ప్రపంచ దేశాల సారస్వతం 151-టాంజానియా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

  1. 151-టాంజానియా దేశ సాహిత్యం
  2. తూర్పు ఆఫ్రికాలో విస్తారమైన అడవులు ,సఫారీ ఉన్న దేశం టాంజానియా .బిగ్ ఫైవ్ అంటే ఏనుగు ,సింహం ,చిరుత ,అడవి దున్న ,ఖడ్గ మృగాలకు నిలయం .ఆరబ్ ప్రభావం మాఫియా ప్రభావం జాస్తీ .వేల్స్,క్రోకడైల్స్ కు మెరైన్ పార్కులున్న దేశం కూడా .రాజధాని –దొదోమా.కరెన్సీ –టాంజ నియన్ షిల్లింగ్. జనాభా – 5.63కోట్లు .ముస్లిం, క్రైస్తవులు సమానంగా ఉంటారు .అధికార భాష –స్వాహిల్ బంటూ ,ఇంగ్లీష్ కూడా మాట్లాడుతారు .78శాతం  అక్షరాస్యత .ఏడేళ్ళ ప్రైమరీ ,నాలుగేళ్ల సెకండరి ,రెండేళ్ళ అడ్వాన్స్ లెవెల్ విద్య .వ్యవసాయం ముఖ్య ఆదాయం .కాఫీ ,సీసాల్ ,జీడిపప్పు ,టీ,కాటన్,పొగాకు పండించి ఎగుమతి చేస్తారు .టూరిజం సఫారి కూడా ఆదాయవనరులే ..మౌంట్ కిల్మంజారో (ఇక్కడికే ప్రముఖ అమెరికన్ నవలారచయిత  ఎర్నెస్ట్ హెమింగ్వే వచ్చి యాత్రా సాహిత్యం సఫారి గురించి రాశాడు )  ,నోగోరంగారో కన్జర్వేషన్ ,సెరెంగేటి నేషనల్ పార్క్ టూరిస్ట్ స్పాట్స్ .కొన్ని ,జాగ్రత్తలు తీసుకొంటే సఫారి ,టూరిజం హాయిగా చేయచ్చు .
  3. టాంజానియా సాహిత్యం –టాంజానియన్ సాహిత్యం స్వాహిల్ భాషలో ఉంటుంది .షాబాన్ రాబర్ట్ -1909-62 స్వాహిల్ భాషలో కవి నావలిస్ట్ వ్యాసరచయిత .మై లైఫ్ ,యాన్ ఎపిక్ ఇన్ ది వార్ ఆఫ్ ఫ్రీడం రాశాడు .మహమ్మద్ సయ్యద్ అబ్దుల్లా-డిటెక్టివ్ నలలు,  కథలు రాశాడు .షఫీ అహ్మద్ షఫీ,ఫాదీమితంగా,హుస్సేన్ ఇస్స తువా , మౌండు మివిన్గ్జీ ,జోసెఫ్ మేబెలె ,ఎబ్రహిం హుసేన్ ఇతర రచయితలు .
  4. ఇంగ్లీష్ భాషలో పీటర్ పలాన్గ్యో ‘’డైయింగ్ ఇన్ ది సన్’’,గాబ్రెల్ రుహుమ్బిక –విలేజ్ ఇన్ ఉహురు రాశారు .అబ్దుల్ రజాక్ గుర్నాహ్-కామన్ వెల్త్ రైటర్స్  ,బుకర్ ,ప్రైజులు పొందాడు .యితడు 1994లో రాసిన పారడైజ్ ,2005లో రాసిన డేజేర్షన్ బాగా క్లికయ్యాయి .మార్తి మోల్లెల్ కూడా కధకుడే జూలియస్ నైరేరీ -·      –దేశ ప్రధాని ,ప్రెసిడెంట్ ,రచయిత యాంటి కలోనియల్ పోరాట యోధుడు ‘’ఉజామా ఎస్సేస్’’ రాశాడు .అంతర్జాతీయ అవగాహనకు నెహ్రు అవార్డ్ ,గాంధీ శాంతి పురస్కారం పొందాడు

.

  • 152-టోగో దేశ సాహిత్యం –
  • పశ్చిమ ఆఫ్రికా గల్ఫ్ ఆఫ్ గినియాలో టోగో దేశం హిల్ టాప్ విలేజెస్ బీచెస్ ,17వ శతాబ్ది గుడిసెలుఉంటాయి .రాజధాని – లోమే.కరెన్సీ –వెస్ట్ ఆరికన్ ఫ్రాంక్ .జనాభా -79లక్షలు .అవే ,కల్బియే గుర్తింపబడిన భాషలు .అధికరభాషలు-ఫ్రెంచ్ ,యోరుబా .రోమన్ కేధలిక్కులు,ప్రొటెస్టెంట్లు సమానంగా ఉంటారు .అక్షరాస్యత 63.7శాతం .ఉచిత ఫ్రెంచ్ మోడల్ కంపల్సరి ప్రైమరీ విద్య తర్వాత సెకండరి వగైరా .ఫాస్ఫేట్ మైనింగ్, వ్యవసాయం సిమెంట్ హాండి క్రాఫ్ట్స్ ,టెక్స్టైల్స్ బివేరేజేస్ వగైరా ఆదాయవనరులు .కార్న్,సోర్ఘం ,,యామ్స్ ,మనియోక్ ,వరి,పీనట్స్,సోయా వగైరా పండిస్తారు .కౌటా మకౌ ,అకో డేస్సేవా ఫెటిష్ మార్కెట్ అనే మంత్ర క్షుద్ర శక్తులున్న చోటు దర్శనీయాలు .నేరం హింస పిక్ పాకేటింగ్ ,దొంగతనాలు సర్వసాధారణం .
  • టోగో సాహిత్యం –టోగోలీస్ సాహిత్యం 1950నుంచే ప్రారంభం. 20వ శతాబ్దం రచయితలు  –జీనట్టే ఆహోన్సి –ఫ్రెంచ్ లో  Une Longue Histoire Le Trophee de Crista Le Piège à Conviction (2013). Un Tunnel sans Bout  రాసిన స్త్రీరచయిత ..కంగ్ని అలెం-రైటర్ ట్రాన్స్ లెటర్ క్రిటిక్ ,గ్రేట్ లిటరరీ ప్రైజ్ విజేత ,కోలాకోలా జాజ్జ్ తోపాటు చాలాకథలురాశాడు .ధియోఅననిస్సో – Lisahoé (2005), Un reptile par habitant (2007), Ténèbres à midi (2010), and L’invitation (2013),  నవలలు రాశాడు .డేవిడ్ అననౌ – Le Fils du fétiche. రాశాడు .గిని మెండేవాఅటాక్ పామా –బాలసాహిత్య రచయిత La désillusion (2003), Tolo-Tolo (2004), Sauve-souris ! (2011) and Surtout n’entrez pas dans le sac ! (2012రాశాడు ఎవెస్ ఎమాన్యూల్ డోగ్బే-ఫిలాసఫర్ సోషియాలజిస్ట్ .,ఎడ్యు కేటర్.15పుస్తకాలు రాశాడు La Victime about racism and Incarcéré about his imprisonment. Dogbé wrote several essays, most notably La crise de l’éducation (1975).[2]
  • కోస్సిఎఫోయి –నవలలురాశాడు La Polka, in 1997మొదలైన నవలలు ‘’లో ‘’అనే ట్రాజేడినాటకం రాసిన దియేటర్ పర్సనాలిటి .ప్యాబెలో చాలోడ్ కోలి –మహిళా రచయిత .రేసిలి టేషన్స్ ,ఫాలా మొదలైనవి రాసింది .టేటేమైకేల్ కోపోమాస్సి –ఆన్ ఆఫ్రికన్ ఇన్ గ్రీన్ లాండ్స్ రాసి  అనేక బహుమతులుపొందాడు .సమీ టచక్,-గ్రాండ్ ప్రిక్స్ ,అవార్డీ.రాసిన నవలలు  –Femme infidèle, Lomé, Nouvelles Editions Africaines, 1988. Hermina, Paris, Gallimard, 2003. La fête des masques, Paris Filles de Mexico, Parisవగైరా .సేనౌవౌ అగ్బోటాజిన్సౌ –నటుడు ,డైరెక్టర్ నాటకకర్త  L’Arc en Ciel and Le Club,దిసింగింగ్ ఆఫ్ టార్టాయస్ వ  గైరా నాటకాలు రాశాడు .
  •   సశేషం
  • మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-7-20-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.