పసిఫిక్ సముద్రం లో ఆగ్నేయాన న్యూ జిలాండ్ ఐలాండ్ దేశం ఉంది .సుమారు 600 చిన్న చిన్న దీవులున్న దేశం .రాజధాని వెల్లింగ్టన్.జనాభా 49లక్షలు .కరెన్సీ –న్యూజిలాండ్ డాలర్ .క్రిస్టియన్ దేశం .ఇంగ్లీష్, మావొరీ ,న్యు జిలాండ్ సైన్ భాషలు మాట్లాడుతారు .అధికారభాష –న్యు జిలాండ్ సైన్ భాష .అక్షరాస్యత -99శాతం .5నుంచి 19వ ఏడు వయసు వరకు ఉచిత విద్య .సెకండరి విద్య -9నుంచి 13ఏడు వరకు .మాన్యు ఫాక్చరింగ్ ఎలేక్ట్రిసిటి,వేస్ట్ సర్వీసెస్ ఆదాయవనరులు .మాంసం,పాలఉ త్పత్తులు పళ్ళు కూరగాయలు ,క్రూడాయిల్ ,కలప కూడా ఆదాయ వనరులే .ఆక్లాండ్ స్కై టవర్ ,క్వీన్స్ టౌన్ ,రోటోరువా వగైరా చూడచ్చు .సురక్షితం .
న్యూజి లాండ్ సాహిత్యం -20వ శతాబ్దం నుంచే వ్రాత సాహిత్యం వచ్చింది .బిల్ పియర్సన్ ‘’ఫ్రేట్ ఫుల్ స్లీపర్స్ ,’’ఎ స్కెచ్ ఆఫ్ న్యూజిలాండ్ బిహేవియర్ అండ్ ఇట్స్ ఇంప్లి కేషన్స్ ఫర్ ది ఆర్టిస్ట్ ‘’వంటి వ్యాసాలూ బాగా ప్రభావితం చేశాయి .న్యూజిలాండ్ సంస్కృతిలో కవిత్వం ఒక భాగం .యూరోపియన్ల సెటిల్ మెంట్ కు ముందు ‘’మావోన్ సంగ్ పోయెమ్స్’’లేక వాలటా ముఖ్యమైనవి 1950నుంచే అసలైన దేశీయ సాహిత్యం వచ్చింది .ముఖ్యకవులలో –జేనెట్ ఫ్రేం ,పాట్రీషియా గ్రేస్ ,ఆల్బర్ట్ వెండేట్ ,మారిస్ గీ ,సాం హంట్ ,బిల్ మాన్ హైర్.వీరు కవిత్వం తోపాటు నవలలూ రాశారు .బాలసాహిత్యాన్ని మార్గరెట్ మహి రాసింది ప్రభుత్వం ఆస్థానకవిని రెండేళ్లకోసారి ఏర్పాటుచేస్తుంది
ఇవాన్ వేడ్డీ నవల డిక్ సేడాన్స్ గ్రేట్ డైవ్ బాగా పాప్యులర్ .కేరి హుల్మే రాసిన నవల ‘’ది బోన్ పీపుల్ ‘’కు బుకర్ ప్రైజ్ అవ్చ్చింది .ఎలినార్ కాటన్ 2013బుకర్ ప్రైజ్ ను తననవల ‘’ది లూమినరీస్ ‘’కు పొందింది .వీటి హిహిమేస్రా’’వేల్ రైడర్ ‘’నవలతో ప్రఖ్యాతిపొందింది .సినిమా తీశారు .డాన్ డావిన్ కేధరీన్ మాన్స్ ఫీల్డ్ గొప్ప రచయితలూ .సామ్యుల్ బట్లర్ ఇక్కడ అయిదేల్లున్న బ్రిటిష్ రచయిత.
నాటకరచనలో రెడ్ మోల్ గ్రూప్ మంచి విజయాలు సాధించింది .క్రిస్ట్ చర్చ లో ఫ్రీ దియేటర్ 1984లో ఏర్పడి ఇప్పటిదాకా నిర్విరామంగా సాగుతోంది .న్యూజిలాండ్ ప్రభుత్వం సాహిత్య అవార్డ్ లు అందజేసి బాగా ప్రోత్సహిస్తోంది
157-మార్షల్ ఐలాండ్స్ దేశ సాహిత్యం
వకానిక్ ఐలాండ్ లతో ఒక చైన్ గా మధ్య ఫసిఫిక్ సముద్రం లో మార్షల్ ఐలాండ్స్ ఉన్నాయి .రాజధాని –మజురో. కరెన్సీ –అమెరికన్ డాలర్ .జనాభా -58,413.క్రిస్టియన్ దేశం .అక్షరాస్యత 98.27శాతం .6-14ఏళ్ళవయసువరకు కంపల్సరి విద్య .ఎబాన్ అనే కజిన్ మొల్ భాష మార్శలేస్ భాష ఎక్కువమంది మాట్లాడుతారు ఆస్ట్రో నేషనల్ ,మాలయో పోలి నేషియన్,మైక్రోనీషియన్ భాషా జనం .సబ్సిడీలపై జీవించే దేశం .అబెయే ,అర్నో అటోలి,రాయ్ నముర్ చూడచ్చు .సురక్షితం .
మార్షల్ ఐలాండ్స్ సాహిత్యం –ముఖ్య రచయితలు.కేతీ జేట్నికిజినెర్-పర్యావరణం క్లైమేట్ చేంజెస్ పై కవిత్వం రాసింది .లేప్ జెల్టోక్- పోయెమ్స్ ఫ్రం ఎ మార్షలీస్ డాటర్ మొదటి సంపుటి2017లో ప్రచురించింది . 2018లో ‘’రైజ్ ‘’ఫ్రం వన్ ఐలాండ్ టు అనదర్ ‘’రాసింది .ఎన్విరాన్ మెంటల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తోంది ఉనితెద్ నేషన్స్ క్లైమేట్ సమ్మిట్ లో ప్రసంగించింది.జాక్ నీడెన్ ధాల్-ఫర్ ది గుడ్ ఆఫ్ మాన్‌కైండ్ –ఎహిస్టరీ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ బికినీ అండ్ దెయిర్ ఐలాండ్స్ ‘’రాశాడు దిసౌండ్స్ ఆఫ్ క్రికేట్స్ యట్ నైట్ మొద్సలైన సినిమాలు తీశాడు .
మార్షల్ ఐలాండ్స్ ముఖ్య పుస్తకాలు –సర్వైవింగ్ పారడైజ్ –పీటర్ రుడియాక్,మార్షల్ ఐలాడ్స్ లెజెండ్స్ అండ్ స్టోరీస్ –డేనియల్ కెలిన్ ,మై స్టోరీ అజ్ ఏ సర్వైవర్ –కాట్నర్ టీమా,మేలాల్ నవల-రాబర్ట్ బరాక్లె ,దిబాంబ్ –దియోడర్ ,లేడీ విత్ స్పియర్ –యూజీన్ క్లార్క్ ,నిన్ డిగ్రీస్ నార్త్ –మైకేల్ బయూత్ మొదలైనవి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-7-20-ఉయ్యూరు