ప్రపంచ దేశాల సారస్వతం
- 153-జాంబియా దేశ సాహిత్యం
- దక్షిణ ఆఫ్రికా లో వైవిధ్య జంతువులతో సఫారీకి అనుకూలమైన దేశం జాంబియా .విక్టోరియా జలపాతానికి ప్రసిద్ధి .ఈ ప్రాంతాన్ని ‘’మోసి యోవా టున్యా’’అంటే ‘’స్మోక్ దట్ దండర్స్’’అంటే ఉరిమే పొగ అంటారు .రాజధాని లుసాకా .కరెన్సీ –జామ్బియన్ క్వాచా .జనాభా 1.74.కోట్లు .మెజారిటీ క్రిస్టియన్లు..అధికార, వ్యవహార భాష కూడా ఇంగ్లీష్ .55.3అక్షరాస్యత శాతం .7-5-4విధాన విద్య.ఏడేళ్ళు ప్రైమరీ ,రెండేళ్ళు జూనియర్ ,మూడేళ్ళు హయ్యర్ సెకండరి ,నాలుగేళ్ళు యూని వర్సిటి .కాపర్ మైనింగ్ బెవేరేజస్ ,కెమికల్స్ ,టెక్స్టైల్స్ ,ఫెర్టిలైజర్ ,హార్టి కల్చర్ ఆదాయ వనరులు .విక్టోరియా ఫాల్స్ ,టైం-టైడ్మేచెంజా కాంప్, కఫ్యూ నేషనల్ పార్క్ దర్శనీయాలు .సురక్షిత ప్రాంతం .
- జాంబియా సాహిత్యం – యువ రచయితలు బృందంగా ఏర్పడి ‘’న్యు రైటింగ్ ఫ్రం జాంబియా ‘’సాహిత్య మేగజైన్ ప్రారంభించారు .’’ఎ బిబ్లియాగ్రఫీ ఆఫ్ జాంబియాస్ ఇంగ్లీష్ లిటరేచర్ ‘’రంకా ప్రిమోరక్ రాశాడు .సాహిత్య పోటీలు, వర్క్ షాప్ లూ నిర్వహిస్తున్నారు .ప్రసిద్ధులను ఆహ్వానించి ప్రసంగాలు ఏర్పాటు చేయటం ఇతర చోట్ల ,ఇతర దేశాలోనూ జరిగే సాహిత్య సభలలో పాల్గొనటం అక్కడ జాంబియా పుస్తక విక్రయం చేస్తున్నారు.
- జాంబియా యూనివర్సిటి విద్యార్ధులు 1968లో ‘’మఫాలా క్రియేటివ్ సొసైటీ ‘’ఏర్పరచి ‘’ది జ్యుఎల్ ఆఫ్ ఆఫ్రికా ‘’ప్రచురించారు .మిగిలిన జర్నల్స్ ‘’నిషిల -దివే ‘’ zమాగజైన్’’ లు ప్రచురించాయి .అదే ఏడాది ఫన్యాంగా ములికిటా ఇంగ్లిష్ లోరాసిన కథా సంపుటి ‘’ఎ పాయింట్ ఆఫ్ నో రిటర్న్ ‘’ ను ప్రభుత్వ నేషనల్ ఎడ్యుకేషన్ కంపెని మొదటిసారిగా ప్రచురించింది .ఆండ్రూ మసియే ఇంగ్లిష్ లో రాసిన ‘’దిడాన్’’అనే పూర్తి మొదటినవల 1971లో అదే కంపెనీ ప్రచురించింది .డొమినిక్ ములైషో రాసిన ‘’ది టంగ్ ఆఫ్ ది డంబ్ ‘’ను హీనేమన్స్ ఆఫ్రికన్ రైటర్స్ సిరీస్ గా ప్రచురించారు
- ముఖ్యమైన ఎనిమిది మంది రచయితలు –బిన్ఎల్ సిన్గాగ్వే –మొదటి నవల ‘’క్విల్స్ ఆఫ్ డిజైర్ ‘’1993లో రాశాడు .2000లో రెండవనవల ‘’ఎ కోరీ ఆఫ్ హాప్ ‘’రాసి ప్రచురించాడు .ఎఫెమియా చెలా-రచయిత్రి విమర్శకురాలు .కెయిన్ ప్రైజ్ ఫర్ఆఫ్రికన్ రైటింగ్ ను 2012లో ,2014లో ‘’చికెన్ ‘’కధకు కవేటేడ్ అవార్డ్ పొందింది .బ్రిటిల్ పేపర్ ,షాబెస్ట్ అమెరికన్ షార్ట్ షార్ప్ స్టోరీస్ అడల్ట్స్ ఓన్లి మొదలైనవి వెబ్ సైట్ లో రాసింది ‘’షార్ట్ స్టోరీ డే ఆఫ్రికా 2015’’వంటిపుస్తకాలు రాసింది. 2017’’షార్ట్ స్టోరీ కలెక్షన్ తెచ్చింది .ప్రస్తుతం జోహాన్నెస్ బర్గ్ రివ్యు ఆఫ్ బుక్స్ కు ఎడిటర్ .నాంవాలి సేర్పెల్ –ఆధర్ ,అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లిష్ .ముజుంగు –వైట్ పర్సన్ అనే కథా సంపుటి రాసి ‘’ది బెస్ట్ అమెరికన్ షార్ట్ స్టోరీస్ గుర్తి౦పు పొంది ‘’కైనే ప్రైజ్ ఫర్ ఆఫ్రికా ‘’పొందింది ‘’.దిసాక్’’ కు కూడా ఈబహుమతి వచ్చింది .2019’’దిఓల్డ్ డ్రిఫ్ట్’’నవల రాసింది .ఎల్లెన్ బందా ఆకు –వాన్డీస్ లిటిల్ వాయిస్ రాసిమాక్మిలన్ ప్రైజ్ పొందింది సోజీస్ బాక్స్ కథా సంపుటికి కామన్ వెల్త్ షార్ట్ స్టోరీ ప్రైజ్ 2012లోవచ్చింది .పిల్లలపుస్తకాలు7,2నవలలు రాసింది .కాయో చింగోన్యి-కవి ఎడిటర్ .బెస్ట్ బ్రిటిష్ పోయెట్రి,దిసాల్ట్ బుక్ ఆఫ్ యంగర్ పోఎట్స్ అవార్డ్ లు పొందాడు . కవిత ‘’ది కలర్ ఆఫ్ జేమ్స్ బ్రౌన్స్ స్క్రీం’’కు న్యు జెనరేషన్ ఆఫ్రికన్ పోయేట్ గుర్తి౦పువచ్చింది .కు ముకందా,2017లో రాసి ‘’డిలాన్ ధామస్ ప్రైజ్ గెల్చుకొన్నాడు .ఆటోబయాగ్రఫిక్ వ్యాసాలూ రాశాడు .కాలీ కంబందు-కలెంబా అంటే టురైట్ షార్ట్ స్టోరీప్రైజ్ 2018లో వచ్చింది .ఇంటిపని వాడి గురించి ‘’ఎ హాండ్ టు హోల్డ్ ‘’రాశాడు .విల్బర్ స్మిత్ –దిగాడ్స్ ఫస్ట్ మేక్ మాడ్ అనే మొదటినవలరాశాడు .వెన్ దిలయన్ ఫీడ్స్ రెండవరచన1964.మొత్తం 41పుస్తకాలురాస్తే 120మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి .డంబిసా మోయో –‘’డెడ్ ఎయిడ్-హౌ దివెస్ట్ వజ్ lost’’ నవల న్యూయార్క్ బెస్ట్ సెల్లర్ గా 2009లో నిల్చింది .ఆఎడే టీం మాగజైన్ ఆమెను ‘’ది పర్సన్ ఆఫ్ ఇన్ ఫ్ల్యుఎన్స్’’అని మెచ్చింది · .కెన్నెత్ కౌండా –దేశ ప్రెసిడెంట్ –జాంబియా షల్ బి ఫ్రీ ,దిరిడిల్ ఆఫ్ వయలెన్స్ పుస్తకాలురాశాడు .
.
- 154-జింబాబ్వే దేశ సాహిత్యం
- సదరన్ ఆఫ్రికాలో డ్రమాటిక్ లాండ్ స్కేప్ లు, డైవర్స్ లాండ్ స్కేప్స్ లున్న దేశం జింబాబ్వే.విక్టోరియన్ ఫాల్స్ ఆకర్షణ రాజధాని –హరారే –కరెన్సీ-అమెరికన్ డాలర్, RTGSడాలర్ .జనాభా -1.44కోట్లు .ప్రోటేస్టంట్ క్రిస్టియన్ దేశం .షోనా, జోషా,ఇంగ్లిష్ చెవా ,నేడేబెలె , సదరన్ సోతో, ,.వెండా,ట్స్వానా అధికార భాషలు .88.7శాతం అక్షరాస్యత .రెండేళ్ళ ప్రైమరీ ,4-6సెకండరి ,తర్వాత హయ్యర్ విద్య .వ్యవసాయం ముఖ్య ఆదాయం .మైజ్ సోయా బీన్స్ ,వీట్,టుబాకోపంటలు .హవాన్గే నేషనల్ పార్క్ మానాపూల్స్ నేషనల్ పార్క్ ,మటాబో నేషనల్ పార్క్ చూడతగినవి .నేరాలున్నా సురక్షితం .
- జింబాబ్వే సాహిత్యం -10మంది ముఖ్య రచయితలు –చార్లెస్ ముంగోషి –వైటింగ్ ఫర్ ది రైన్ నవల ఇంగ్లిష్,షోనా భాషలలో రాశాడు .బిషప్ పాట్రిక్ చకైపా –గ్రాండి చౌయా నవల బాక్ వుడ్స్ పై రాశాడు .కారికోగా గుమి రెమిసెవ్ రచన నిజంగా ఎపిక్ లా ఉంటుంది .ఎం.ఏ .అముత్యుని –ఇమాజినేటివ్ స్టోరీస్ రాశాడు .కుససానా కునోపరియా నవల రాశాడు .స్టాన్ లకేసంకంగా-హిస్టారికల్ నావలిస్ట్ .’’ఆన్ ట్రయల్ ఫర్ మై కంట్రీ’’నవల రాశాడు .యోవేన్నో వేరా –స్టోన్ వర్జిన్స్ అనే నవల రాసి మాక్మిలన్ ప్రైజ్ ,స్వీడిష్ తుచోల్కి ప్రైజ్ పొందాడు .ముసేమూరా జిమున్యా –గొప్పకవి .ఆ దేశ జీవితం పై అద్భుతకవితలు రాశాడు .’’థాట్ ట్రాక్స్ ‘’కవితా సంపుటి లో కాలనీపాలనలో నల్లజాతివారి దయనీయ జీవితం చిత్రించాడు .డంబుడ్జోమరచెరా –హౌస్ ఆఫ్ హంగర్ లో సర్రియల్ మెటాఫిజికల్ కవిత్వం రాశాడు .మసిమ్బా ముసోడ్జా-‘’హెర్బర్ట్ వాంట్స్ టు కం హోమ్’’.నవల రాశాడు .చెంజేరై హోవ్-బోన్స్ నవల, బ్లైండ్ మూన్ కవితాసంపుటి రాశాడు .షిమ్మర్ చినోద్యా-ఫరైస్ గర్ల్స్ నవల లో లిబరేషన్ వార్ విషయాలు ,స్ట్రైఫ్ నవలలో నూతన కుటుంబాల ఏర్పాటు గురించి రాశాడు .
- సశేషం
- మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-7-20-ఉయ్యూరు