ప్రపంచ దేశాల సారస్వతం
155- దక్షిణాఫ్రికా దేశ సాహిత్యం
- ఆఫ్రికా ఖండంలో దక్షిణాగ్రాన దక్షిణ అమెరికా దేశం ఉన్నది . ఇన్ లాండ్ సఫారికి అనుకూలం .కేప్ టౌన్ ,ప్రిటోరియా ,బ్లోయెం ఫోర్టీన్ అనే మూడు రాజధానులు .కరెన్సీ సౌత్ ఆఫ్రికన్ రాండ్ .జనాభా 5.8కోట్లు .ఎనభై శాతం క్రిస్టియన్లు .94.37శాతం అక్షరాస్యత .ఎలిమెంటరి, సెకండరి ,టేరిటరిస్థాయి విద్య .ప్రపంచంలో ప్లాటినం అత్యధికంగా ఉన్న దేశం గోల్డ్ ,క్రోమియం ,ఆటోమొబైల్, ఐరన్, టెక్స్ టైల్స్,కెమికల్స్ ,ఎరువులు ,షిప్ రిపైర్ ఆదాయ వనరులు .చెరుకు, ప్రత్తి ముఖ్యపంటలు . కేప్ టౌన్ ,క్రూగర్ నేషనల్ పార్క్ ,జోహాన్స్ బర్గ్ అపార్ధీడ్ పార్క్ ,డర్బాన్ చూడతగినవి .సురక్షిత దేశం .
- దక్షిణాఫ్రికా సాహిత్యం –ఆఫ్రికాన్స్ ,ఇంగ్లీష్ జూలు ,క్సోసా ,సోతో ,పెడి,త్స్వానా,వెండా,సిస్వతి,సోంగా ,నెడీబెలి అనే 11భాషలలో సాహిత్యం ఉంటుంది
- లీ పోల్డిట్,లాంగెన్ హోవెన్ లు జాతీయగీతం –డైస్టెమ్ రాశారు .అంతకు ముందు ఆంగ్లో –బోఎర్ యుద్ధ రచనలు వచ్చాయి .ఎంపి వాన్విక్ ‘’డేర్టిజర్స్’’ఉద్యమం తెచ్చాడు.దీనితో జాతీయ సాహిత్యం వచ్చింది .డిజే ఒప్పార్ మాన్ ‘’గూట్ వేర్స్ బోఎక్ ‘’అనే అన్దాలజి రాశాడు .టిటిక్లోటే Literêre Terme en Teorieë (1992రాశాడు .జోన్ హామ్బిద్జ్ ,హెన్నీ హకామ్ప్ ,ఎర్నెస్ట్ వాన్హీర్డెన్ కవులు ప్రసిద్ధులు..గ్లేర్ట్ వాక్ నెల్,బ్రిటన్బ్రేటేన్ బాచ్ లు బెస్ట్ పోఎట్స్ .ఫారం నావెల్స్ బాగావచ్చాయి .మార్లీన్ వాన్ నీ కెర్క్ రాసిన ‘’ట్రి యోమ్ఫ్’’నవల జోహాన్స్ బర్గ్ లోని పేదల జీవితం గురించి .ఏక్ స్టామేల్ ఏక్ స్టేర్వే’’రాజకీయ నవల సరిహద్దుల ఓపెనింగ్ గురించి రాయబడింది .
- ఇంగ్లీష్ లో ఆలివ్ షెరినర్ ‘’దిస్టోరీ ఆఫ్ యాన్ ఆఫ్రికన్ ఫారం ‘’నవల విక్టోరియన్ సాహిత్యాన్ని గుర్తుకు తెస్తుంది .క్రై,బిలవ్డ్ కంట్రీఅలాన్ పాటన్ రాశాడు .నదీనే గోర్డ్ మెర్ కధారచన మొదలుపెట్టి ,జూలిస్ పీపుల్ నవల 1991లో వైట్ మైనారిటి ప్రభుత్వ పతనం పై రాసి మొదటి నోబెల్ పురస్కారం అందుకొన్నది .అధాల్ ఫుగార్డ్ ‘’ట్సోట్సి’’నవలను సినిమా తీశారు .డ్రామాలూ రాశాడు .మంగెన్ వాలీ సెరోటే’’నో బేబీ మస్ట్ వీప్’’నవల జాత్యహ్మ్కారానికి గురైన వారి గురించిరాశాడు .లేవిస్ నికోసి-మేటింగ్ బర్డ్స్ ,అండర్ గ్రౌండ్ పీపుల్ ,మండేలాస్ ఈగో రాశాడు మరో ముఖ్యరచయిత జేక్స్ మడాపోయెట్రి నాటకాలు రాసి నవల’’ది హార్ట్ ఆఫ్ రెడ్ నెస్’’రాసి కామన్ వెల్త్ రైటర్స్ ప్రైజ్ 2001లో పొందాడు .ఇది స్కూల్ కర్రిక్యులం లో చేరింది .జాన్ మాక్స్ వెల్ కోఎడ్జి’’మయూరీ ఎట్ మెట్రో పాలిటన్’’నవలరాసి బుకర్ ప్రైజ్ పొందాడు .లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ మైకేల్ రాసి ,డిస్‌గ్రేస్ నవలకు రెండవసారి బుకర్ ప్రైజ్ తోపాటు కామన్ వెల్త్ ప్రైజ్ కూడా అందుకొన్నాడు .పీటర్ అబ్రహామ్స్ ‘’మైన్ బాయ్ ‘’అలెక్స్ లా గుమా ‘’వాక్ ఇన్ దినైట్ ‘’,బ్రేటేన్ బ్రేటేన్ బాచ్’’ది ట్రూ కన్ఫెషన్స్ ఆఫ్ యాన్ ఆల్బినో టెర్రరిస్ట్ ‘’,నాడినే రాసిన ‘’ బర్జేర్స్ డాటర్ ‘’యాండ్రీ బ్రిన్క్స్ రాసిన ‘’డ్రై వైట్ సీజన్ ‘’రిచార్డ్ రివే రాసిన ‘’బకింగ్‌హాం పాలస్ డిస్ట్రిక్ట్ సిక్స్ ,ఆండ్రే ప్రిన్స్ –రూమర్స్ఆఫ్ రైన్ ,సిఫోరాసిన ‘’రైడ్ ఆన్ ది విర్ల్ విండ్ ,’’మొన్గానే సోరేటే-టుఎవిరి బర్త్ ఇట్స్ బ్లడ్,,లంబ్కిన్-దిహంగింగ్ ట్రీ చెప్పుకోదగిన మంచి రచనలు .
- ఆల్ హోల్ ఫుగార్డ్ ‘’’మాస్టర్ హోరాల్ద్ అండ్ ది బాయ్స్ ‘’నాటకం జాతుల సంబంధాలపై రాసింది .బోస్మన్ ,లీనా నాటకాలు ఆదేశ బీదల కస్టాలు కన్నీళ్లు .ఇవి దియేటర్లలో నాటకాలుగా ప్రదర్శితాలు .జేక్స్ మిడా’’వుయ్ షల్ సింగ్ ఫర్ ది ఫాదర్ లాండ్ ‘’గొప్పనాటకం .ఇటీవలినాతకాలు క్రూరహింస పై వచ్చినవి అందులో లారా ఫుట్ న్యూటన్ నాటకం ‘’త్సెపాంగ్’’,ఫూగార్డ్ రాసిన ‘’విక్టరి ‘’,పాల్ గ్రూత్ బూమ్స్ రచన్-రిలేటివిటిఉన్నాయి .
- కవిత్వ విషయానికి వస్తే టోనీ యులియెట్’’ది లోన్లీ ఆర్ట్ –యాన్ ఆంధ్రాలజి ,లో ఆ దేశ ఇంగ్లీష్ కవిత్వం కనిపిస్తుంది
- 20వ శతాబ్ది మొదటిభాగం పురుషరచయితల డామినేషన్ .సాల్ పట్జే-ముహుడి ఒక ఎపిక్ .అందులో వందేళ్ళక్రితం ఆ దేశ నేటివ్ లైఫ్ కనిపిస్తుంది .ధామస్ మోఫోలో రాసిన ‘’చాకా ‘’అంటే ట్రెయిన్స్ కూడా ఎపిక్ లాంటిదే . మహిళా రచయితలకు ప్రోత్సాహం తక్కువే ఇప్పుడే కాస్త ము౦దు కొచ్చిరాస్తున్నారు .
- జులు భాషా రచయితలలో విలకాజి ,దోల్మో ,నేదేబెలె ,యియెం మేడ్,నిటూలీ ఉన్నారు. క్సోసా భాష లో –మకహి మొదటినవలరాశాడు .జోర్డాన్ ,జ్లోబే ,క్వంగూలె ,బొంగేలా ,గాడ్ఫ్రీ ,రుబుసానా ,గుయుబాన్ సేన్స్కో ,.సి౦దియే మగోనా-మదర్ టుమదర్ ‘’మొదటినవల 1998లో రాసింది .సేస్సోతో భాషలో –మఫాలా ,ఖకెట్లా,ధామస్ మోఫోలో ఉన్నారు .పెడి భాషలో –మాట్సేపే,బోపేప్ ,మారెడి,మాచకా ,నుచ బెలేంగ్ ముఖ్యులు.ట్స్వానా భాషలో –సోల్ పలటిజి,మొలోటో,మొన్యైస్,మొరోకే ,మొడిసే,నిత్స్మి ,రేడిట్లాండి ప్రసిద్ధులు
- దేశం లో ఓపెన్ బుక్ ఫెస్టివల్స్ ఘనంగా నిర్వహించి సాహిత్య పోషణ చేస్తున్నారు .
- నెల్సన్ మండేలా గాంధీ ఆదర్శాలతో తెల్లజాతి ప్రభుత్వం పై దీర్ఘకాలం పోరాడి జైలు అనుభవించి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన యోధుడు .1994-95కాలం లో దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ .లాంగ్ వాక్ టు ఫ్రీడం,మండేలా మొదలైన గ్రంధకర్త .నోబెల్ శాంతి పురస్కారం ,భారతరత్న మొదలైన అత్యున్నత పురస్కార గ్రహీత.
- డెస్మండ్ టూటో-జాత్యహంకార వ్యతిరేక పోరాట యోధుడు ,మానవహక్కుల కోసం శ్రమించిన గొప్ప రచయిత.నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ .దిబుక్ ఆఫ్ జాయ్,దిబుక్ ఆఫ్ ఫర్గివెన్ ,నోఫ్యూచార్ వితౌట్ ఫర్గివ్ నెస్,మేడ్ ఫర్ గాడ్ నెస్అండ్ వై’’వంటి గొప్పరచనలు చేశాడు .
- మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాలోనే తన మొదటి రాజకీయ పోరాటం మొదలుపెట్టాడు .మొదటి సారిగా జాత్యంకారం ఎదుర్కొన్నాడు .దీనికి విరుగుడుగా నటాల్ కాంగ్రెస్ ఏర్పాటు చేశాడు .బోయర్ యుద్ధం లో 1100మంది ఇండియన్స్ తో అంబులెన్స్ కార్ప్స్ ఏర్పాటు చేసి సేవ చేశాడు .డర్బాన్ లో ఫోనిక్స్ ఫారం ఏర్పాటు చేసి అహింసా సత్యాగ్రహానికి శిక్షణ మొదలైనవి చేశాడు .అనేకరచనలు కరపత్రాలు ,ప్రస౦గాలద్వారా హక్కుల పోరాటానికి జనాన్ని సిద్ధం చేశాడు .
- నొడిమే గోర్డిమేర్ 1991లో సాహిత్యం లో నోబెల్ ప్రైజ్ వచ్చింది .
- ఇక్కడితో ఆఫ్రికా దేశాల సాహిత్యం పూర్తయింది .మరో ఖండం లోని దేశాలలో మళ్ళీ కలుద్దాం .
- సశేషం
- మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-7-20-ఉయ్యూరు