38ఏళ్ళ క్రిందటి శిష్యుడు శివ
1982లో ఉయ్యూరు హై స్కూల్ లోనూ, ఇంటిదగ్గర ట్యూషన్ లో శిష్యుడు శివ ఇవాళ మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో కనిపించాడు . ఆ సంవత్సరం ఫిబ్రవరిలో మా అమ్మగారు మరణించారు .అప్పుడు మా గొడ్లసావిడిలో ఆవులు గేదెలు ,పాడి పొలాల్లో పండిన పీకి ఇంటికి చేర్చిన నూర్చని మినుము తో కంగాళీగా ఉండేది డా కుమారస్వామి గారి హాస్పిటల్లో మా అమ్మమరణించారు .అక్కడినుంచి ఆమె పార్థివ శరీరాన్ని ఇంటికి తీసుకొచ్చేలోపు మినుము కట్ట అంతా గొడ్లదొడ్లోకి చేర్చట ,ఇంటికి ఆనుకుని ఉన్నపాకలో ఉన్న ఆవు దూడలను గొడ్లదొడ్డ్లోకి మార్చటం ఇల్లంతా నీట్ గా చేసి రెడీ చేశారు శివ ,అతడి మిత్రుడు వాసు మొదలైనవాళ్లు .మా కేమీ ఇబ్బందికలుగకుండా నిర్వహించారు ఆశిష్యులు .ఏమిచ్చి ఆరుణం తీర్చుకోగలం ?తలలో నాలుకలాగా వ్యవహరించారు .అప్పుడు పాలేరుకూడాలేడు . ఆ దినవారాల్లో ట్యూషన్ లేదని చెప్పినా ,రెండుపూటలా వచ్చి పని ఏమైనా ఉందా అని అడిగేవారు . 12వ రోజు రాత్రి వారందర్నీ ఇంటికి పిలిచిభోజనాలు పెట్టాం అంతకు తప్ప మేమేమీ చేయలేకపోయాము . ఆఅనుబంధం ఇప్పుడు తలచుకొంటే ఆశ్చర్యమేస్తోంది . . ఆ అనుబంధం ఇప్పుడు తలచుకొంటే ఆశ్చర్యమేస్తోంది .
దినవారాలై కాస్త వెసులు బాటు దొరికాక మినుము నూర్చటం మా ఆవిడ చేస్తుంటే సహాయం చేసి పూర్తి చేశారు . ఆశివ ఎర్రగా పొట్టిగా ఉండేవాడు కానీ చాలా చలాకీ .వాళ్ళనాన్నకు ఉయ్యూరు సెంటలో బార్బర్ షాప్ ఉండేది . మంచి మాటకారి, లౌక్యుడు .
ఆశివ ఇవాళ 38ఏళ్లతర్వాత మా గుడిలో కనిపించాడు .ఇవన్నీ చెప్పుకున్నాం .బెజవాడ పాలిటెక్నీక్ లో చదివి పాసై తర్వాత ఇంకా ఏదేదో చదివి ఎవరూ చదవని కోర్సులు చేసి హైదరాబాద్ కూకట్ పల్లి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ గా ఉన్నాడట .పిల్లలిద్దరినీ ఉన్నత విద్య చదివించి ఉద్యోగాలు చేస్తున్న కోడళ్లను తెచ్చుకొన్నాడట .కొడుకులు కోడళ్ళూ అమెరికాలో ఉంటున్నారట .ఎంత ఎదిగిపోయాడో శివ .శిష్యులు ఇలా ఎదిగితే గురువుకు ఎంత ఆనందం గర్వం ? కూకట్ పల్లిలో తానూ ఉండేచోట 30లక్షలు ఖర్చుచేసి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం కట్టాడట .సంపాదించటమే కాక, ఇలాంటి పుణ్యకార్యాలు చేస్తున్నందుకు అభినందించా .”మాస్టారూ !మనగుడి కూడా ఏదైనా చేస్తాను ”అన్నాడు” సంతోషం” అన్నాను
ఇవాళగుడిలో జరిగిన శాక0బరీ పూజ ఫోటోలు వాట్సాల్ప్ లో పంపించాను .వినయవిధేయతలు గురుభక్తి ఉన్న ఇలాంటిశిష్యులు దొరకటం నా అదృష్టం .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-7-20 -ఉయ్యూరు