డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -3
శిధిల హంపీ వైభవం
శ్రీ కృష్ణ దేవరయలనాటి విజయనగరం ఇప్పటి లండన్ నగరం కన్నా విశాలమమైనదని చరిత్రకారులు రాశారు .ఒకప్పుడు దర్వాజా అనబడే ఇప్పటి దరోజి అనే ఊరు మొదటి ప్రాకార మహాద్వారం .రామచంద్రగారి కమలాపురానికీ దీనికి మధ్యదూరం 20మైళ్ళు .ఇక్కడినుంచి తుంగభద్రానదీ తీరం వరకు వ్యాపించిన నగరమే విజయనగరం .ఎంతటి మహా నగరమో ఆశ్చర్యమేస్తుంది. కమలాపురానికి దగ్గరలోనే సార్వభౌమూల అన్తఃపురాలున్నాయి .ఆనగరం గొప్ప విడ్యాపీఠం.పురందరదాసు కనకదాసు ,వ్యాసరాయ తీర్ధులు మొదలైన మహా వాగ్గేయకారులు ,విద్వాంసులున్న ఊరు .పెద్దనామాత్యుడూ కమలాపురం లోనే కాపురం ఉండి ఉండచ్చు అంటారు రామ చంద్ర .బహమనీ సుల్తాన్ 2లక్షల సైన్యం తో వచ్చి’’ ఓవర్ టైం’’కూడా చేసి విజయనగర వైభవాన్ని ఆరు నెలలలో ధ్వంసం చేశాడు .అంతటి మహాపట్నం నేడు ‘’హాళుపట్నం ‘’అంటే పాడైపోయిన ఊరు అయింది .కానీ కమలాపురం చెక్కు చెదరలేదు .
ఇప్పుడు కమలాపురం నుంచే విజయనగర శిదిలాలుప్రారంభమౌతాయి . ఈ ఊరిలో ఒక మ్యూజియం లో శిధిలాలు భద్రపరచారు .ఈ గ్రామానికి హంపీవిరూపాక్ష దేవాలయం కేవలం నాలుగు మైళ్ళదూరం లో ఉంది .ఈఊరు మెట్టమీద ఉంటె, హంపీ తుంగభద్రతీరం లో లోయలో ఉంటుంది .అక్కడికి వెళ్ళాలంటే హేమకూట౦ అనే కొండ దారిదిగిపోవాలి. కొండ శిఖరం పై విఘ్నేశ్వరాలయం ,కొండ లోయలో విరూపాక్షాలయం ఉంటాయి .హంపీ శిధిలాలో ఇప్పటికీ పూజలు అందుకొంటున్న దేవాలయాలు -విరూపాక్ష ఆలయం ,చక్రతీర్ధ కోదండరామాలయం ,కమలాపురం శివారులోని మాల్యవంత రామాలయం ,హేమకూట శిఖర విఘ్నేశ్వరాలయం ,బడివే లింగాలయం ,ఎల్లమ్మ దేవాలయం .రామాలయం లో రామ లక్ష్మణ విగ్రహాలు మాత్రమె ఉంటాయి .అంటే సీతాపహరణం జరిగాక రామ సోదరులు ఇక్కడికి వచ్చారనటానికి గుర్తు .
శిదిలపట్టణం లో ఒక పెద్ద విఘ్నేశ్వరాలయం హేమకూటం పై ఉన్నది.ఈ దేవుడిని ‘’కడళే కాళ్ బెణకప్ప’’అంటారు .అంటే సెనగగింజ వినాయకుడు . రెండవ చిన్న వినాయకుడిని ‘’సాస్వీ రేళ్ బెణకప్ప’’అంటే ఆవగింజ వినాయకుడు అంటారు .పెద్దాయన ఎత్తు20అడుగులు చిన్నాయన ఎత్తు 10అడుగులు ..పురందరదాసు ‘’పిళ్ళారి గీతాలు ‘’లోని లంబోదరుడు ,హేమకూట సి౦హాసనుడు,శ్రీ విరూపాక్ష స్వరూపుడు ఈ పెద్దవినాయకుడే
కృష్ణ దేవరాయలు తన విజయ చిహ్నాలను విజయనగరం లో నిర్మించాడు దక్షిణాన కన్యాకుమారి వరకు జయించిఅ తర్వాత కమలాపురానికీ హాస్పేట్ కు మధ్య హాస్పేట దగ్గరలో ‘’అనంతశయనం ‘’ఆలయం కట్టించాడు .ఇది తిరువనంతపురం అన౦త పద్మనాభాలయానికి పూర్తి నమూనాదేవాలయం .ఇప్పుడు ‘’అనంతసేన్ గుడి ‘’అంటున్నారు .కళింగ విజయం తర్వాత రాయలు ఏకఖండ ఉగ్ర నరసింహవిగ్రహం సి౦హాచలానికి ప్రతిరూపంగా నిర్మించాడు .ముఖలింగాని ప్రతిరూపం గా ‘’బడివేలింగ ‘’ను స్థాపిచాడు .బదివే అంటే చాలాపెద్దది అని అర్ధం బడా లాగా .విజయనగర శివలింగాలన్నిటి కంటె ఇది పెద్ద లింగం .ఇప్పుడు మిగిలి ఉన్నది ఒక్క ‘’భువన విజయ సభాభవనం ‘’మాత్రమె .ఆ నాడు ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుచి దశమి వరకుసంరంభంగా జరిగిన మహర్నవమి దసరా ఉత్సవాలు నేడు ‘’మహర్నవమి దిబ్బ ‘’గా చూసి ఊహించుకోవాల్సిందే .ఆనాడు పూజలందుకొన్న కళా నిలయమైన హజార రామస్వామి గుడి , రత్నాల రాసులు పోసి అమ్మిన వీధిలో ఉన్న కృష్ణస్వామి గుడి శిధిలావ శేషాలై కన్నీరు తెప్పిస్తాయి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-7-20-ఉయ్యూరు