- ప్రపంచ దేశాల సారస్వతం
- 165-నియే దేశ సాహిత్యం
- దక్షిణ ఫసిఫిక్ సముద్రం లో చిన్న ఐలాండ్ దేశం న్యు .లైం స్టోన్ క్లిఫ్స్,కోరల్ రీఫ్స్ డైవ్ సైట్స్ ,మైగ్రేటింగ్ వేల్స్ జులై నుంచి అక్టోబర్ దాకా ఇక్కడి జలాలో తిరుగుతూ కనువిందు చేస్తాయి .రాజధాని –అలోపీ .జనాభా –ఒక వెయ్యి ఆరు వందల ఇరవై నాలుగు మాత్రమె .కరెన్సీ-న్యూజిలాండ్ డాలర్ .అధికారభాష –ఎకలేషియా న్యుప్రోటేస్టెంట్ మతం .ఇంగ్లీష్ అధికారభాష .8ఏళ్ళ ఫ్రీ కంపల్సరి విద్య .ఒకేఒక ప్రైమరీ స్కూల్ ఉన్నది .వేల్ వాచింగ్ , డైవింగ్ ,యాచింగ్ ఆదాయ వనరులు .లిము పూల్స్ ,ఉటుకు బీచ్ ,పలహాకేవ్ లు దర్శనీయలు .యాత్రా సురక్షిత దేశం .
- నియే దేశ సాహిత్యం –ఈఐలాండ్ దేశం లో ఒకే ఒక రచయిత,కవి నావలిస్ట్ జాన్ పూలే ఉన్నాడు .ఆయన ‘’ది షార్క్ దట్ ఏట్ ది సన్’’అంటే సూర్యుని తిన్న షార్క్ నవల1992లో రాశాడు .బర్న్ మై హెడ్ ఇన్ హెవెన్ 2000లో ,రెస్ట్ లెస్ పీపుల్ 2004నవలలతోపాటు చాలాకవితలు రాశాడు
- 166-నార్ ఫోక్ ఐలాండ్ దేశ సాహిత్యం
- దక్షిణ ఫసిఫిక్ లో ఆస్ట్రేలియాకు చెందిన అతి చిల్ల ఐలాండ్ నార్ ఫోక్ ఐలాండ్ దేశం .పైన్ వృక్షాలు ,శాండీ బీచెస్ ,ఉన్న ఐలాండ్ .బౌంటీ మ్యుటినీర్స్ ఆవాస స్థానం .హిస్టారికల్ రూయిన్స్ కు ప్రసిద్ధి . రాజధాని కింగ్ స్టన్.జనాభా -2,169.కరెన్సీ –ఆస్ట్రే లియన్ డాలర్ .అన్నిరకాల క్రిస్టియన్లు ఉన్నారు .టూరిజం, బీఫ్ ,ఎగ్స్, పౌల్ట్రీ ఆదాయ వనరులు .ఇంకం టక్స్ లేని దేశం .ఫిలిప్ ఐలాండ్ ,,నేషనల్ పార్క్ ,ఎమిలిబే యత్రాస్థలాలు .సురక్షితం .
- నార్ ఫోక్ ఐలాండ్ సాహిత్యం –కొల్లీన్ మార్గరెట్టా మెకలో- ఒకామె మాత్రమె రచయిత్రి .న్యురోసర్జన్ .భర్త రాబిన్సన్ –నార్ఫోక్ ఐలాండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ …దిధార్న్ బర్డ్స్,నవల ప్రపంచ వ్యాప్తంగా 30మిలియన్ కాపీలు అమ్ముడై రికార్డ్ సృష్టించింది .లేడీస్ ఆఫ్ మిసలోన్ఘి నవల రాసింది .2008లో వివాదాస్పద నవల –ది ఇండి పెండేన్స్ ఆఫ్మిస్ మేరీ బెన్నెట్ రాసింది .ఇతరరచనలు –ఎ క్రీడ్ ఫర్ దిధర్డ్ మిల్లినియం ,ది సాంగ్ ఆఫ్ ట్రాయ్,మొర్గాన్స్ రన్,దిటచ్ ,ఏంజెల్స్ పస్,బిట్టర్ స్వీట్ .
- మాస్టర్స్ ఆఫ్ రోమ్ సిరీస్ గా –ది ఫస్ట్ మాన్ ఇన్ రోమ్ దిగ్రాస్ క్రౌన్ ,ఫార్ట్యూన్స్ ఫేవరెట్స్,సీజర్స్ వుమెన్ ,సీజర్,దిఅక్టోబర్ హార్స్ ,అంటని అండ్ క్లియోపాట్రా రాసింది .
- మర్డర్ సిరీస్ గా –ఆన్, ఆఫ్ ,టూమెని మర్డర్స్ ,నెకేడ్ క్రుయల్టి,దిప్రాడిగల్ సన్,సీంస్ ఆఫ్ ది ఫ్లెష్ .
- ఆత్మకదగా –దికరేజ్ అండ్ ది విల్ రాసుకొన్నది .జ్ఞాపకాలుగా ‘’అలీఫ్ వితౌట్ ది బోరింగ్ బిట్స్ రాసింది
- ఆర్చ్ బాల్డ్ ప్రైజ్ ,ఆమె వేసిన పెయింటింగ్ కు లభించింది .డాక్టర్ ఆఫ్ లెటర్స్ గౌరవం పొందింది .
- ఈమె ఆస్ట్రేలియాలో 1-6-1937పుట్టి ,నార్ ఫోక్ ఐలాన్డ్స్ లో 29-1-2015న 78వయేత చనిపోయింది .
- సశేషం
- మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-7-20-ఉయ్యూరు
వీక్షకులు
- 978,576 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మాఘమాసం సందర్భంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత
- మాఘమాసం సందర్భంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహిస్తున్న ఆలయ ధర్మకర్త బ్రహ్మశ్రీ గబ్బిట దుర్గాప్రసాద్, ప్రభావతి దంపతులు
- ‘’బాపు’’ దర్శన౦ అనే ‘’విధాత తలపు –బాపు ‘-2’
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.20 28.01.2023
- అరుణ మంత్రార్థం. 5వ భాగం.28.1.23
- (no title)
- ’ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -11(చివరి భాగం )
- అరుణ మంత్రార్ధం.4వ భాగం.27.1.23
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.19
- ’ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -10
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,919)
- సమీక్ష (1,274)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (298)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (332)
- సమయం – సందర్భం (835)
- సమీక్ష (24)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (357)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు