేఫ్ గ్రాచెం ,హస్సన్ బెన్ఓత్మన్,హబీబ్ సెల్మి,మహామౌద్ మసాది,వాలిడ్ సోలిమన్ ప్రసిద్ధులు మసాది జాతీయభావ వ్యాప్తి చేశాడు
20వ శతాబ్దిలోనే ఫ్రెంచ్ సాహిత్యం ఇక్కడ వచ్చింది .మొదట్లో అరబిక్ రచయితలే ఇందులోనూ రాశారు .ఆల్బర్ట్ మెమ్మి ఊహప్రకారం టునీషియన్ సాహిత్యం యవ్వనం లోనే చావలేదు .అబ్దుల్ వహాబ్ మేడ్దేబ్,తాహర్ బెక్రి,ముస్తఫా టిల్లి ,ఈ భాషలోనే రాశారు. ఆఎమేన్ హాసేన్ ,ఫవాజి మెల్లా ఇతరదేశాలకు ఎగిరిపోయినా ‘’మెమరి అండ్ రిప్రజెంటేషన్’’పై బాగా స్పందించి రాస్తున్నారు .
సశేషం
క్షిణాయన పుణ్యకాల శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-7-20-ఉయ్యూరు
—