రక్షక భట వ్యవస్థ లేకుండా శాంతి భద్రలతో పాలించిన కార్త వీర్యార్జునుడు
అని హైహయ వంశం లో పుట్టిన దత్తాత్రేయ వరప్రసాది అనీ,ఏఇద్దరి మధ్య తగాదాలువచ్చినా ప్రత్యక్షమై తగవు తీర్చి శాంతి చేకూర్చేవాడని మహా పౌరాణికులు బ్రహ్మశ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రిగారు పురాణప్రవచనం లో తరచుగా చెబుతూ ఉంటారు .
హైహయ వంశము ఒక పురాణాలలోని ప్రసిద్ధమైన వంశము. మహావిష్ణువు లక్ష్మీదేవి అశ్వం రూపంలో ఉండగా జన్మించిన హైహయుని ద్వారా ఈ వంశం వృద్ధిచెంది౦ది. కార్తవీర్యార్జునుడు ఈ వంశానికి చెందిన వీరుడు. హయము అంటే గుర్రం .
సూర్యుని కుమారుడు రేవంతుడు ఉచ్చైశ్రవం మీద వైకుంఠానికి వస్తుండగా చూసిన లక్ష్మీదేవికి మనోవికారం కలిగింది. గమనించిన విష్ణుమూర్తి బడబ (ఆడగుర్రము) గా భూలోకంలో జన్మించమని శాపమిస్తాడు. కలత చెందిన లక్ష్మీదేవి ప్రార్థించగా, తనకు పుత్రుడు జన్మించిన తరువాత శాపవిమోచనమౌతుందని అనుగ్రహిస్తాడు. భూలోకానికి వచ్చిన లక్ష్మి తమసా, కాళింది నదుల సంగమ స్థలంలో శివున్ని ధ్యానిస్తూ కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసింది. శివుని కోరిక మేరకు విష్ణువు అశ్వరూపుడై భూలోకంలో లక్ష్మిని చేరి ఆనందంగా విహరించారు. కొంతకాలానికి లక్ష్మీదేవి దివ్య సుందరుడైన కొడుకును ప్రసవించింది. ఆమెకు శాపవిమోచనమై వైకుంఠం చేరినది.
యయాతి కొడుకు తుర్వసుడు పుత్ర సంతతికై తపస్సు చేస్తున్నాడు. విష్ణువు ప్రత్యక్షమై తాను సృష్టించిన పుత్రుడిని తెచ్చి పెంచుకొమ్మని ఆనతిస్తాడు. ఆ శిశువుకు జాతకర్మాదికం చేసి ఏకవీరుడు అని నామకరణం చేశాడు. ఇతనికి హైహయుడు అని పేరు కూడా ఉంది. ఇతడు రభ్యుని కూతురైన ఏకావళిని వివాహం చేసుకున్నాడు. వీరికి కలిగిన కుమారుడు కృతవీర్యుడు. కృతవీర్యుని కొడుకు కార్తవీర్యార్జునుడు.
హైహయులు తాము యదువంశపు రాజులమని చెప్పుకొన్నారు. హరి వంశము (34.1898) గ్రంథం ప్రకారం ఐదు హైహయ వంశముల వారు కలిసి తాళజంఘులని (విష్ణు పురాణము (4.11) అన్నారు. ఆ వంశాలు – వితిహోత్రులు, శర్యాతులు (శర్యాతి సంతతి), భోజులు, అవంతీయులు, తుండికేరులు. వీరు పశ్చిమ భారతం నుండి మధ్యభారతం (మాళ్వా ప్రాంతం) కు వలస వెళ్ళారు. వారిలో మహిష్మంతుడు స్థాపించిన మహిష్మతీ నగరం (హరి వంశం 33.1847) తరువాత వారి రాజధాని అయ్యింది. అదే ఇప్పటి “మహేశ్వర్” పట్టణం. మహిషుడనేవాడు ఈ నగరాన్ని స్థాపించాడని పద్మ పురాణము (6.115) లో ఉంది. హైహయులలో గొప్ప రాజైన కార్త వీర్యార్జునుడు “కర్కోటక నాగుడు” నుండి ఈ నగరాన్ని గెలుచుకొని తన రాజధాని చేసుకొన్నాడు. హైహయుల విజయ పరంపరలో ఉత్తరదేశ దండయాత్రలకు ఇక్ష్వాకు రాజైన సగరుడు అడ్డుకట్ట వేసి ఉండవచ్చును. కార్తవీర్యార్జుని మనుమడు, తాళజంఘుని కొడుకు అయిన వీతిహోత్రుని పేరుమీద హైహయులలో వీతిహోత్రులు ముఖ్య వంశమైంది. వీతిహోత్రుని కాలంలో వింధ్యకు ఇరువైపులా ఉన్న ప్రాంతం మహిష్మతి, ఉజ్జయిని రాజధానులుగా రెండు విభాగాలై ఉండవచ్చును. వీతిహోత్రుల చివరి రాజైన రిపుంజయుని అతని మంత్రి పులికుడు చంపేశాక పులికుని కొడుకు ప్రద్యోతనుడు రాజై ఉండవచ్చును (మత్స్య పురాణము 5.37). హైహయులు వేదవిద్యా పారంగతులని చెబుతారు.[1] నాగవ రాజ్యం అంతమైనాక ఆ రాజు వంశస్తుడు పురోహితుడైనాడు.[2] మధ్యయగంలో హైహయులు ముస్లిం రాజులతో యుద్ధాలకు తలపడి ఉండవచ్చును.[3]
కార్తవీర్యార్జునుడు..
ఈతడు కృతవీర్యుని కొడుకు.
హైహయ వంశరాజు.
అసలు నామం అర్జునుడు.
కృతవీర్యుని కొడుకు కాబట్టి కార్తవీర్యార్జునుడుగా వ్యవహారం.
.
వింధ్య పర్వతానికి దక్షిణంగా వున్న నర్మదా నదీతీరము లోని మాహిష్మతీ పురం ఇతని రాజధాని.
ఇతను దత్తాత్రేయ భక్తుడు.
దత్తాత్రేయుని వరం వల్ల సహస్ర బాహుడవుతాడు.
యుద్ధంలో సర్వదా జయమే కలుగుతుందనీ,
అపార రాజ్యసంపద కలుగుతుందనీ
వరం పొందుతాడు.
ఒక బంగారు రథం కూడా పొందుతాడు.
అది అతన్ని యేవేళప్పుడైనా యెక్కడికైనా తీసుకొని పోగలదు.
విఖ్యాతుడైన ఒక వ్యక్తి చేతులో తప్ప అతనికి మరణం వుండదు.
ఈ ఘన సంపద గురించి విని రావణుడు ఇతని మీదికి దండెత్తి వస్తాడు.
ఆ సమయములో కార్తవీర్యార్జునుడు వన విహారంలో వుంటాడు.నా రాక విని పారిపోయి ఉంటాడని రావణుడు యెగతాళి చేస్తూ వెళ్ళిపోయాడు.
తర్వాత నర్మదా ఒడ్డున శివపూజ చేసుకుంటూండగా కార్తవీర్యార్జునుని సహస్ర బాహువుల్లో చిక్కి నర్మదా నది పొంగి వచ్చి రావణుడి పూజాద్రవ్యాలన్నిటినీ తోసి పారేస్తుంది.(కార్తవీరుడు రావణుణ్ణి
తన వేయి బాహువుల మధ్య ఇరికించి ఊపిరాడకుండా చేశాడని . అప్పుడు పులస్త్యుడువచ్చి రావణుణ్ణి విడిపిస్తాడని ఒక కథనం కూడా వుంది. )
రావణుడికి కోపము వచ్చి దండెత్తి వెళతాడు. కార్తవీర్యార్జునుడు రావణుడిని ఓడించి బంధిస్తాడు. పులస్త్యుడు వచ్చి కార్తవీర్యుని బ్రతిమాలి రావణుడిని విడిపించుకొని తీసుకెళ్తాడు.
ఒకసారి ఆహారనిమిత్తం అగ్ని వస్తాడు.
గిరి నగరారణ్యాన్నంతటినీ భక్షించమని చెప్తాడు.
అక్కడే మైత్రావరుణ ముని యొక్క ఆశ్రమం వుంటుంది.అదీ దగ్ధమైపోతుంది.
మైత్రావరుణుడి కొడుక్కు కోపం వచ్చి కార్తవీర్యుని సహస్ర బాహువులనూ పరశురాముడు ఖండిచివేస్తాడని శాపమిస్తాడు.
అందుకు భయపడి మంచివాడిలాగా ప్రవర్తిస్తుంటాడు
కానీ కొడుకులు దుర్మార్గులై చెడ్డ పనులు చేస్తుంటారు.
ఒకసారి కార్తవీర్యుడు జమదగ్ని ఆశ్రమాన్ని దర్శిస్తాడు. జమదగ్ని భార్య రాజుకీ పరివారానికి సకలమర్యాదలూ చేస్తుంది. ఇంతమందికి ఎలా సపర్యలూ,భోజనాలూ
చేశారని అడుగుతాడు.మా దగ్గర నందినీ ధేనువు (కామధేనువు) వుంది. అది అడిగినవన్నీ ఇస్తుందని జమదగ్ని చెప్తాడు.
ఇటువంటి ధేనువు రాజుదగ్గర వుండాలి. మీ దగ్గర ఎందుకు? నాకిచ్చేయమంటాడు కార్తవీర్యుడు.
దానికి జమదగ్ని నిరాకరిస్తాడు.
దానితో కోపగించిన కార్తవీర్యుడు ఆశ్రమంలోనున్న వనాన్నంతా ధ్వంసం చేసి బలవంతంగా కామధేనువుని తీసికెళ్ళి పోతాడు.
పరశురాముడు ఆశ్రమానికి వచ్చి కార్తవీర్యుని దౌష్ట్యానికి
ఆగ్రహించి అతన్ని వెంటాడి అతని సహస్రబాహువులూ ఖండించి అతన్ని వధిస్తాడు.
ఆ తర్వాత కార్తవీర్యుని కొడుకులు పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో వచ్చి జందగ్నిని చంపేసి వెళ్తారు.
పరశురాముడు ఆశ్రమానికి తిరిగివచ్చి విషయము తెలుసుకొని క్షత్రియులందరినీ నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఇరవైఒక్క మార్లు రాజులందరినీ సంహరించి ఆ నెత్తురుతో అయిదు మడుగులు చేసి పితృ తర్పణం చేస్తాడు.
ఆ ప్రదేశమే శమంతపంచకమైంది.
ఆ తర్వాత కురుపాండవులు అక్కడ యుద్ధం చేస్తారు. అదే కురుక్షేత్రం.
కార్తీక శుక్ల అష్టమి…
శ్రీ కార్తవీర్యార్జున జయంతి… ఈ రోజంతా ”శ్రీ కార్తవీర్యార్జున మహామంత్ర పఠనం వలన నానావిధ మంచి జరుగును.
చాలా అద్భుతమైన రోజు…….
సుమంతో,సుమంతో,శ్రీ కార్తవీర్యార్జునాయ నమః..
అనే మంత్రముతో..జపిస్తే..
పోయిన వస్తువులు,
ఇంటినుండి వెల్లిపోయిన మనుషులు,
ధర్మముగా రావలసిన పైకము, ఉద్యోగము, వస్తువులు,
పశువులు,
వివాహము కావలసిన వారు,
ఇలా జపిస్తే, తప్పక తిరిగి పొందగలరు,
సమస్య తీవ్రత ను బట్టి జపము ఎక్కువగా చేసుకున్నట్లు అయితే త్వరలో అభీష్ట సిద్ది కల్గును!
కార్త వీర్యార్జునొ నామ రాజా బాహు సహస్రవాన్
తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే….
ఈ పై మంత్రమును ధృడ సంకల్పంతో చేసేవారికి చాలా వేగవంతమైన మంచి ఫలితం తప్పక కలిగితీరుతుంది…..
ఈ మంత్రాన్ని మన మనసులో కోరిక చెప్పుకుని రోజూ పూజ చేసేటప్పుడు స్మరిస్తే పోయినవన్ని తిరిగి మనకు దక్కుతాయి..
భాగవత భారత మారకం డేయ పురాణ ,ఉత్తర రామాయణాల ప్రకారం -కార్త వీర్యుని పురోహితుడు గర్గ మహర్షి .గర్గుని ఆదేశంతో దత్తాత్రేయుని ఆరాధించాడు .దత్తాత్రేయుడు వివిధ రూపాలలో వింతవింత చేష్టలతో భక్తులను పరీక్షిస్తాడని మనకు తెలుసు .ఒకసారి అలాంటి పరీక్షే కార్తుని పై చేశాడు . రోటా పుట్టించే అపానవాయువు వదిలాడు దాని నుంచి నుంచి పుట్టిన అగ్నికి కార్త వీర్యుని బాహువులు మాడిపోయాయి .అయినా వదలక ధ్యానం చేస్తూనే ఉన్నాడు . ‘’నేను భార్యాసక్తుడను ఎందుకు నన్ను కొలుస్తావు ‘’?అని అడిగాడు దత్తుడు .’’నువ్వు విష్ణు మూర్తివని నాకు తెలిసి సేవిస్తున్నాను ‘’అని చెప్పి స్తోత్రం చేశాడు కార్త .దత్తుడు సంప్రీతి చెంది వరం కోరుకోమనగా ‘’నాకు సహస్ర బాహువులు ఉండాలి .యుద్ధం లో ఎప్పుడూ ఓడిపోకూడదు. రాజ్యం కావాలి ‘’అని కోరాడు .సరే అని అనుగ్రహించాడు దత్తాత్రేయుడు .
ఒక సారి అగ్ని వచ్చి తనకు ఆహారం కావాలని అడిగాడు .గిరినగరారణ్యం అంతా స్వాహా చేసి ఆకలి తీర్చుకోమన్నాడు వీర్యుడు .ఆ అరణ్యం లో వరుణుడికుమారుడు మైత్రావరుణుడి. ఆశ్రమం కూడా ఉంది.అగ్ని దాన్నీ కాల్చేశాడు .మైత్రావరుణుడికి కోపం వచ్చి అతడి సహస్ర బాహువులను పరశురాముడు ఖండిస్తాడని శపించాడు . ఆశాపానికి భయపడి అప్పటి నుంచి ధర్మకార్య, ధర్మ సత్య ప్రవర్తకుడయ్యాడు .కానీ కొడుకులు అవినీతిపరులైన నికృస్టులు . బలవీర్యలతో తండ్రిపేరు చెప్పుకొంటూ దుష్కార్యాలెన్నో చేశారని భారతం చెప్పింది .
రావణాసురుడికి కార్తవీర్యుని బలదర్పాలు తెలిసి అతడితో యుద్ధం చేయాలని తహతహ తో వచ్చాడు .అప్పుడు కార్తుడు నర్మదా తీరం లో స్త్రీలతో కేళీ విలాసాలలో ఉన్నాడు .రావణుడు వచ్చి నవ్వుతూ ‘’నాతో యుద్ధం చేస్తావా ?’’అని అడిగాడు .వెంటనే యుద్ధం చేసి వాడిని బంధించాడు .రావణుడి తండ్రి పులస్య బ్రహ్మవచ్చి బ్రతిమాలి చేర విడిపించాడు .కార్తునికోడుకులు జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్లి ఆయనా కుమారుడు లేని సమయం లో మహర్షి కామదేనువును,దూడను అపహరింఛి తీసుకుపోయారు .జామదగ్ని పరశురాముడు వచ్చి విషయం తెలిసి ,కోపం తో మాహిష్మతీ పురం వెళ్లి కార్తవీర్యుని చంపాడు అని భారతం చెప్పింది .
మార్కండేయం,ఉత్తరారామాయణాలలో లో కార్తికేయుడు వేటకు వెళ్లి ,అలసి జమదగ్ని ఆశ్రమానికి వస్తే మహర్షి రాజును గౌరవించి ఆతిధ్యమిచ్చి తన కామధేనువు ప్రభావం తో సమస్త పదార్ధాలు కల్పించి రాజుకు ,పరివారానికి బ్రహ్మా౦డ మైన విందు అందించాడు .సర్వము ప్రసాదించే ఆ కామదేనువును తనకిమ్మని రాజు కోరాడు .ఇవ్వనన్నాడు మహర్షి .తన సేనను పురికొల్పి మహర్షించి చంపించాడు కార్తుడు .కాని కామధేనువు వాళ్లకు పట్టు బడలేదు .కామదేనువునుంది భటులు జన్మించి రాజు సైన్యాన్ని చెల్లా చెదరు చేసేశారు .తర్వాత వచ్చిన పరశురాముడు తండ్రి మరణం తెలుసుకొని కార్తవీర్యుని నగరం పై దండెత్తి ,వాడితో యుద్ధాలు చేసి ఓడించితన గండ్ర గొడ్డలితో కసితీరా చంపి ఆ మాహిష్మతీ నగరాన్నితగలబెట్టాడు . క్షత్రియ జాతి పై ఆగ్రహించి ఇరవై ఒక్క మార్లు దండ యాత్ర చేసి క్షత్రియ సంహారం గావిస్తాడు. తదనంతరం అశ్వమేధ యాగం చేసి కశ్యప మహర్షి కి భూమిని దానం చేస్తాడు. అందుకే భూమిని ‘’కాశ్యపి’’ అనే పేరు వచ్చింది. . అని ఉన్నది .
మరో కధనం –విష్ణుమూర్తి చేతిలోని సుదర్శన చక్రం ఆయన విజయాలన్నిటికీ తానె కారణం అనే గర్వం తో విర్రవీగుతోంది .విజయాలుతనవీ కీర్తి ప్రతిస్టలు శ్రీహరివీ అని భావించేది .గ్రహించిన విష్ణుమూర్తి దాన్ని భూలోకం లో ‘’సొట్ట చేతులతో ‘’జన్మించమని శపిస్తాడు .దానితో దిమ్మతిరిగి బొమ్మకనిపించిసుదర్శనుడు మన్నించమని, శాపాన్ని ఉపసంహరించమని ప్రార్ధిస్తాడు .అలాగే అంటూ తాను దత్తాత్రేయ అవతారం ఎత్తి శాపాన్ని ఉపసంహరిస్తానన్నాడు .అలా సొట్ట చేతులతో పుట్టి దత్తుని అనుగ్రహం తో శాపం నుంచి విముక్తుడౌతాడు సుదర్శనుడుఅనే విష్ణు చక్రం .
బ్రహ్మ పురాణం లో యోగియగుటచే నా కార్త వీర్యార్జునుడు వర్షించుటలో వర్జన్యుడాయెను. మేఘముతానేయయ్యెను. వింటివారిదెబ్బలచే కఠినమైన చర్మముగలబాహుసహస్రముచే నాతడు శరత్కాలమందు వేయికిరణములచే వెలుగొందు భాస్కరుడట్లు తేజరిల్లెను. అని ఉన్నది
మరో విశేషం –షట్చక్ర వర్తులలో కార్తవీర్యార్యర్జునుడు ఆరవవాడు .ముందున్న అయిదుగురు హరిశ్చంద్ర ,నల ,పురుకుత్స ,పురూరవ ,సగరులు .
ఇంకో విశేషం –కుమార స్వామి క్షేత్రాలలో పళని తర్వాత అతిముఖ్యమైంది కుంభకోణం దగ్గర ఉన్న స్వామి మలై క్షేత్రం అతిపురాతనమైన ఈ ఆలయాన్ని కార్త వీర్యార్జునుడు కట్టించాడు అతడి శిల్పం ఆలయం లో ఉన్నది . భృగు మహర్షి మహా తపస్సంపన్నుడు. ఆయన ఒకసారి తపస్సు ప్రారంభించేముందు తన తపస్సుని ఆటంక పరచిన వారికి అంతకు ముందున్న జ్ఞానమంతా నశిస్తుందనే వరం పొంది తీవ్ర తపస్సు ప్రారంభించాడు. ఆ తపోశక్తి ఊర్ధ్వ లోకాలకి వ్యాపించగా, ఆ వేడిమిని భరించ లేని దేవతలు పరమ శివుని శరణు జొచ్చారు. అప్పుడు ఈశ్వరుడు ఆ తపశ్శక్తి దేవ లోకాలకి వ్యాపించకుండా తన చేయిని భృగు మహర్షి తలమీద అడ్డంగా పెట్టాడు. దానితో పరమ శివునంత వానికి జ్ఞానం నశించింది. తన పూర్వ జ్ఞానాన్ని తిరిగి పొందటానికి ఆయన జ్ఞాన స్వరూపుడైన సుబ్రహ్మణ్యస్వామి దగ్గర ఈ క్షేత్రంలో ప్రణవోపాసన పొందాడు. నేను ప్రణవ మంత్రార్ధాన్ని బోధిస్తున్నాను గనుక నేను గురువుని, నువ్వు అత్యంత భక్తి శ్రధ్ధలు గల శిష్యునిగా వింటానంటే చెప్తానన్నాడుకార్తికేయుడు . ఇంకేముంది. కుమారుడు గురువైనాడు. తండ్రి శివుడు శిష్యుడై అత్యంత భక్తి శ్రధ్ధలతో కుమారుడు ఉపదేశించిన ప్రణవ మంత్రార్ధాన్ని విని పులకరించి పోయాడు.
కనుక కార్తవీర్యార్జునుడు ‘’మామూలోడు కాదు ‘’షట్చక్ర వర్తులలోఒకడు .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-7-20-ఉయ్యూరు