ప్రపంచ దేశాల సారస్వతం
- 163-గుయాం దేశ సాహిత్యం
- మైక్రో నేషియా సరిహద్దులో పశ్చిమ ఫసిఫిక్ లో ట్రాపికల్ బీచెస్,చామోర్రోవిలేజేస్ ఉన్న దేశం గుయాం .రెండవ ప్రపంచయుద్ధకాలం నాటి నేషనల్ హిస్టారిక్ పార్క్ ఉంది.స్పానిష్ సంస్కృతీ వారసత్వ గ్రామాలు ఉంటాయి .రాజధాని -అగాదా ,కరెన్సీ –అమెరికన్ డాలర్ .జనాభా -1.66లక్షలు .రోమన్ కేధలిక్ మతం .ఇంగ్లీష్ ,చామోర్రో భాషలు అధికారభాషలు.99.37శాతం అక్షరాస్యత .అమెరికన్ విద్యా విధానం .టూరిస్ట్ రెవెన్యు ,అమెరికా ఆయుధ ఖర్చే ఆదాయం .హగాతా ,టమురింగ్, టోలోఫోఫో,డేడేడో చూడతగ్గవి .సురక్షిత దేశం .
- గుయాం దేశ సాహిత్యం –
- కవిత్వమే తమలో రాజకీయ జాగృతి కలిగించిందని క్రైగ్ సాంటోజ్ ప్రైజ్ అన్నాడు. కరెంట్ లేని ఎన్నో రాత్రులు కుటుంబం అంతా ఆరుబయట గుండ్రంగా చేరి కబుర్లు చెప్పు కొంటూ అన్నం తింటూ గడిపేవారమని నెత్తిపై సోనిక్ బ్లాస్ట్స్ ఆఫ్ ఫైటర్ జెట్ల ధ్వనిమాత్రమే తమకు అంతరాయమని ,తమ దేశం లో ముప్ఫై శాతం భూమి వారి అమెరికా ఆక్రమణ లోనే ఉందని, 1898నుంచి అమెరికన్ టేరిటరిగాఉందనీ ,ఈ దేశాన్ని ‘’అన్ సిన్కబుల్ ఎయిర్ క్రాఫ్ట్ కారియర్స్ ‘’అంటారని ,అంతేకాక ‘’ది టిప్ ఆఫ్ అమెరికన్ స్పియర్ ఇన్ ఏషియా ‘’అనికూడా పిలుస్తారని రాశాడు .శతాబ్ద కాలంగా తమ కోరల్ రీఫ్ లను అమెరికా విచ్చల విడిగా తవ్వేసిందని ఫిషింగ్ పాండ్స్ ను విషపూరితం చేసిందని ,సముద్ర జీవులను క్షయం చేసిందని ,భూమిని ,త్రాగు నీటిని కలుషితం,అరణ్య ధ్వంసం ,అరుదైన జీవజాతుల విధ్వంసం చేసిందని,తమజాతిప్రజలను పారి పోయేట్లు ఖాళీ చేసేట్లు ఒత్తిడి తెచ్చిందని వాపోయాడు .ఒకప్పుడు అద్భుత జీవ వైవిధ్యం ఉన్న దేశం నేడు సర్వం కోల్పోయిందని వేదన చెందాడు .తాము రాత్రిళ్ళు చెప్పుకొనే కథలలో ఇరుగు పొరుగు వారికి కేన్సర్ వచ్చి చావటం లేక సోకటం గురించే ఎక్కువన్నాడు .తమశరీరాలలో టాక్సిన్లు లోతుగా ప్రేలని బాంబుల్లా స్థాపించపించ బడ్డాయని వ్యధ చెందాడు oxins are buried in our bodies like unexploded ordnances.
- 164-న్యు కలడోనియా దేశ సాహిత్యం
- సౌత్ ఫసిఫిక్ లో ఫ్రెంచ్ టేరిటరి లో డజన్లకొద్దీ దీవులున్న దేశమే న్యు కలడోనియా.పాం లైన్డ్ బీచెస్ ,మహా సముద్ర జీవ సంపద ,24వేల చదరపు కిలోమీటర్లు వ్యాపించి ప్రపంచంలోనే అతి పెద్దదైన తీరప్రాంత దేశం .విస్తృత బారియర్ రీఫ్ ,స్కూజా డైవింగ్ ఆకర్షణ .రాజధాని –నౌమియా .కరెన్సీ –CFP ఫ్రాంక్ .జనాభా -2.84లక్షలు .ఫ్రెంచ్ అధికారభాష .కనాక్ భాషాజనం ఉన్నారు .క్రిస్టియన్ దేశం .96.8అక్షరాస్యత శాతం .ఫ్రెంచ్ విధాన విద్య .నికెల్ మెగ్నీషియం ,ఐరన్ కోబాల్ట్,క్రోమియం మాంగనీస్ గనులు ,టూరిజం ఆదాయవనరులు .టిజిబావు కల్చరల్ సెంటర్ ,ఎమేడీ లైట్ హౌస్ ,ఇల్లాట్ మైట్రే దర్శనీయాలు .టూరిస్ట్ భద్రత ఉంటుంది .
- న్యు కలడోనియా సాహిత్యం -ఇటీవలి కాలం లోనే వచ్చింది .స్త్రీ రచాయితలు-స్టెఫెనీ వైజేర్ రేలీన్ రామ్సే –‘’ది లిటరేచర్ ఆఫ్ ది ఫ్రెంచ్ ఫసిఫిక్ రాసింది .ఇది గొప్ప విశ్లేషణాత్మక రచన.అంతకు ముందు ‘’నైట్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ –ఎకల్చరల్ హిస్టరీ ఆఫ్ కనాకీ –న్యు కలడోనియా రచించింది .
- ముఖ్య పుస్తకాలు –మిస్ బెంసాన్స్ బీటిల్ –రాఖేల్ జాయ్స్ ,ది రెక్-డుయీ గోరేడే,జీన్ మేరీ టిజిబౌ-ఆత్మకథ ,దిషార్క్ గాడ్ –చార్లెస్ మాంట్ గోమరి.వగైరా .
- సశేషం
- మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-7-20-ఉయ్యూరు